20 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

అందుబాటులోకి రానున్న సిద్దిపేట సేంద్రియ ఎరువు

ఇట్టింటా జమ చేస్తున్న తడి, పోడి చెత్తనుండి సేంద్రియ ఎరువును తయారు చేసే ప్రయత్నం చేసింది సిద్దిపేట మున్సిపాలిటి. సేంద్రియ ఎరువులో కార్బన్ ఎక్కువగా ఉంటుందని, ఇది పండ్లతోటలకు, కూరగాయల మొక్కలకు శ్రేష్టకరం కావటంతో రైతులకు సిద్దిపేట బ్రాడ్ పేరుతో తయారు చేయించారు. భూమిత్ర పేరిట రేపటి నుండి రైతులకు దినిపై అవగాహన కల్పించారు. అందుబాటులో ఉంటుందని, మొదటగా నియోజకవర్గ రైతులకు ఆ తర్వాత మిగతా రైతులకు అందజేయనున్నారు.

20 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఖైదీలతో పామాయిల్ నర్సరీ పెంపకం

తీరు మారుతుంది. నర్సరీ పెంపకంలో తోటమాలులే ఖైదీలు సైతం పాలుపంచుకుంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సెంట్రల్ జైళ్లో ఉన్న ఖైదీలతో పామ్ ఆయిల్ మొక్కలు పెంచేలా కేఎన్‌బయోసైన్స, జైళ్ల శాఖ మధ్య ఎంవోయూ కుదిరింది. కవర్లో మట్టిని విత్తడం, మట్టిని నింపడం, అవసరం మేర నీటి తడులు ఇవ్వడం ఇలా ప్రతి అంశాన్ని ఖైదిలకు శిక్షణ ఇచ్చారు. 3లక్షల మొక్కలు పెంచే దిశగా...పనిచేసే ఖైదీలకు నిత్యం రూ.150 చెల్లిస్తారు.

20 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🔸 కుసుమ నూనెతో కలిగే ప్రయోజనాలు

పండించే కుసుమ పంటను ప్రస్తుతం ఔషధాల తయారీలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. పూర్వం రోజుల్లో వంటలకు రంగు తీసుకురావడం కోసం ఈ విత్తనాలను ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు వీటి నుంచి నూనె తీసి వంటలకు వాడుతున్నారు. కుసుమ నూనెలో పోషకాలు పుష్కలంగా ఉండి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలను చూపుతున్నదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. కుసుమ నూనెలో కొలెస్ట్రాల్ స్థాయి కూడా చాలా తక్కువగా ఉంటుంది. కుసుమ నూనెలో మెగ్నీషియం, భాస్వరం, మాంగనీస్, జింక్, ఇనుము, రాగి, ప్రొటీన్ ఖనిజాలు ఉంటాయి. 100 గ్రాముల కుసుమ నూనెలో కొవ్వులు 38 గ్రాములు, సోడియం 3 గ్రాములు, పొటాషియం 687మిల్లి గ్రాములు, కార్బొహైడ్రేట్స్‌ 34 గ్రాములు, ప్రొటీన్‌ 16 గ్రాములు, విటమిన్‌ బీ12 88 శాతం ఉంటుంది, కుసుమ గింజల నుంచి తీసే మోనోశాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌.. రెండు రకాల నూనెలను వంటల తయారీకి, కూరల వేపుళ్లకు వాడొచ్చు. ఇవీ ఆరోగ్య ప్రయోజనాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, కీళ్ల నొప్పులు తగ్గించడం, తలనొప్పి నుంచి ఉపశమనం కలిగించడం, చర్మం, జుట్టు నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కుసుమనూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. స్ట్రోకులు రాకుండా నియంత్రిస్తుంది. ఈ నూనెలో యాంటిఆక్సిడెంట్స్‌ ఉండిగుండెకు మేలు చేకూరుస్తాయి. ఈ నూనె వాడటం వల్ల రక్తంలో చక్కెర శాతం తగ్గుతుంది

17 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పురుగుమందుల పై నోటిఫికషన్ జారి చేసిన ప్రభుత్వం

