18 Jul , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నేడే రుణమాఫీ.......!!

తెలంగాణ రైతులు ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్న రుణమాఫీ డబ్బులు నేడు జమ కానున్నాయి. లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల రుణాలను ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఆగస్ట్ 15 లోపు లక్షన్నర నుండి రెండు లక్షల వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది.12 డిసెంబర్2018 నుండి 9 డిసెంబర్ 2023 లోపు స్వల్ప కాలిక పంటలకు తీసుకున్న రుణాలకు ఈ పధకం అమలు అవుతుంది. ఇందులో రుణాలు, వడ్డీతో కలిపి 2 లక్షల వరకు ప్రభుత్వం మాఫీ చేయనుంది.

16 Jul , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

23 నుంచి పొలం పిలుస్తోంది.... కార్యక్రమం !!

ఈ నెల 23 నుంచి పొలం పిలుస్తోంది అనే కార్యక్రమానికి క్షేత్ర స్థాయి పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. ఇందులో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో పాటు కేవీకేల శాస్త్రవేత్తలు పాల్గొంటారు. ఇందులో భాగంగా ఉదయం రైతు క్షేత్రాల్లో పర్యటించి పంటల స్థితిగతులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం ఆర్బీకేలో రైతులతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమాలఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంతో పాటు వ్యవసాయ. అనుబంధ శాఖల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలపై అవ గాహన కల్పించడం, సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు అందించడం చేస్తారు.

15 Jul , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

గ్రామం భాగుండాలంటే తినే తిండి బాగుండాలి !!

ప్రజలు కోవిడ్ సమయంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని ఇంట్లోనే కూరగాయలను పండించుకొని తినేందుకు ఉత్సాహం చూపించారు. కోవిడ్ తగ్గిన తరువాత అంతా సాదారంగా మారిపోయింది. కేరళలోని మోప్పడం గ్రామానికి చెందిన అరుణ్ అనే రైతు గ్రామస్థుల ఆరోగ్యం గురించి అలోచించి “అందరం కలిసి పండించుకొని కావలసినవి తీసుకుందాం” అని ప్రారంబించారు. దీనికి అందరు సమ్మతించి 20 ఎకరాల్లో కావలసిన అన్ని పంటలకు ప్రణాళిక సిద్దం చేసి శ్రీకారం చుట్టారు. కావలసిన సేంద్రియ ఎరువులను సొంతంగా తయారు చేసుకొని పిల్లలు పెద్దలు స్వచ్చందంగా సహాయపడుతూ ఇతర గ్రామాలకు కుడా పంచుతూ ఆరోగ్యంగా ఉండి ఆదర్శంగా నిలిచారు కదా...! మీ అభిప్రాయం ఏంటి.....

13 Jul , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రాష్ట్రంలో మొక్క జొన్న సాగు భారీగా పెరగనుంది..... !!

గత ఏడాది మక్కలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. పౌల్ట్రీకి దాణాగా వినియోగం, బిస్కెట్లు, పాప్కార్న్లు, ఇతర ఉత్పత్తుల కోసం మొక్కజొన్న అవసరముంది. మరోవైపు ప్రభుత్వం మద్దతు ధరల భరోసా కోసం మార్క్ ఫెడ్ ద్వారా కేంద్రాలు తెరిచింది. జీవ ఇంధనమైన ఇథనాల్ తయారీ కోసం మొక్కజొన్నలను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల నుంచి పరిశ్రమలు కొనుగోలు చేశాయి. దేశంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 2025 నాటికి పెట్రోల్లో 20 శాతం ఇథ నాల్ కలిపి వాహనాలు వినియోగించేందుకు వీలుగా ఉత్పత్తిని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా మొక్కజొన్న సాగు పెంపుపై హైదరాబాద్ వేదికగా జాతీయ సదస్సు ఇటీవల నిర్వహించారు. దేశంలో 2025 నాటికి పెట్రో వాహనాలకు ఇథనాల్ అవసరాల దృష్ట్యా మక్కల సాగు పెరగా లని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా కొత్త రకాల రూప కల్పన జరుగుతోంది. మరోవైపు నీటిలభ్యత కూడా మక్కల సాగు పెరు గుదలకు కారణమని వ్యవసాయశాఖ భావిస్తోంది.


