27 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

సేంద్రియ వ్యవసాయం

సేంద్రియ వ్యవసాయం.. ఇప్పుడు ఈ పదం పంటల సాగులో ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకాలం అధిక దిగుబడి ఆశతో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడిన రైతులు దానివల్ల భూమి నిస్సారంగా మారడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమవడం, పురుగుమందుల అవశేషాలున్న పంట ఉత్పత్తులను ఆహారంగా వినియోగిస్తూ ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని క్రమంగా గుర్తిస్తున్నారు. నెమ్మదిగా మళ్లీ సేంద్రియ సాగువైపు మళ్లుతున్నారు. దేశంలో ప్రస్తుతం 39.4 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. అందులో వ్యవసాయం చేస్తున్న భూమి 21.5 కోట్ల ఎకరాలు ఉంది. ఇందులో 66 లక్షల ఎకరాల్లో మాత్రమే సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ సాగు జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే పూర్తి సాగు విస్తీర్ణంలో సేంద్రియ సాగు కేవలం 3.24 శాతమేనన్నమాట. అయినప్పటికీ గత కొన్నేళ్లతో పోలిస్తే సేంద్రియ సాగు దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయని అర్థమవుతోంది.

27 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

13th Instalment of Kisan Samman Nidhi

13th Instalment of Kisan Samman Nidhi Prime minister Narendra Modi will be releasing the 13th installment of Kisan Samman Nidhi on 27th Feb 23 across the country and 8 crore farmers are getting this benefitted from this. The list of all eligible farmers was already published on the PM Kisan Yojana Portal. to check the details and status of the payment.

25 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తగ్గిన ఉల్లీ ధరలు

ఉల్లి ధరలు చాలా తగ్గడం తో కొనుగోలు దారులకు సంతోషాన్ని ఇస్తున్న విషయం.ఒక పక్క టమాటా ధరలు పెరగడం అదే సమయం లొ ఉల్లీ ధర తగ్గీ కొంచెం ఊరట కలిగిస్తుంది మొన్నటి వరకూ 100/- 3-4 కేజీ అమ్మగ ఇప్పుడు 100/- కే 6-8 కేజీల ఉల్లి వస్తుంది. మర్కెట్ లో భారీ మోత్తంలో ఉల్లి రావడం తో ధర లు బాగా పడిపోయాయి. అదే మరి టమోట కేజీ 40/--50/- వరకు ధర వస్తుంది.

23 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కాపు తగ్గింది మామిడిది

అననూకూల వర్షాలు, పెరిగిన ఉష్టోగ్రతలు, వాతావరణ మార్పులు వంటి కారణాలతో ఈ ఏడాది మామిడి పూత తక్కువగా నిలబండిదంని రైతులు వాపోతున్నారు. ఎన్ని రకాల మందులు కొట్టినా పూత కాయల మారలేదని, మారినా కాయలు కూడా నిమ్మకాయ సైజులోనే రాలిపోతున్నాయంటున్నారు. పూతలు రాలిపోయి కొత్త చిగుర్లు వచ్చి కొన్ని చెట్లకు ఒక్క కాయ కూడాలేదని రైతులు చెబుతున్నారు.


23 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ధాన్యం గోనె సంచుల్లోనే

ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆహార ధాన్యా లన్నింటిని మరో ఏడాది వరకు జనపనార సంచుల్లోనే తప్పనిసరిగా నింపి రవాణా చేయాలని నిర్ణయించింది. ఆహార ధాన్యలు100 శాతం, చెక్కర 20 శాతం మేర అని నిర్ణియించింది. ఈ నిర్ణయింతో దాదాపు 3.70 లక్షల మంది కార్మికులకు ఊరట కలిగింది. ముఖ్యంగా ఈ జాట్ పరిశ్రమల్లో దాదాపు 9 వేల కోట్ల విలువైన సంచులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.