పురుగు మందుల వినియోగం పై కేంద్ర ప్రభుత్వం అంక్షలను విదించాలని నిర్ణయిచింది. ఇందులో రైతులు తరచుగా వాడే కార్బోఫ్యురాన్, మోనోక్రోటఫాస్ ,మంకోజేబ్, క్వినాల్ఫాస్ , డైమీథేట్ , క్లోరోపైరిఫాస్ , ఆక్సిఫ్లోరోఫిన్,మాలాథియాన్ ,తాము నిర్దేశించిన పంటలకు ఉపయోగించకూడదు అని నిబందిచింది.ఈ మేరకు లేబుల్ ,లిఫెలేట్ లతో నిర్దేశించిన పంటలను తొలగించాలని , వీటి జీవ సామర్థ్యం ,అవశేషా సమచారాన్ని పరిగణలోకి తీసుకున్న తరువాత ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు కార్బోఫ్యురాన్: 3 % గుళికలు మినహా మిగతా అన్నిరకాల ఫోర్ములషన్ వినియోగాన్ని ఆపివేయాలని .క్రాప్ లేబుల్ నిలిపేయాలి . మోనోక్రోటఫాస్: నీటిలో కరిగే 15% గుళికలు మినహా ఈ పురుగుమందుకు సంబందిత మిగః అన్ని ఫోర్ములశాన్లను ఆపివేయాలి. డైమీథేట్: ముడి ఆహారంగా తీసుకునే పండ్ల ,కూరగాయలకు దిన్ని ఉపయోగించకూడదు . క్లోరోపైరిఫాస్: రేగు ,సిట్రస్ ,పొగాకు పంటలకు వాడవద్దు . ఆక్సిఫ్లోరోఫిన్:ఆలు, వేరుశనగకు వాడరాదు . మంకోజేబ్: జామ ,జొన్న ,కర్రేపెందల పంటల్లో వాడరాదు. మాలాథియాన్: జొన్నలు ,శనగ , సోయబిన్ , ఆముదం , వంగ ,బెండ ,ద్రాక్ష ,కాలిఫ్లోవర్ ,మామిడి ,ముల్లంగి ,యాపిల్ ,పొద్దుతిరుగుడు ,టమాటో,పంటలకు వాడవద్దు. క్వినాల్ఫాస్: జనపనార ,యాలకులు ,జోన్నలకు వాడకూడదు . ఈ మందుల తయారీదారులు ఇక పై పైన తెలిపిన పంటల వివరాలు లేబుల్ నుండి తొలగించాలి అని సెంట్రల్ ఇంసేక్టిసైడ్ బోర్డు అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ సేక్రటరికి ఆరునెలలలోపు దరకాస్తు చేసుకోమని, లేదంటే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించింది. వీటి దిగుమతి, తయారి, ఫోర్ములషన్, రవాణా, అమ్మకాలన్నిటికీ తుది నోటిఫికషన్ నేటి నుండి నిలిపి వెయలన్నట్లు పేర్కొన్నది.


17 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

జలకళ చూసి సీఎం సంతోషం

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని మద్య మానేరు, దిగువ మానేరు జలాశయాల జలకలను చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కొండగట్టు ఆలయానికి వచ్చిన సీఎం తిరుగు ప్రయాణంలో హెలికాప్టర్లో వెళ్తూ కాలేశ్వర జలాలను ఎత్తిపోస్తున్న తీరు మధ్య మానేరు నిండుకుండం తలపిస్తుందని. ఎక్కడి నుంచి ఎటువైపునకు జల దారాలు వెళుతున్నాయని విషయాన్ని సీఎం వివరించాడు. ఒకప్పుడు ఎడారిని తలపించిన ఈ ప్రాంతం ఇప్పుడు కోనసీమను తలపిస్తుందని ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

16 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

అడుగంటుతున్న జలాశయాలు...

వరంగల్ జిల్లాలో యాసంగి వరి నాటు పూర్తయ్యాయి మరో రెండు మాసాలపాటు పొలాలకు నిత్యంతడులు అవసరం జిల్లాలో దేవాదుల ఎత్తిపోతల పథకంలో నిర్మించిన జలాశయాలు అడుగంటుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టాయి ఊట బోర్లు రోజు విడిచి రోజు వినియోగించాల్సి వస్తుంది. ఈ పరిస్థితులలో జిల్లాలోని భారీ చిన్ననీటి జలాశయాల దిక్కు దేవాదుల జలాశయాల్లో నీరు నిండుకుంటుంది. మరోపక్షం రోజుల్లో ధర్మసాగర్ నుంచి నీటి సరఫరా జరగని పక్షంలో ఇవి పూర్తిగా అడుగంటే పరిస్థితులు ఉన్నాయి. ధర్మసాగర్ కు వచ్చే పైపులైను పులకుర్తి చలివాగు తదితర ప్రాంతాల్లో గత వర్షాకాలం పలుచోట్ల పైకి తేలడంతో ఎత్తిపోతల నిలిచిపోయింది. ఏడాదిలో 170 రోజులు ఎత్తిపోతల జరగాల్సి ఉంటుంది. సాంకేతిక కారణాలతో ఎత్తిపోతల్లో అంతరాయం ఏర్పడింది ములుగు, ధర్మసాగర్, చలివాగు ధర్మసాగర్ మధ్యలో పైప్ లైన్ మరమత్తులు పూర్తిచేసి నాలుగున ధర్మసాగర్ కు నీటిని విడుదల చేశారు. వరంగల్ మహానగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టారు ఇదే సమయంలో అటు గండి రామవరం ఇటు ఆర్ఎస్ ఘన్పూర్ జలాశలకు నీటి సరఫరా ప్రారంభం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

14 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఆయిల్ పామ్ లో అదరహో....

ఆయిల్ పామ్ లో 19.32 నూనె ఉత్పత్తి శాతంతో తెలంగాణ నంబర్ వన్ ఉందని దేశంలో దాదాపు 9.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు అన్నారు. దేశంలో, సాలీనా100 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా పామ్ ఆయిల్ డిమాండ్‌ ఉండగా, వార్షిక ముడి పామ్ఆయిల్ ఉత్పత్తి ఏడాదికి 2.90 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఉన్నది. ఈ లోటును దేశం దిగుమతుల ద్వారా సమకూర్చుకుంటున్నదని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలిపారు. దేశంలో పామ్ ఆయిల్ స్వయం సమృద్ధి సాధించాలంటే అదనంగా 70 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు అవసరం. తెలంగాణ రాష్ట్రానికి సుమారు 3.66 లక్షల టన్నుల పామ్ ఆయిల్ అవసరం కాగా ప్రస్తుతం 52,666టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది. అన్ని నూనె గింజల పంటలకన్నా ఆయిల్ పామ్ లో ఎక్కువ దిగుబడినిస్తుంది (ఎకరానికి 10-12 టన్నులు ), 25 – 30 సం. వరకు సంవత్సరానికి సుమారు రూ.1,20,000/- నుండి రూ.1,50,000/- వరకు, ఆదాయం పొందవచ్చు. రాష్ట్రంలో వివిధ పధకాలకింద 2021-22 సం. వరకు 68,440 ఎకరాలు,(13,302 రైతులు) ఆయిల్ పామ్ సాగు కిందకు వస్తాయి. పంటల వైవిధ్యీకరణ నేపథ్యంలో సుమారు 20.00 లక్షల ఎకరాలలో పామ్ ఆయిల్ సాగుకు ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. 27 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్‌లను కేటాయింపు చేయడం జరిగింది. 2022-23 ఏడాదికి గాను ఇప్పటివరకు 61277 ఎకరాలలో ప్రగతి సాధించడం జరిగిందని 2023-24 సం. కి గాను,2.00 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు మొక్కల పెంచేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది.


14 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నిలువు-వ్యవసాయం

పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించాలంటే అంత సులువు కాదు. నేల పై చేసే వ్యవసాయం సరిపోవడం లేదు. ప్రస్తుతం పట్టణాలలో ఇళ్ళ పైన చిన్న మొక్కలను ,కూరగాయ మొక్కలను, పులా మొక్కల పెంచడానికి మక్కువ చూపుతున్నారు. అయితే ఇళ్లలోనే ఎక్కువ దిగుబడి వచ్చేలా పండిస్తున్నారు. వ్యవసయలను టెర్రస్ గార్డెన్ ,కిచెన్ గార్డెన్ ,అక్వపోనిక్స్ ,హైడ్రోపోనిక్స్ అని వివిధ రకాలుగా పండిస్తున్నారు. నిలువు -వ్యవసాయం అనగా ఉన్న తక్కువ నేలలో ఎక్కువ పండించవచ్చు.ఇది సాంప్రదాయ వ్యవసాయాల కన్న పది రెట్లు ఎక్కువ దిగుబడిని ఇస్తుంది .ఇది ఇండోర్ వ్యవసాయం సంవత్సరం పొడవు పంటలను ,అన్ని కాలల్లో ,ఒకేసారి వివిధ పంటలను పండిచడానికి ఇది దోహదపడుతుంది.మన భారత్ లో మహారాష్టలో పసుపు పండిస్తున్నారు.

14 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

దేశంలో అత్యధిక రుణభారం...

దేశంలో ఆంధ్రప్రదేశ్ రైతులపైనే అత్యధిక రుణమాల ఉంది జాతీయ స్థాయిలో సగటున ఒక్కో రైతు కుటుంబం పై రూ. 74 వేల రూపాయల రూపాయి ఉండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అది రెండు రూ. 2,45,454 చొప్పున ఉంది. ఇది దేశంలో ఒక్కో రైతు కుటుంబం కోసం రుణభారం కంటే 231% అధికంగా ఉంది ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ ఖరాట్ సోమవారం లోక్సభలో తెలిపారు. రైతులు అత్యధికంగా రుణభారం మోస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ, పంజాబ్ టాప్ లో నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాల్లోనే రైతు కుటుంబాలపై సగటున రుణభారం రూ. రెండు లక్షలకు మించింది హర్యానా, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్ మరియు తమిళనాడులో రైతు కుటుంబాలపై రూ. లక్షకు పైగా రుణభారం ఉంది. మిగతా రాష్ట్రాల్లో రైతులపై సగటుబారం రూపాయల లక్ష లోపే నమోదయింది.

14 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వ్యవసాయ ఎగుమతుల్లో.....

తెలంగాణలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల ఉత్పత్తుల ఎగుమతులు ఏటేటా పెరుగుతున్నాయి గత ఆర్థిక సంవత్సరంలో రూ.7737 కోట్లకు చేరాయి. రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహంతో పాటు ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకం ద్వారా ఈ పురోగతి సాధించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వ్యవసాయకంగా రాష్ట్రంలో ఉత్పత్తులు పెరుగుతున్నాయి వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో స్థూల రాష్ట్ర విలువ గణనీయంగా పెరిగింది. పంట ఉత్పత్తుల శుద్ధి ద్వారా అదనపు విలువను కల్పించడం ద్వారా రైతుల ఆదాయం పెంచాలని ప్రభుత్వం భావించింది ఈ మేరకు ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటును పెద్ద ఎత్తున చేపట్టింది ఎగుమతులకు అనువైన వనరులు మౌలిక సదుపాయాలను కల్పించింది గోదాములు, శీతల గిడ్డంగుల నిర్మాణం చేపట్టింది. ఆహార శుద్ధి పరిశ్రమల కోసం ప్రత్యేక విధానం చేపట్టింది దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆహార శుద్ధి ప్రత్యేకంగా మండలను చేపట్టింది ప్రత్యేక మండలను. గత కొంతకాలంగా పత్తికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది జౌలి ఉత్పత్తులతో పాటు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల కోసం పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు దీంతో పత్తి ఎగుమతులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆరోగ్య సంరక్షణలో భాగంగా బియ్యం జొన్నలు, గోధుమలు తదితర తృణధాన్యాలకు ఇతర దేశాల్లో ఆదరణ ఉంది కాఫీ, టీ, పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర మిరియాలు ఎగుమతుల ఆర్డర్లు పెరుగుతున్నాయి,. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలను ఆహార శుద్ధి ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేసిన పక్షంలో అక్కడి నుంచి ఎగుమతులు విస్తరిస్తాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.