17 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మానవ వ్యర్దాలతో జీవన ఎరువు, విద్యుత్తు తయారి !!

ప్రపంచవ్యాప్తంగా జీవన ఎరువుల తయారికి, పునరుత్పాదక ఇంధనాలకు డిమాండ్ పెరుగుతున్నవేళ కేరళలోని ఐఐటీ పాలక్కడ్ పరిశోధకులు మానవ మూత్రం నుంచి విద్యుత్తు, జీవఎరువును ఉత్పత్తి చేసే వినూత్న ఆవిష్కరణ చేపట్టారు. మూత్రంలోని అయానిక్‌ శక్తిని ఉపయోగించుకొని ఎలక్ట్రోకెమికల్‌ చర్యలను ప్రేరేపిస్తుంది. దానివల్ల విద్యుత్తు ఉత్పత్తవుతుంది. తర్వాత అదే మూత్రం నుంచి- నైట్రోజన్‌, ఫాస్ఫరస్‌, మెగ్నీషియం అధికంగా ఉన్న జీవఎరువు కూడా తయారవుతుంది. ఈ విధానంలో ఉత్పత్తయిన విద్యుత్తును మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు, ఎస్ఈడీ బల్బులను వెలిగించేం దుకు ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు

15 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

16-18 తేదీల్లో అగ్రిటెక్ సౌత్ 2024 !!

ప్రొ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 16- 18 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సాంకేతికతల ప్రదర్శన, సాంకేతిక సదస్సును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు సిఐఐ సీనియర్ తెలిపారు. అత్యాధునిక వ్యవసాయ సాంకేతికతలు, ఉత్పాదకాలు, సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యమన్నారు. సేంద్రియ వ్యవసాయంతో సహా అనేక ముఖ్యమైన అంశాలపై చర్చాగోష్ఠులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు సంప్రదించండి 9849114758, 9849470365

12 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ప్రస్తుత పరిస్థితులలో మామిడి తోటల్లో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు-3!!

7. తెల్లపూత చాలా సున్నితమైన దశ కాబట్టి తేనె మంచు పురుగు, బూడిద తెగులు, పిండినల్లి లను వీలైనంతవరకు పచ్చిపూత దశలోనే నివారించుకోవాలి 8. పిందె రాలకుండా అదేవిధంగా పిందెలు బఠానీ గింజల సైజులో ఉండి పసుపు రంగులోకి మారి రాలిపోతుంటే మల్టీకే (13-0-45) 2.5 కేజీ + సూక్ష్మ పోషక మిశ్రమం (ఫార్ములా -4) 2.5 కేజీ. + ప్లానోఫిక్స్ 100 ml లను 500 లీటర్ల నీటికి కలిపి ఆకులన్నీ తడిచేలా పిచికారి చేసుకోవాలి. 9. పండు ఈగ నివారణ కు లింగాకర్షణ బుట్టలను ( మిథైల్ యూజినాల్ ) ఎకరానికి 10-25 ఏర్పాటు చేసి ప్రతి 20 రోజులకు ల్యూర్ ను మారుస్తూ పంట పూర్తి అయ్యే వరకు కొనసాగించాలి. డి. చక్రపాణి జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి వికారాబాద్ జిల్లా.

12 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ప్రస్తుత పరిస్థితులలో మామిడి తోటల్లో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు-2!!

4. పచ్చిపూత దశలో తేనె మంచు నివారణకు థయోమితాక్సమ్ 200గ్రా లేదా ఫిప్రోనిల్ 80% WG 150 గ్రా లేదా ఇమిడాక్లోప్రిడ్ 100 మి.లీ. లిటర్లు మరియు బూడిద తెగులు నివారణకు హెక్సా కొనజోల్ 1లీ + వేపనూనె 2 లీ. 500 లీటర్ల నీటిలో (ఒక డ్రమ్) కలిపి పిచికారి చేసుకోవాలి. 5. పూత విచ్చుకున్నాక 10-15 రోజుల వరకు ఎలాంటి పురుగు మందులు పిచికారి చేయరాదు. 6. ఫిబ్రవరి నుండి ఏప్రిల్ నెలలో తప్పనిసరిగా యూరియా, పొటాష్ మరియు బోరాన్ ఎరువులు వాడుకోవాలి. ఎరువులు ఎప్పుడైనా ఒకేసారి వేసేకంటే దఫాలుగా వేసుకోవడం వల్ల ఉత్పత్తి చాలా బాగుంటది. పూత నుండి పిందెలు ఏర్పడి బఠానీ గింజ సైజులో ఉన్నప్పుడు పది సంవత్సరాలు పైబడిన ప్రతి చెట్టుకు, DAP- 700 గ్రా.,యూరియా - 400 గ్రా., MOP - 600 గ్రా. చొప్పున ప్రతి చెట్టుకి వేసుకొని నీరు పెట్టాలి. డి. చక్రపాణి జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి వికారాబాద్ జిల్లా.


