07 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🌾కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా భారత్‌ బియ్యం !!

పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు భారత్‌ బియ్యం విక్రయాలను మంగళవారం ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం ఢిల్లీలో ప్రారంభించారు. భారత్‌ రైస్‌ పేరుతో కిలో రూ.29 చొప్పున 5, 10 కిలోల సంచుల్లో ఇవి లభిస్తాయి.ఇవి ఈ-కామర్స్‌ వేదికలతో పాటు ఎంపిక చేసిన అవుట్ లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల్లో భారత్‌ రైస్‌ను విక్రయిస్తారు. దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సరఫరా చేయనుంది.

06 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కాలి బాటలతో తెగుళ్ళు దూరం !!

తెలుగు రాష్ట్రాలలో అత్యదికంగా వరి పండుతుంది. వరి నాట్లు కొనసాగుతున్న తరుణంలో, నాట్లు వేసే దశలోనే కాలి బాటలను తీస్తే ప్రతి రెండు మీటర్ల వెడల్పుకు 30 సెం. మీ కాలి బాటలను వదిలితే వెలుతురు, గాలి బాగా ప్రవహించి ఎదుగుదల బాగుంటుంది.అదేవిదంగా చీడలను అరికట్టవచ్చు. ముఖ్యంగా దోమను, తద్వారా ఆశించే తెగుళ్ళ నష్టాన్ని అదుపులో ఉంచవచ్చు. అంతేకాక కలుపు నివారణ, పురుగు మందుల పిచికారి మరియు ఎరువులను పొలమంతా సమానంగా చల్లుకోవడానికి సులభంగా ఉంటుంది.

02 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🌾వ్యవసాయరంగానికి బడ్జెట్ 2024 !!

రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం తన ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ (Union Budget 2024) ప్రసంగంలో ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం కనీస మద్దతును పెంచింది. అన్నదాతల కోసం క్రమానుగతంగా ఆదాయం పెంపు కోసం వివిధ చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొత్తం మీద వ్యవసాయం, రైతుల సంక్షేమశాఖకు రూ.1.27 లక్షల కోట్లు, మత్స్య, పశుపోషణ, పాడి మంత్రిత్వ శాఖకు రూ.7105 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధికి ప్రైవేట్ మరియు పబ్లిక్ పెట్టుబడుల ప్రోత్సహించనున్నట్లు ప్రకటించారు.

02 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🌱అతి పెద్ద జాతీయ నర్సరీ మేళా మొదలు !!

హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో 15వ గ్రాండ్ నర్సరీ మేళా, భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన - 2024 మొదలైంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ గ్రాండ్‌ నర్సరీ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పేరుగాంచిన విత్తన, నర్సరీ, పనిముట్లు, యంత్రాలు, నగర సేద్యం సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం, హైడ్రోపొనిక్స్ టెక్నాలజీ సంస్థలు, అందమైన పూల మొక్కలు, అలంకరణ స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ మేళాలో మొత్తం 160 పైగా స్టాళ్లు, ఐదు రోజుల పాటు జరిగే ఈ షోలో ఉదయం 9 నుండి రాత్రి 10 అందుబాటులో ఉంటుందని మేళా ఇంచార్జ్ తెలిపారు.


30 Jan , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🚨పత్తి రైతు సోదరులకు విజ్ఞప్తి !!

ఈ నెల 31/01/2024 వరకు మాత్రమే CCI వారు పత్తి కొనుగోలు జరుగుతుంది అని Whatsap message లలో అబద్ధపు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వార్తలు నమ్మవద్దని CCI వారిచే పత్తి కొనుగోళ్లు నిరంతరంగా కొనుగోళ్లు కొనసాగుతాయని, రైతులు ఎటువంటి అందోళన చెందవద్దని జిల్లా మార్కేటింగ్ అధికారులు తెలియజేస్తున్నారు. పత్తి రైతులు తొందరపడి ఒకే సారి తమ పత్తిని CCI కి అమ్మడానికి జిన్నింగు మిల్లలకు తీసుకురావద్దని మరియు రవాణా వెయిటింగ్ ఖర్చు భారం చేసుకోకూడదని మరియు తక్కువ ధరకు వ్యాపారులకు అమ్మవద్దని చెబుతున్నారు.