12 Jul , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మార్కెట్లో నానో ట్రాక్టర్ ....!!

వ్యవసాయానికి ఉపయోగపడే ఇనుప నాగళ్లను తయారు చేసే బ్రహ్మచారి ఎడ్ల వాడకం పూర్తిగా తగ్గించారని కోణంలో ఓ మినీ ట్రక్టర్ ను రూపొందించారు. ఈ ట్రాక్టర్ ను నడపడానికి అనుభవం ఉన్న డ్రైవర్ అవసరం లేదు, పెద్ద ట్రాక్టర్ తో కూడా చేయలేని కొన్ని పనులు దీంతో చేయొచ్చని బ్రహ్మచారి నిరూపించారు. ట్రాక్టర్ బరువు 150కిలోలు నాలుగు అడుగుల పొడవు, 30 ఇంచుల వెడల్పు, రెండు అడుగుల ఎత్తు ఇంజిన్ కెపాసిటీ (హెచ్ పీ(హార్స్ పవర్), దీజిల్, పెట్రోల్తో నడుస్తుంది. ఈ ట్రాక్టర్ ఖర్చు లక్షా 40వేల రూపాయలు ఈ ట్రాక్టర్ నడవాలంటే గంటకు ఒక లీటర్ డీజిల్ అవసరం పడుతుంది. ఈ ట్రాక్టర్ వేగం గంటకు 10 నుండి 16 కిలోమీటర్ల స్పీడు. . దీనికి ఐదు గేర్లు ఉంటాయి. అంతర పంటల సాగుకు ఈ మినీ ట్రాక్టర్ ఎంతో ఉపయోగపడుతుంది.

29 Jun , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

జూలై 7న నూజివీడులో రైతు సదస్సు !!

ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా నూజివీడు టీటీడీ కల్యాణ మండపంలో జూలై 7ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మామిడి సాగులో మెలకువలతో పాటు బయోచార్ వినియోగంపై ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు నూజివీడు సేంద్రియ ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శి భోగోలు రాజేశ్ తెలిపారు. బయోచార్ నిపుణులు డాక్టర్ నక్కా సాయిభాస్కర్ రెడ్డి రైతులకు అవగాహన కల్పిస్తారని తెలిపారు మరిన్ని వివరాలకు 91779 88422 సంప్రదించండి

26 Jun , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలంగాణలో నేటి నుండి వ్యవసాయ భూముల సర్వే !

రైతు భరోసా అమలు కోసం భూసర్వే చేపట్టనున్న అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్. గ్రామాల వారిగా తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ సాగు భూములు ఎంత మరియు సాగు అవ్వని గుట్టలు, రియలెస్టేట్ భూములు మరియు ఇతర సాగులో లేని భూముల వివరాలకు వ్యవసాయ శాఖ పుర్తిస్థాయిలో సర్వే చేపట్టనుంది.


25 Jun , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ANGRAU ఆన్లైన్ కోర్సులు !!

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ANGRAU) సార్వత్రిక, దూరవిద్యా కేంద్రం ఆధ్వర్యంలో మిద్దెతోటల పెంపకం, పట్టుపురుగుల పెంపకం, జీవన ఎరువుల పెంపకంపై వేర్వేరుగా ఆన్లైన్లో సర్టిఫికెట్ కోర్సులను ప్రారం భించనుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఈ కోర్సులు నిర్వహిస్తారు. పూర్తీ వివరాలకు ఈ నంబర్ను 80087 88776 సంప్రదించండి మరియు www.angrau.ac.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోండి. ..

20 Jun , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వరికి మద్దతు ధర 117 పెంపు !!

బుధవారం రోజు జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్ లో కేంద్ర సర్కారు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో వరికి మద్దతు ధర (MSP) ని 5.35% పెంచారు.అంటే క్వింటాల్‌కు రూ.117 చొప్పున పెరగనుంది. 2024–25 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో క్వింటాల్‌ వరి ధాన్యాన్ని రూ.2,300కు కొనుగోలు చేయనున్నారు. 2013-14 మద్దతు ధరతో పోల్చితే ఇది రూ.1,310 ఎక్కువ. వచ్చే ఖరీఫ్ సీజన్ కు సంబంధించి వరితో పాటు జొన్న, పత్తి సహా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను కేంద్ర సర్కారు పెంచింది.

18 Jun , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఈ రోజు రైతుల ఖాతాల్లో పీఎం-కిసాన్ డబ్బులు !!

ఇప్పటి వరకు రైతులు 16వ విడత డబ్బులు అందుకోగా, ఇప్పుడు రావాల్సిన 17వ విడత ఈరోజు విడుదల చేయనున్నారు. నాలుగు నెలలకు ఒకసారి ఆర్థికసాయం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. వారణాసి పర్యటనలో భాగంగా మోడీ ఈ డబ్బులు విడుదల చేస్తారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. ప్రతీ ఒక్కరూ మొబైల్‌లో వచ్చే యాప్‌లపై అప్రమత్తంగా ఉండాలని పిఎం కిసాన్‌ యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్‌ చేయొద్దన్నారు. ఏదైనా సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించాలన్నారు. మరో 18 గంటల్లో పిఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లోకి రానున్నాయి.