12 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టవలసిన యాజమాన్య చర్యలు - 1 !!

1. ప్రస్తుతం మామిడి తోటలు సగభాగం పచ్చ పూత కొంత తెల్ల పూత మరియు కొంత భాగం ఇంకా మొట్టెలతోటి (పూ మొగ్గ దశ లో) పూత విచ్చుకోకుండా ఉన్నది ఇలాంటి పరిస్థితులలో తోటలకు తేలికపాటి నీటి తడులు ఇవ్వాలి. 2. పిందె పూత రాలిపోవడనికి నీటి మరియు పోషక లోపమే కారణము. డ్రిప్పు పైపుల అమర్చే పద్దతి కూడా ఉత్పత్తి పై ప్రభావం చూపిస్తుంది. మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా ఉండటంవల్ల పూత పిండే పై ప్రభావం చూపిస్తుంది. నీటి తడులు ఇచ్చేటప్పుడు మొదటి రెండు తడులు తేలికగా ఇచ్చిన తర్వాత మాత్రమే మూడోతడి పూర్తిగా ఇవ్వాల్సి వస్తుంది లేని పక్షంలో పూత గాని పిందే గాని రాలిపోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. 3. చెట్టుకు తెల్ల మరియు పచ్చ పూత కంటే మొట్టెలే (పూ మొగ్గలు) అధికంగా ఉంటే మల్టీ-కే (13-0-45) 5 కేజీ.+సూక్ష్మ పోషక మిశ్రమం 2.5 కేజీ.+ ప్లానోఫిక్స్ 100మి.లీ/ 500 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. డి. చక్రపాణి, జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి వికారాబాద్ జిల్లా.

12 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతుని పెళ్లి చేసుకుంటే 5 లక్షల బహుమతి ఇవ్వాలి

పెళ్లి చేసుకోవడానికి పొలం కావాలి కాని పొలం దున్నే రైతును మాత్రం పెళ్లి చేసుకోవడానికి యువతులు వెనకడుగు వేస్తున్నారు. తల్లి తండ్రులు సైతం పిల్లను ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. 45 సంవత్సరాలు వచ్చినా రైతులకు పెళ్ళిళ్ళు కావట్లేదని కర్ణాటకా రైతులు CM దృష్టికి తీసుకెళ్ళారు. రైతు రుణమాఫితో పాటు రైతును పెళ్లి చేసుకునే యువతికి 5 లక్షలు బహుమతిగా ఇవ్వమని కోరారు.

12 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు !!

నైరుతి రుతుపవనాల సీజన్‌ ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో గతేడాది నుంచి కొనసాగుతూ, ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్‌నినో క్రమేపీ బలహీనపడనుంది. ఆగస్టు నాటికి లానినా ఏర్పడి వచ్చే జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు గతేడాది సీజన్‌లో కంటే మెరుగైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి వచ్చి, మంచి వర్షాన్ని ఇచ్చినా... వేసవి తీవ్రత మాత్రం కొనసాగుతుందన్నారు.


10 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులకు మద్దతుగా ఫిబ్రవరి 16న భారత్ బంద్ !!

రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన రైతు సంఘాలు భారత్ బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు మూసేయాలని, ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు భారత్ బందుకు సహకరించాలని రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ల పరిష్కారం కోసం దేశంలోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని కోరారు !!

10 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

హరిత విప్లవ పితామహుడుకి భారతరత్న!!

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త యం.యస్.స్వామినాధన్ భారత వ్యవసాయం మరియు రైతుల సంక్షేమానికి చేసిన అసమానమైన కృషికి ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 9న ప్రకటించారు. వ్యవసాయ రంగానికి చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు మాత్రమే కాదు. మొత్తం దేశ ప్రజలు ఆకలితో అలమటించిపోకూడదన్న హరిత విప్లవ పితామహుడు పడిన శ్రమకు దక్కిన ఫలితం అని చెప్పాలి. హరిత విప్లవానికి బాటలు వేసి, నూతన వంగడాల ఆవిష్కరణలతో యావత్ రైతాంగం ముఖ చిత్రాన్నే మార్చి వ్యవసాయ రంగంలో పెను మార్పులు తెచ్చిన ఘనత స్వామినాధన్ కే దక్కుతుంది.

09 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

అన్ని హంగులతో జంతు దవాఖాన!!

భారతదేశంలో ప్రపంచ స్థాయి జంతు ఆసుపత్రి ప్రారంభించాలనే పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి కల త్వరలో మహాలక్ష్మిలో టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంతో సాకారం కానుంది. ముంబైలో 165కోట్లతో దాదాపు 22 ఎకరాల్లో పెంపుడు జంతువుల కోసం అన్ని హాంగులతో కూడిన హస్పిటల్ ను నిర్మింస్తున్నారు. అతి త్వరలో ఇది అందరికి అందుబాటులో ఉండనుంది.