NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతు ఖాతాల్లో నిధులు !!
యాసంగి సీజన్ లో మిగిలిపోయిన రైతు భరోసాకి సంబంధించిన పెండింగ్ డబ్బులు సోమవారం నుంచి మూడు రోజులలో సర్ధుబాటు చేసి తక్షణమే రైతు భరోసా బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మండుతున్న ఎండలలో చల్లని కబురు !!
రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తుండగా 7, 8, 9 తేదిలలో అన్ని జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాలకు పంటలు నష్టపోవడం, కరంట్ పోల్స్ పడిపోయే అవకాశాలు ఉంది. కావున రైతులు జాగ్రత్తలు తిసుకోవలాని మరియు వర్షానంతరం 1-2 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
గుంటూరు మిర్చి మార్కెట్ కి వేసవి సెలవులు !!
తీవ్రమైన ఎండల కారణంగా పని చేయడం కష్టంగా ఉంటుంది. ప్రతి ఏడాది వేసవి సెలవుల్లగా ఈ సంవత్సరం గుంటూరు మిరప మార్కెట్ యార్డ్ కు సెలవులు మొదలవుతున్నాయి. ఈ నేల 11 నుండి జూన్ 9 వరకు వేసవి సెలవులు గుంటూరు వ్యవసాయ కమిటి చైర్మన్ తెలిపారు. మిరప అమ్మాలనుకున్న రైతులు ఈ నేల 10 తారీకు లోపు అమ్ముకోవచ్చు లేదంటే జూన్ 9 వరకు వేచి ఉండాల్సి వస్తుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మండుతున్న ఎండలు.. వందేళ్ల రికార్డు బ్రేక్ ...!!
దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. రికార్డు స్థాయిలో 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. రానున్న ఐదురోజుల్లో దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీయనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో సైతం వేడి గాలులు మరియు ఉష్ణోగ్రత సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట నష్టం, భూగర్భ జలాలు క్షీణించడం జరుగుతుంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత చర్యలను తీసుకోగలరని మనవి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్ష సూచన !!
తెలంగాణలో 14 జిల్లాల్లో ఏప్రిల్ 29 న ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాసం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ తెలిపింది. నిర్మల్, కుమురం భీమ్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో ఉరుమాలతో కూడిన వర్షం కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 36-40 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పౌల్ట్రీ ఫార్మ్ చేయాలనుకుంటున్నారా ?
పౌల్ట్రీ ఫార్మ్ ఒక అనువైన వ్యాపారం. చాలా మందికి పౌల్ట్రీ ఫార్మ్ మొదలుపెట్టాలని ఉన్నా, దీనికి సంబంధించిన శిక్షణ ఎక్కడ దొరుకుతుందనే సందేహం ఉంటుంది. అయితే సెంట్రల్ ఏవియన్ రెసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు, ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(EDP) లో బాగంగా మే 13 నుండి మే 17 వరకు శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు Online మరియు Offline విధానంలో హాజరు కావచ్చు. దీనిలో పౌల్ట్రీ కోళ్ల పెంపకం, నాణ్యమైన గుడ్ల ఉత్పత్తి గురించి దానితో పాటుగా ఆర్గానిక్ విధానంలో కోళ్ల పెంపకం, మరియు నాటుకోళ్ల పెంపకం, మార్కెటింగ్ విధానాలు ఇలా అనేక అంశాల మీద అవగహన కల్పిస్తారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నమోదు చేసుకోండి. ఈ కార్యక్రమం కోసం 2024 మే 10 వరకు నమోదు చేసుకోవచ్చు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఈ ఏడాది వర్షాలు జోరు..... !!
ఈ ఏడాది దేశంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే నమోదయ్యే అవకాశం ఉందని, జూన్ నుంచి సెప్టెంబరు వరకు అధికంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రుతుపవనాల ఆధారంగా 2024 వర్షాకాలం సీజన్ లో 106 శాతం మేర వర్షాలు కురుస్తాయని మరియు తూర్పు, వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే అన్ని చోట్లా నైరుతి రుతుపవనాలు బాగానే ప్రభావితం చేస్తాయని వాతావరణ శాఖ అంచన వేసింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆంధ్రప్రదేశ్ - మస్త్యకారుడికి అదృష్టం !!
కృష్ణా జిల్లా అంతర్వేదిలో ఓ మత్స్యకారుడు వలకి రెండు అరుదైన కచ్చిడి గోల్డెన్ చేపలు చిక్కాయి. వీటిని అంతర్వేదిపల్లిపాలెం ఫిషింగ్ హర్బర్‌లో వేలం వేయగా వీటిని కొనేందుకు వ్యాపారలు ఎగబడగా.... వారిలో ఓ వ్యక్తి 4 లక్షలు చెల్లించి, రెండు చేపలను కొనుగోలు చేశాడు. ఈ చేపలకు ఔషద గుణాలుండడం వలన సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్లు వేయడానికి ఉపయోగించే దారాల తయారికి మరియు వివిధ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఎండలనుండి పంటను కాపాడటానికి చీరలు !!
రోజు రోజుకి పెరిగిపోతున్న ఎండలను నుండి కాపాడడానికి సాదారణంగా షెడ్ నెట్లు, మల్చింగ్ బిందు సేద్యం చేసి కొంత వరకు మొక్కలను కాపాడుకోవచ్చు . కాని ఖమ్మం నగరం బల్లేపల్లి జయనగర్ కాలనీలో రైతు నల్లమల వెంకటేశ్వరరావు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను ఎండా నుండి రక్షించుకునేందుకు చీరలను స్తంభాలకు అడ్డుగా కట్టారు. ఇలా మొత్తం అరెకరం పొలంలో సుమారు 100 పాత చీరలను కట్టి మొక్కలను ఎండ తీవ్రత నుంచి రక్షించే ప్రయత్నం చేసారు. తోట ఇప్పుడు మొక్కలతో పాటు రంగుల చీరలతో కళకళలాడుతోంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
5 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు !!
తెలంగాణలో రాబోవు ఐదు రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రైతులు కోసిన పంటలను తడవకుండా జాగ్రత్త పడాలి మరియు రైతులు మారుతున్న ఉష్ణోగ్రతల అనుగుణంగా పంట దశ ( పూత, కాయ, కంకి, గింజ ఏర్పడే దశలలో ) ఆదారంగా వివిద జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. ప్రస్తుత వాతావరణ మార్పులకు వివిద రకాల తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది కావున ముందుగానే తెలుసుకోవడానికి నాపంట యాప్ ద్వారా ఉచిత పెస్ట్ అడ్వైసరి ద్వారా తగిన సూచనలు పొందండి.









