NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
🐄ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా ఆవులు !!
ఇటీవల రసాయన మందుల వాడకం తగ్గించి గో ఆధారిత వ్యవసాయం వైపు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించే విధంగా ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్తానం తమ గోవులను రైతులు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని మే నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఆవులు కావలసినవారు తమ పొలానికి సంబంధించి పట్టాదార్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, 100 రూపాయల స్టాంప్ పేపర్, ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ జిరాక్స్, తమ కాంటాక్ట్ నెంబర్ తో ఆలయ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అలా నమోదు చేసుకున్న రైతులకు మే నెల 24 న గోశాలలోని ఆవులను రైతులకు దత్తత ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వరి కొయ్యలు తగలబెడితే జరిమానా !!
దున్నే సమయంలో నాగళ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు వరికొయ్యలతోపాటు గడ్డిని కూడా కాలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల అధిక నష్టాలు వచ్చే అవకాశముందని వరి కొయ్యలు కాల్చే రైతులకు జరిమానా విధించాలని వ్యవసాయ శాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం పలు అంశాలపై సమీక్ష నిర్వహించి పంటల భీమ ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల విజ్ఞాప్తి మేరకు మట్టి నమూనా సేకరించి రిపోర్ట్ ఈ నెలాఖరుకు వచ్చేలా చూడాలని కోరారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
హైదరాబాదులో యాపిల్ తోట......🍎 !!
మామిడి, బొప్పాయి,అరటి,జామ, పుచ్చ, ద్రాక్ష, సపోటా లాంటి పండ్ల తోటలను మన దగ్గర ఎక్కువగా చూస్తూ ఉంటాము. కానీ కొన్ని పండ్ల తోటలు మన వద్ద సాగు అవ్వవు. ప్రస్తుతం రైతులు వినూత్న ఆలోచనలు, కొత్త పంటల సాగులో ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాదు దగ్గరలోని రంగారెడ్డి జిల్లాలో పులిమాములో ఒక ఆశ్రమంలో పురుగు మందులను వాడకుండా సేంద్రియ పద్దతిలో ఆపిల్ తోట సాగు చేసి దిగుబడులను పొందుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పచ్చిరొట్ట విత్తనాలపై 50 % సబ్సిడీ !!
తొలకరి జల్లులను ఉపయోగించి రైతులు పొలాల్లో జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి జీవ ఎరువులను సాగు చేసి, కలియ దున్నడం వలన భూసారం పెరుగుతుందని భావిస్తున్నారు. దీనికి తోడుగా తెలంగాణ ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలపై 50 శాతం సబ్సిడీతో పంపిణి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ ఏడాది 1,75,380 క్వింటాళ్ళ జీలుగ, 8,806 క్వింటాళ్ళ జనుము, 1,825 క్వింటాళ్ళ పెసర విత్తనాలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
చల్లని శుభవార్త ! ముందుగానే ఋతుపవనాల ఆగమనం.... !!
ఈ సంవత్సరం మంచి వర్షాలు నైరుతి ఋతుపవనాల ఆధారంగా కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సాధారణంగా ఏటా దక్షిణ ఆండమాన్ సముద్రంలోకి మే 22న నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, అక్కడ నుంచి వారం, పది రోజుల్లో కేరళను తాకుతాయి. కాని ఈ ఏడాది మాత్రం మూడు రోజులు ముందుగా అనగా మే 19నే దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం,నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశంఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం వెల్లడించింది. దీంతో కేరళలోకి జూన్ ఒకటో తేదీకల్లా ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అందనా వేస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఈ కంపెనీ పురుగు మందులపై నిషేధం !!
హైదరాబాద్ లోని మలక్‌పేట్ ప్రయోగశాలలో జరిపిన పరీక్షల్లో టీస్పేన్స్ కంపెనీ ప్రైవేటు లిమిటెడ్ కు చెందిన జీవ శిలింద్రనాశిని అయిన ట్ట్రైకోడెర్మా విరిడే 1.50% లిక్విడ్ ఫార్ములేషన్ వారి ఒక నిర్దిష్ట బ్యాచ్ నాసిరకం మందుగా తేలినట్లు వ్యవసాయ సంచాలకుడు బి. గోపి (ఐ. ఏ. ఎస్) గారు తెలిపారు. కావున దీనిని కొనే ముందు రైతులు తగిన జాగ్రత్త లు తీసుకోవాల్సిందిగా మనవి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రాష్ట్రంలో మరో 5 రోజులపాటు వర్షాలు.....☔☔
మంగళవారం ద్రోణి ప్రభావంతో భారీ వర్షపాతం నమోదైనట్లు మరియు వచ్చే ఐదు రోజులు వాతావరణం చల్లగా ఉండి, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఎన్నికలు జరిగే మే 13న కూడా తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని, గరిష్టంగా37 కనిష్టంగా24 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెలంగాణలో తడిసిన ధాన్యానికి మద్దతు ధర
తెలంగాణలో అకాల వర్షాలకు తడిసి ముద్దయిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఖమ్మంలో జరిగిన కిసాన్ మోర్చా సమావేశంలో తెలిపింది. అకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని, ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని, రాబోయే బడ్జెట్ సమావేశం తర్వాత రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే ఆగస్ట్ 15 లోపు రుణ మాఫీ చేస్తామని తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నష్టపరిహారంగా 10 వేల రూపాయలు !!
వడగండ్ల వాన కారణంగా యాసంగి సీజన్ లో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం నిధులను పంపిణి చేయనున్నట్లు వ్యవసాయ మంత్రి తెలిపారు. ఎకారాకు10 వేల చొప్పున రైతులకు ఇవ్వలని వీటిని సోమ మంగళవారాల్లో బదిలీ చేయబోతున్నట్లు తెలిపారు. దీంతో నష్టపోయిన రైతులకు కొంత ఉపసమనం కలిగినట్లవుతుంది
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వరిసాగు రైతులు తెలుసుకోండి !!
వరి కోతలను యంత్రాలతో కొసాక ఆ కొయ్యలను పశువులకు మేపడం మరియు గడ్డి కోసి తిసుకేల్లడం వలన ఉపయోగాలు ఉన్నాయి. అయితే వరికోయ్యలను కాలబెట్టడం వలన అధిక నష్టం జరుగుతుందని తెలియక కొందరు కలబెడుతున్నారు. కాలబెట్టడం వలన పర్యవన కాలుష్యంతో పాటు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు నశిస్తాయి మరియు భూసారం తగ్గిపోవడం జరుగుతుంది. పంట అనంతరం కాల్చకుండా నేలను మంచిగా కలియదున్నుకోవడం వలన భూమిలో సారం పెరిగి వచ్చే పంటకు పోషకాలను అందిస్తుంది.









