19 Apr , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పౌల్ట్రీ ఫార్మ్ చేయాలనుకుంటున్నారా ?

పౌల్ట్రీ ఫార్మ్ ఒక అనువైన వ్యాపారం. చాలా మందికి పౌల్ట్రీ ఫార్మ్ మొదలుపెట్టాలని ఉన్నా, దీనికి సంబంధించిన శిక్షణ ఎక్కడ దొరుకుతుందనే సందేహం ఉంటుంది. అయితే సెంట్రల్ ఏవియన్ రెసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు, ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం(EDP) లో బాగంగా మే 13 నుండి మే 17 వరకు శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు Online మరియు Offline విధానంలో హాజరు కావచ్చు. దీనిలో పౌల్ట్రీ కోళ్ల పెంపకం, నాణ్యమైన గుడ్ల ఉత్పత్తి గురించి దానితో పాటుగా ఆర్గానిక్ విధానంలో కోళ్ల పెంపకం, మరియు నాటుకోళ్ల పెంపకం, మార్కెటింగ్ విధానాలు ఇలా అనేక అంశాల మీద అవగహన కల్పిస్తారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో నమోదు చేసుకోండి. ఈ కార్యక్రమం కోసం 2024 మే 10 వరకు నమోదు చేసుకోవచ్చు.

16 Apr , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఈ ఏడాది వర్షాలు జోరు..... !!

ఈ ఏడాది దేశంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే నమోదయ్యే అవకాశం ఉందని, జూన్ నుంచి సెప్టెంబరు వరకు అధికంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే రుతుపవనాల ఆధారంగా 2024 వర్షాకాలం సీజన్ లో 106 శాతం మేర వర్షాలు కురుస్తాయని మరియు తూర్పు, వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే అన్ని చోట్లా నైరుతి రుతుపవనాలు బాగానే ప్రభావితం చేస్తాయని వాతావరణ శాఖ అంచన వేసింది.

15 Apr , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఆంధ్రప్రదేశ్ - మస్త్యకారుడికి అదృష్టం !!

కృష్ణా జిల్లా అంతర్వేదిలో ఓ మత్స్యకారుడు వలకి రెండు అరుదైన కచ్చిడి గోల్డెన్ చేపలు చిక్కాయి. వీటిని అంతర్వేదిపల్లిపాలెం ఫిషింగ్ హర్బర్‌లో వేలం వేయగా వీటిని కొనేందుకు వ్యాపారలు ఎగబడగా.... వారిలో ఓ వ్యక్తి 4 లక్షలు చెల్లించి, రెండు చేపలను కొనుగోలు చేశాడు. ఈ చేపలకు ఔషద గుణాలుండడం వలన సర్జరీ సమయంలో డాక్టర్లు కుట్లు వేయడానికి ఉపయోగించే దారాల తయారికి మరియు వివిధ మందుల తయారీలోనూ ఉపయోగిస్తారని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు.

13 Apr , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఎండలనుండి పంటను కాపాడటానికి చీరలు !!

రోజు రోజుకి పెరిగిపోతున్న ఎండలను నుండి కాపాడడానికి సాదారణంగా షెడ్ నెట్లు, మల్చింగ్ బిందు సేద్యం చేసి కొంత వరకు మొక్కలను కాపాడుకోవచ్చు . కాని ఖమ్మం నగరం బల్లేపల్లి జయనగర్ కాలనీలో రైతు నల్లమల వెంకటేశ్వరరావు సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్ తోటను ఎండా నుండి రక్షించుకునేందుకు చీరలను స్తంభాలకు అడ్డుగా కట్టారు. ఇలా మొత్తం అరెకరం పొలంలో సుమారు 100 పాత చీరలను కట్టి మొక్కలను ఎండ తీవ్రత నుంచి రక్షించే ప్రయత్నం చేసారు. తోట ఇప్పుడు మొక్కలతో పాటు రంగుల చీరలతో కళకళలాడుతోంది.


12 Apr , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

5 రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి వర్షాలు !!

తెలంగాణలో రాబోవు ఐదు రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రైతులు కోసిన పంటలను తడవకుండా జాగ్రత్త పడాలి మరియు రైతులు మారుతున్న ఉష్ణోగ్రతల అనుగుణంగా పంట దశ ( పూత, కాయ, కంకి, గింజ ఏర్పడే దశలలో ) ఆదారంగా వివిద జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం. ప్రస్తుత వాతావరణ మార్పులకు వివిద రకాల తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది కావున ముందుగానే తెలుసుకోవడానికి నాపంట యాప్ ద్వారా ఉచిత పెస్ట్ అడ్వైసరి ద్వారా తగిన సూచనలు పొందండి.

10 Apr , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ !!

ఎకరం వరికి ఇకపై రూ.42-45వేల వరకు, పత్తికి రూ.44-46వేలు, మొక్కజొన్నకు రూ.32-34వేలు, పసుపుకు రూ.87వేల వరకు పంట రుణం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సాంకేతిక కమిటీ బ్యాంకర్లకు సిఫార్సు చేసింది. మరియు ఆయిల్ పామ్ కు రూ42-44వేలకు, మిర్చికి రూ.82-84 వేలకు, టమాటాకు రూ.53-55వేలకు పెంచింది. అలాగే గొర్రెలు, మేకల యూనిట్లకూ రుణపరిమితి పెంచాలని సూచించింది.

06 Apr , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలంగాణకు వాతవరణ శాఖ చల్లని కబురు !!

తెలంగాణ రాష్ట్రంలో మార్చి నుండే ఎండలు మండిపోతున్నాయి. ఈ రెండు మూడు రోజుల్లో 43 డిగ్రీల పైగా ఎండ తీవ్రత పెరిగింది. దక్షిణాన ఎండలు దంచికొడుతుండడంతో ఇవ్వాలా రేపు వడ గాల్పులు ఉంటాయి. ఉత్తారాన రానున్న 4 రోజులు ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురవనున్నాయి. ఆదివారం నుండి 13 జిల్లాలకు ఉత్తరాది జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడనున్నాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.


01 Apr , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

చెట్టు నుండి ఉప్పొంగి వస్తున్న జలధార !!

భారీగా ఉన్న చెట్ల చిటారు కొమ్మల వరకు ఎలా నీరు అందుతుందని ఆశ్చర్యంగా ఉంటుంది కదా.... అయితే ఒక చెట్టును కత్తితో నరికితే ఒక్కసారిగా జలధార బయటకు వస్తుంది. ఇది అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం పాపికొండల నేషనల్ అటవీ ప్రాంతంలో నల్ల మద్ది చెట్టు నుంచి సుమారు 10 నుంచి 15 లీటర్ల వరకు నీరు రావడం గమనించామని అటవీ అధికారులు తెలిపారు.

27 Mar , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వ్యవసాయ మార్కెట్లకు వరుస సెలవులు !!

హోలీ, ఆదివారాల సందర్బంగా వ్యవసాయ మార్కెట్లకు వరుస సెలవులు వచ్చాయి. ఇప్పుడు మళ్ళి శుక్రవారం గుడ్ ఫ్రైడే మరియశని, ఆదివారాలలో వారాంతపు సెలవులు అయినందున వరుసగా సెలవులు ఉన్నాయి. నేడు ,రేపు మాత్రమే మార్కెట్ క్రయ విక్రయాలు జరుగుతాయి. కావున రైతులు ఈ విషయాన్ని తెలుసుకొని మార్కెట్ వెళ్లి ఇబ్బందులు పడకుండా ఇతర రైతులకు ఈ విషయాన్ని షేర్ చేయండి

27 Mar , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఆదివారం రైతు వెబినార్ సమావేశం !!

ఈ ఆదివారం 2024 మార్చి నెల 31వ తేదీన సాయంత్రం 6-55 గంటల నుంచి రైతు ఆన్లైన్ వెబినార్ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా రైతులకు బత్తాయి, చీనితోటల్లో వచ్చే తెగుళ్లు మరియు వాటి నివారణ పరిష్కార మార్గాల గురించి డాక్టర్. మధుసూదన్ రెడ్డి కూన్ రెడ్డి గారు మరియు సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా వరిపంటను, కూరగాయలసాగును మిశ్రమంగా పండించే అనుభవాల గురించి అభ్యుదయ మహిళా రైతు తాడిపోయిన విజయలక్ష్మి గారు వివరిస్తారు. మీ పంట మరియు ఇతర వ్యవసాయ సందేహాలను అడిగి వివరంగా తెలుసుకోవచ్చు. ఈ https://meet.google.com/wph-iwki-nsy లింకు ద్వారా హాజరు కాగలరు. గూగుల్ లింక్ గురించి తెలియని వారు +91 70328 98114 కు ఫోన్ చేసి ఏలా జాయిన్ కావచ్చు అని తెలుసుకోవచ్చు. ఈ సమావేశం గురించి మీ వంతుగా ఇతర రైతులకు చెప్పడం ద్వారా వారికి సహాయపడవచ్చు.