NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
24గంటల కరెంట్ ఉత్తదే..!
-కరెంట్ కోతలతో రైతులకు తప్పని తిప్పలు - సమయపాలన లేకుండా ఇవ్వడంతో రైతుల అయోమయం రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం ప్రారంభం కాక ముందే కరెంట్ కోతలు విధించడం భావ్యం కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో సరైన సమాచారం తెలియక రైతులు పొలాల వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పెట్టుబడి కోసం ‘రైతుబంధు’
విత్తు ఎంత మంచిదైనా మట్టి తోడు లేకపోతే మొలవదు… విత్తు, మట్టి ఎంత మంచివైనా ఎంత సారవంతమైనవైనా.. ఆకాశం నుండి వర్షపు చుక్క ఆ మట్టికి తగలకపోతే మొలకెత్తదు… ఆకాశం నుండి వర్షపుధార మట్టి మీద పడ్డా… రైతన్న యొక్క చెమట చుక్క తోడు కాకుంటే మొలకెత్తదు. వాన చుక్క, చెమట చుక్క, విత్తనం, మట్టి అన్నీ కలిసి మొలకెత్తినా అది పంటగా మారాలంటే రైతుకు పెట్టుబడి కావాలి… ఆ పెట్టుబడి కోసం ‘రైతుబంధు’ పథకం వచ్చింది..!
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మేకల మరియు గొర్రెల పెంపకం పైన సబ్సిడీలు
కోటి పెట్టుబడి 50 లక్షల సబ్సిడీ మాంసం ఉత్పత్తి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా గొర్రెలు మేకలు, కోళ్ల పెంపకానికి చేయూత ఇస్తుంది. యూనిట్ విలువ రూపాయలు 12 లక్షల నుంచి కోటి కాగా అందులో సర్కారు 50% సబ్సిడీ అందిస్తుంది. కేవలం గొల్ల కురుమలే కాకుండా అన్ని సామాజిక వర్గాలు చెందినవారు అర్హులే పశుసంవర్ధక శాఖ ద్వారా ఈ స్కీమ్ ని అమలు చేస్తుంది ఈ పథకంపై అంతగా ప్రచారం అవగాహన లేకపోవడంతో ప్రోత్సహించిన స్పందన కొరవబడింది ఇప్పటివరకు మంచిర్యాల జిల్లాలోని 13 దరఖాస్తులు లాగా నాలుగు యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. ఎంపిక చేసుకున్న యూనిట్ బట్టి రెండు నుంచి పది ఎకరాల భూమి అవసరం ఉంటుంది సొంత భూమి లేకుంటే లీజు తీసుకోవచ్చు చుట్టూ ఫెన్సింగ్ వేసి షెడ్యూల్ నిర్మించి అందులోనే మేత ఏర్పాట్లు కూడా చేసుకోవాలి . బ్యాంకు లోన్ కోసం కాన్సెంట్ తీసుకోవాలి, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు జత చేస్తూ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. మరిన్ని వివరాల కొరకు nlm.udyamimitra.in వెబ్సైట్ సందర్శించండి.