27 Jan , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఈ ఏడాది కూడా బాటసింగారం లోనే మామిడి మార్కెట్ !!

మామిడి కొనుగోళ్లు విక్రయాలు ఈ ఏడాది కూడా కొహెడలో కాకుండా బాటసింగారంలోనే నిర్వహించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. దినికోసం బాటసింగారం మార్కెట్లో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బాటసింగారం మార్కెట్ స్థలం సరిపోనందున గత ఏడాది మాదిరిగానే మార్కెట్ పక్కన ఉన్న స్థలాన్ని అద్దెకు తీసుకుని తాత్కలిక షెడ్లు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశించింది. ఫిబ్రవరి నెలా ఖరులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. కానీ రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు మాత్రం సరైన సౌకర్యాలు లేనందున్న ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

25 Jan , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

హైదరాబాద్ లో అతిపెద్ద కిసాన్ అగ్రి షో !!

హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా ఫెబ్రవరి 1- తేదీ నుంచి 3వ తేదీ వరకు ఈ షో జరగనున్నది. ఇప్పటికే ఈ అగ్రి షో చాలా సార్లు విజయవంతం కాగా, ఈ వ్యవసాయ పరిశ్రమకు చెందిన ఎందరో నిపుణులు, విధాన నిర్ణేతలు మరియు రైతులను ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి ఉద్దేశించబడింది. వారు ఒకరితో ఒకరు సంభాషించడానికి మరియు వ్యవసాయ రంగంలో కొత్త పురోగతిని అన్వేషించడానికి మరియు మీ సంస్థ ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించవచ్చు. దీనిలో రైతులు మూడు రోజుల పాటు ప్రదర్శనను సందర్శించవచ్చు. కిసాన్ షోలో వ్యవసాయ యంత్రాలు , నీరు & నీటిపారుదల టూల్స్ & ఇంప్లిమెంట్స్ స్టార్టప్‌లు, ట్రాక్టర్లు, ప్లాస్టికల్చర్, కాంట్రాక్టు వ్యవసాయం, అగ్రి ఇన్‌పుట్‌లు, మొబైల్ యాప్‌లు ఇతర వ్యవసాయ నూతన ఆవిష్కరణలను చూడవచ్చు.


25 Jan , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం !!

నూనె పంటలను పెంచడమే లక్ష్యంగా సాగుతున్న ఉద్యాన శాఖ, రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లోని 8.14 లక్షల ఎకరాల్లో 1,62,800 మంది రైతులకు ఎకరానికి రూ. 1.20 లక్షల సాగుకు రుణసాయం అందించాలని కేంద్రం రాష్ట్రంలోని బ్యాంకులను ఆదేశించింది. రానున్న రోజుల్లో 80 లక్షల టన్నుల వరకు దిగుబడలు రాగా, వీటి నుంచి 14.80 లక్షల టన్నుల నూనె తయారవుతుందని, దీంతో దాదాపు 10,360 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని వెల్లడించింది. రానున్న రోజుల్లో మరింత సాగు విస్తర్ణం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

28 Dec , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

బయోచార్ తయారి, ఉపయోగాల పై చర్చాగోష్టి !!

నేల సారాన్ని పెంచడానికి వాడే కట్టె బొగ్గును బయోచార్ అంటారు. బయోచార్ను పశువుల ఎరువు లేదా కంపోస్టుతో కలిపి పంటలకు వేసుకుంటే జీవవైవిధ్యాన్ని కొనసాగిస్తూ పంట దిగుబడిని పెంచడానికి సహాయపడింది మరియు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అవసరమైననే బయోచార్ను రైతులు తయారు చేసుకోవడం మరియు వాడడం పై ఈ నెల 29న అనంతపురం జిల్లా గోరం ట్లకు సమీపంలోని పూల చెట్లపల్లి లోని టుడుటు ఫామ్స్ క్షేత్ర సంద ర్శన, రైతులు, నిపుణులతో చర్చాగోష్టి జరగనుంది. దీనిలో ప్రముఖ బయోచార్ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి తదితరులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29 (శుక్రవారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్ర సందర్శన, చర్చాగోష్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆసక్తిగల రైతులు, ఔత్సాహిక వ్యవ సాయ పట్టభద్రులు ముందుగా పేర్లు నమోదు చేయించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు, రిజిస్ట్రేషన్ కోసం 95022 93343 నంబరును సంప్రదించండి.

27 Dec , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పెరిగిపోతున్న బియ్యం ధరలు !!

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతుల పై నిషేధం విధించింది. దేశంలో బియ్యం ధరలు రకాలతో సంబంధం లేకుండా అన్ని రకాల బియ్యం ధరలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ ,కర్ణాటక వరి విస్తీర్ణం తగ్గడం మరియు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో తుఫాన్ ప్రభావం వలన పంట దెబ్బ తినడంతో దిగుబడి తగ్గడం వలన సన్న బియ్యం ధరలు బారిగా పెరిగాయి రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది.