16 Nov , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కేంద్రం గుడ్ న్యూస్ - ఎర్ర చందనంపై ఆంక్షలు ఎత్తివేత

ఎర్ర చందనం అత్యంత విలువైన కలప. దీనిని ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఆంద్రప్రదేశ్ లో మాత్రమే పెరిగే ఈ ఎర్ర చందనంకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. దాదాపు గత 20 ఏళ్లుగా రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ ప్రాసెస్‌లో ఉంది, ఎన్నో అనుమతులు తీసుకుంటే తప్ప సాగు కోసం మరియు ఎగుమతి కోసం అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఎర్ర చందనం పై ఉన్న ఆంక్షలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ఎర్ర చందనం పెంపకంతో పాటు ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు.

09 Nov , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వరికి కనీస మద్దతు ధర నిర్ణయించిన ప్రభుత్వం..!

ఖరీఫ్ సీజన్లో కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు కామన్ రకం వరికి క్వింటాకు కనీస మద్దతు ధర రూ.2,183గా,గ్రేడ్-A రకానికి క్వింటాకు రూ.2,203గా నిర్ణయించామని JC అపరాజితాసింగ్ తెలిపారు. ఈ నెల 14 నుంచి ధాన్యం కొనుగోలుకై జిల్లాలోని 317 రైతు భరోసా కేంద్రాలను సిద్ధం చేశామని ఆమె స్పష్టం చేశారు.

03 Nov , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రానున్నా రోజుల్లో అక్కడక్కడ జల్లులు !!

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తూర్పు మరియు ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో గురువారం నాటి తాజా పరిణామం ఫలితంగా ఈ ప్రకటన చేసింది. రానున్న రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమ, దక్షిణ కోస్తాలో మరియు తెలంగాణ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ మరింత వివరించింది. గత రెండు రోజులుగా, అనేక జిల్లాలు వివిధ స్థాయిలలో వర్షపాతాన్ని చవిచూశాయి, ఈ వాతావరణ నమూనా నెల మొత్తం కొనసాగుతుందో లేదో అనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

30 Oct , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పెరిగిన ఉల్లిపాయ ధరలు !!

మొన్నటి వరకు టమోటా ధరలు భారీగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్ నగరంలో, ఉల్లిపాయల ప్రస్తుత మార్కెట్ ధర కిలో 70 నుండి 100 రూపాయలుగా ఉంది. ఖరీఫ్‌ పంటలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే వరకు ధరలు తగ్గే ఛాన్స్ లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇది ఇలా ఉంటే రైతుకు మాత్రం ఈ ధరలకి గిట్టుబాటు అవ్వట్లేదు.


14 Oct , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ప్రస్తుత సీజన్ వానాకాలమా ? ఎండకాలమా !!!

మండుతున్న ఎండలు ప్రస్తుత సీజన్ వానాకాలమా ? ఎండకాలమా అనిపించేలా ఉష్ణోగ్రత ఉంటుంది . రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవాలి లేదా చల్లటి వాతావరణం ఉండాలి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విచిత్ర వాతావరణం కనిపిస్తుంది. చాలాచోట్ల ఎండ వేడి, ఉక్కపోత. మరికొన్నిచోట్ల చదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల సీజన్లో వేడి పెరగడానికి కారణాలు సర్వసాధారణమే అంటున్నారు నిపుణులు. కాకపోతే ఈసారి భిన్న పరిస్థితులు ఎండలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడానికి వాయువ్య దిశ నుంచి వస్తున్న గాలులు పొడి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. నవంబర్‌ 2వ వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పింది..దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు.

12 Oct , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్దం !!

ఈ వానాకాలం సీజన్‌లో పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) సంస్థ సిద్ధమైంది. పత్తి కొనుగోలుకు మార్కెటింగ్‌ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సీజన్‌లో 1.09 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. దాదాపు 10 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 23 జిన్నింగ్‌ మిల్లులున్న 9 చోట్ల కాటన్‌ సీసీఐ ద్వారా ఈ నెల చివరి వారం నుంచి కొనుగోళ్లు చేపట్టనున్నది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.7,020గా ప్రకటించింది. అయితే తక్కువ ధరకు దళారులకు అమ్మి మోసపోవద్దని, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని అధికారులు పత్తి రైతులకు సూచిస్తున్నారు.

09 Oct , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పండ్ల పై స్టిక్కర్లు ఎందుకు అతికిస్తారు ?

మనం పండ్లు కొనే సమయంలో వాటిపై స్టిక్కర్లు ఉండటం గమనిస్తూ ఉంటారు. అసలు స్టిక్కర్లను ఎందుకు అతికిస్తారు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఆ స్టిక్కర్ల ద్వారా ఆ పండును ఏ విధంగా పండించారో మనం సులభంగా తెలుసుకోవచ్చు. 3 లేదా 4 నంబర్ తో మొదలైన స్టిక్కర్ సహజసిద్ధమైన ఎరువులు మరియు కెమికల్స్ సహాయంతో రెండు విధాలుగా పండించిన పండ్లకు మాత్రమే వేస్తారు. ఒకవేళ పండ్లపై ఉన్న స్టిక్కర్ 9 అనే నంబర్ తో మొదలు పెడితే వాటిని సహజసిద్ధంగా పండించారని అర్థం చేసుకోవాలి. సేంద్రీయ ఎరువులతో సహజసిద్ధంగా పండించినవి కావున ఇలాంటి పండ్లను తినడం మంచిది. పండ్లపై ఉన్న స్టిక్కర్ పై సంఖ్య 8 అనే నంబర్ తో మొదలైతే మాత్రం జన్యు మార్పిడి ద్వారా ఆ పండ్లను పండించారని అర్థం చేసుకోవాలి.అలాంటి పండ్లను తినకపోవడమే మంచిది.


03 Oct , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలంగాణకు పసుపు బోర్డు !!

దేశంలో పండే పసుపులో సుమారు 70 శాతం నిజామాబాద్ ప్రాంతంలోనే పండుతుంది. అందుకే పసుపుకు ప్రత్యేకంగా బోర్డు కావాలని సుమారు నాలుగు దశబ్దాలుగా రైతులు వివిధ రూపాల్లో పోరాటాలు, నిరసనలు చేశారు. ఎట్టకేలకు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు (Turmeric Board) మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ బోర్డును ఏర్పాటు చేస్తే ఆ సంస్థ కేవలం పసుపుపైనే దృష్టి పెడుతుంది. లేదంటే సలహాలు, సూచనలు, పరిశోధనల కోసం రైతులు స్పైసెస్ బోర్డుపైనే ఆధారపడాల్సి ఉండేది అని, పసుపు బోర్డు ప్రకటనతో తెలంగాణ రైతులకు శుభవార్త తేలింది. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు రైతుల సంబరాలు అంబారాన్ని అంటాయి.

21 Sep , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఒక్క ఉల్లిపాయ 9 కిలోలు - వరల్డ్ రికార్డ్ !!

సాధారణంగా, ఉల్లిపాయలు 100 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. మహాఅయితే అరకిలో వరకు ఉంటాయి. అలాంటిది ఏకంగా ఒక రైతు 9 కేజీల బరువు ఉన్న ఉల్లిపాయను పండించాడు. ఆ ఉల్లిపాయ బరువు సుమారుగా 8.9 కిలోలు ఉంది. ఇక దాని పొడవు విషయానికి వస్తే 21 అంగుళాలు ఉంటుంది. ఈ ఉల్లిగడ్డ ఏకంగా రికార్డును సృష్టించింది. యూనిటైడ్ కింగ్ డమ్ లోని గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన గారెత్ గ్రిఫిన్ అనే ఒక రైతు ఎన్నో సంవత్సరాలుగా పంటలు పండిస్తున్నాడు. ఈ రైతు ఉల్లిపాయను పండించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంచలనం సృష్టించాడు. 12 ఏళ్లు కష్టపడి ఎట్టకేలకు ఇటీవల ఓ భారీ ఉల్లిపాయను పండించాడు. దీనిని ఆయన ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో ప్రదర్శించారు.

14 Sep , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలంగాణలో పొల్లు పొల్లు వర్షాలు☔⛈️

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో మోతాదుకు మించి వర్షాలు కురిసే అవకాశముందని, రైతులు ఆధిక వర్షాలకు తమ పంటలను నష్టపోకుండా నీరు బయటకు పొయేట్లు ఏర్పాటు చేసుకొవాలి. అలాగే సోయా, పెసర, మినుము వంటి పంటలు కొత దశలో తగు జాగ్రత్తలు తీసుకొవాలి. మరింత సమాచారం కొసం నాపంట యాప్ నీ వీక్షించండి.