23 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పెరిగినా యాసంగి విస్తీర్ణం

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం పెరిగింది. గత తోమ్మిది సంవత్సరాల్లో ఎప్పుడు లేనంతగా ఈ యాసంగీలో 68.53 లక్షల ఎకరాల్లో సాగైందని వ్యవసాయశాఖ నివేదిక విడుదల చేసింది. 24 వ్యవసాయ కరెంటు, మద్దతు ధర, గ్రామాస్థాయిలో ధాన్యం కొనుగోలు, కోతకు యంత్రాలు వంటి కారణాలతో సాగు విస్తీర్ణం పెరిగందని వ్యవసాయ నిపుణుల చెబుతున్నారు. పెరిగినా సాగుకు తగ్గట్టుగా రైతులకు ఇబ్బందులు కాకుండా కొనుగోలుకేంద్రాల వద్ద పడిగాపులు లేకుండా చూడాలంటున్నారు సాగురైతులు.

22 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

సాగురంగంపై భారత్ చిలీ దేశాల మధ్య ఒప్పందం

వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందానని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. ముఖ్యంగా a.ఆధునిక వ్యవసాయ అబివృద్ది సాగు విధానాలు b.సేంద్రియ ఉత్పత్తుల వినియోగం c.వ్యవసాయంలోనూతన అవిష్కరణలకు ప్రోత్సహిచండం d.భారత్ చిలీ దేశాల మధ్య అగ్రికల్చర్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు


22 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పంటలకు కనుపాపగా రేషామండీ డివైస్

ఐటీఓ డివైజ్ లేటేస్ట్ వెర్షన్ ను రేషామండీ కంపనీ లాంచ్ చేసింది. రేషా అభివృద్ది చేసినా ప్యాకేజీలో రైతుకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తుంది. అధిక దిగుబడులకు ష్యూరిటిలా నిలబడునుందని ఈ కంపనీ తెలిపింది. ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైనా పంటల సమాచారాన్ని రైతు ఫోన్ కు అందిస్తూ దాదాపు 15 శాతం పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉందంటున్నారు.

22 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభo

అలంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో పీఏసీఎస్ ద్వారా మంగళవారం నుండి పప్పుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. క్వింటాల్ కు రూ. 5,545 ల మధ్దతు ధర ఉందని, రైతులందరు నాణ్యమైన , తేమలేనీ శనగలు తీసుకొచ్చి మధ్దతు ధర పోందాలని మార్కెట్ అధికారులు, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

20 Feb , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నకిలీ విత్తనాలు జాగ్రత్త రైతన్న...

నకిలీ విత్తనాలు కొంపలు ముంచుతున్నాయి .సీజన్ ప్రారంభంలో పోలిసుల ,అధికారుల నిఘా ఉంటుందని గ్రామాలకు తెలివిగా ముందే చేరవేస్తున్నారు . గ్లైసిల్ విత్తనాల అమ్మకంతో వ్యాపారస్తులు క్కోట్లు సంపాదిస్తున్నారు . రెండు రోజుల ముందు తాండూరు పోలీసులు ఐదు క్వింటల్ల పత్తి విత్తనాలను పట్టుకోవడం జరిగింది అయితే వ్యాపారస్తులు తెలివిగా కౌలుకి తీసుకోని ,కొందరు వారి ఊరిలోనే ఉండి నమ్మించి మోసం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాలు ఫెబ్రవరి ,మార్చ్ నెలలలో డంప్ చేస్తున్నారు .గత ఏడాది 60 శాతం ఇలా నకిలీ విత్తనాలు సాగు చేసి పూర్తిగా నష్టపోయారు అంటే అర్ధం చేసుకోండి. గడ్డి మోలవదు ,అధిక దిగుబడికి ఆశపడి రైతుల అమాయకానన్ని ఆసరా చేసుక్కొని ఈ విత్తనాలను అంటగడుతున్నారు.గ్లైసిల్ విత్తనాలతో పర్యావరణానికి ముప్పుతో పాటు నెల నిస్సరమవుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి.దీంతో నాలుగేళ్లగా ఇలాగె నకిలీ విత్తనా సమస్య పెరిగిపోతుంది. రైతన్న తస్మాత్ జాగ్రత్తా .....