NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులు కోటీశ్వరులయ్యే పంట
సంప్రదాయ పంటలు పండిస్తే పెద్దగా లాభాలు ఉండవు. అందుకే రైతులు కొత్త పంటల వైపు చూస్తున్నారు. ప్రయోగాలు చేసి ఎంతో మంది రైతులు విజయవంతమయ్యారు. మనమందరం వెనీలా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతాం. అయితే ఈ వనిల్లా ఏమిటి మరియు అది ఎక్కడ నుండి వస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? వెనీలా అనేది పండించే మసాలా అని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు . ఇది తూర్పు మెక్సికో, గ్వాటెమాల, సెంట్రల్ అమెరికా, ఉగాండా, జమైకా కాకుండా భారతదేశంలో కూడా దీనిని సాగు చేస్తారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో వెనిలా ఒకటి. ఈ మసాలా కిలో విత్తనాల ధర రూ దాదాపు 40 నుంచి 50వేల వరకు పలుకుతున్నాయి . ప్రస్తుతం రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పంటల్లో వెనీలా కూడా ఉంది. మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎంతో మంది రైతులు వెనీలాను (Vanilla Farming) పండిస్తున్నారు. కుంకుమ పువ్వు తర్వాత అత్యంత ఖరీదైన పంటగా వెనీలాయే. వెనీలాను పెద్ద ఎత్తున సాగు చేస్తే. రైతులు కోటీశ్వరులవుతారు. అంత బాగా లాభాలు వస్తాయి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులకు అద్దె డ్రోన్లు
వ్యవసాయ రంగాల్లో ఆధునిక పద్దతుల్లో పండించే విధానాలు పెరుగుతున్నాయి. విత్తనాల నుండి ఎరువులు చల్లడం వరకు అన్ని డ్రోన్లతో చేసే రోజులు ముందున్నాయి .రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి రైతు అగ్రోస్ సేవా కేంద్రాలలో త్వరలో రైతులకు అద్దెకు మరియు కొనుగోలుకు డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. డ్రోన్ల ద్వారా స్ప్రే చేయడం వలన తక్కువ నీరు, పురుగుల మందు అవుతుంది అంతే కాకుండా ఇలా చేయడం వలన రైతులకు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా, కులిల ఇబ్బందులను అధిగమించవచ్చు అని తెలిపారు
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మిక్రోగ్రీన్స్ - తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు
ప్రస్తుతం వ్యవసాయంలో తక్కువ కాలంలో, తక్కువ ఖర్చులతో - ఎక్కువ లాభాలు, అధిక దిగుబడుల పై రైతుల దృష్టి పెరిగింది. మైక్రోగ్రీన్స్ ఇవి కొన్ని ఆకుకూర మొక్కలు పూర్తిగా ఎదగక ముందే కూరగాయలలా మరియు మూలికలు వాడుకునేవిగా చెప్పవచ్చు . వీటిలో అధిక పోషకాలు ,యంటిఆక్సిడెంట్లు , విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన కాన్సెర్, డైబెటిస్, గుండె సంబందిత అనేక ఆరోగ్య సమస్యలును దూరం చేయవచ్చు .మైక్రోగ్రీన్స్ అనేవి పూర్తిగా పెరిగిన ఆకుకూరల కంటే ఎక్కువ ఆరోగ్యకరమైనవి. టర్నిప్, ముల్లంగి, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యారెట్, పాలకూర, బచ్చలికూర, ఉసిరికాయ, క్యాబేజీ, దుంప మరియు తులసి వంటి అనేక రకాల మొక్కలను మైక్రోగ్రీన్స్‌గా పెంచవచ్చు. మైక్రోగ్రీన్‌లను ఏ సీజన్‌లోనైనా నాటవచ్చు, అయితే సీజన్‌ను బట్టి సాగు చేయడం మంచిది. మైక్రోగ్రీన్‌ల మంచి ఉత్పత్తి పరిసర ప్రాంతాల వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. కొత్తిమీర, ఆవాలు, ఉల్లిపాయలు, ముల్లంగి, పుదీనా మరియు వంటి మొక్కలు సాగుకు మంచివి. పొలాల్లోని మైక్రోగ్రీన్‌లను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. వ్యవసాయానికి ఎక్కువ సేంద్రియ ఎరువు లేదా నేల అవసరం. ఇది నేల అవసరం లేకుండా నీటిలో పెరిగే మైక్రోగ్రీన్లు కూడా ఉన్నాయి. వీటిని టెర్రేస్ నుండి బాల్కనీ ఎక్కడైనా పెంచుకోవచ్చు. దీని కోసం ప్రతిరోజూ 3 నుండి 4 గంటల సూర్యకాంతి సరిపోతుంది. వ్యవసాయం పెద్ద ఎత్తున జరిగితే, బలమైన సూర్యకాంతి నుండి పంటను రక్షించాల్సిన అవసరం ఉంటుంది. మిక్రోగ్రీన్స్ పెంచడం కుడా తేలికగా ఉంటుంది మరియు ఇవి విత్తనాలు 3 రోజులలో మొలకెత్తుతాయి, ఈ మొలకెత్తిన విత్తనాలను ఎండలో ఉంచి, రోజుకు 2 నుండి 3 సార్లు నీరు పెట్టాలి. మైక్రోగ్రీన్‌లు ఒక వారంలో సిద్ధంగా ఉంటాయి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
కల్తీ నూనెకు స్వస్తి
ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ స్వచ్ఛమైన విజయ గానుగ నూనెను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్ విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి విజయ గానుగ నూనెను మార్కెట్లోకి విడుదల చేశారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో తయారు చేసిన గానుగ నూనెలో కల్తీ ఉండదని, వచ్చే రోజుల్లో అందరికి కల్తీ లేని నూనె అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
బోరుకి రిటేoతా?
బోరు డ్రిల్లింగ్కు రేట్ ఫిక్స్ చేయండి గద్వాల జిల్లాలో బోరు బావులు తవ్వడానికి సంబంధించి రేట్ ఫిక్స్ చేయాలని అడిషనల్ కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో ఎస్సీ కార్పొరేషన్, భూగర్భ జల అధికారులతో సమీక్షించారు. బోర్ ఫ్లషింగ్, డ్రిల్లింగ్ డెప్త్, కేసింగ్, తదితర వాటికి సరైన రేట్లు నిర్ణయించి ప్రొసీడింగ్స్ తయారు చేయాలని ఆదేశించారు. ఇదే విధంగా అన్ని జిల్లాలో జరిగితే రైతులకు మేలు కలిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
అతిపెద్ద “కిసాన్ ఆగ్రి షో”
భారతదేశంలోనే అతిపెద్ద “కిసాన్ ఆగ్రి షో” హైదరాబాద్లో జరగనున్నది. ఈ ఎగ్జిబిషన్ను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ రంగంలోని ఇన్వెస్టర్లు, రైతులకు, స్టార్టప్ సంస్థలకు ఈ షో ఎంతో ఉపయోగపడింది. ఈ కిసాన్ ఎగ్జిబిషన్లో రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రంగంలో కొత్తగా వచ్చిన మార్పులు, నీటి నిర్వహణ, పరికరాలు, వాడే పద్ధతులు, విత్తనాలు, ప్లాంటింగ్ మెటీరియల్ భారతీయ వ్యవసాయ, వాతావరణ పరిస్థితులకు అవసరమైన ఎన్నో నూతన సాంకేతికత వివిధ విషయాల గురించి ఈ ఎగ్జిబిషన్లో తెలుసుకోవచ్చు అని నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి ‘‘కిసాన్’’ ఆగ్రి షోలో 160కి పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచనుండగా, వ్యవసాయ రంగంలోని స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహం అందించే ‘‘స్పార్క్’’ ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ 20 స్టార్టప్ సంస్థలు అధునాతన సాంకేతికలు, వినూత్న ఆలోచనలతో ఇక్కడ ప్రదర్శిస్తాయి మరియు కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐకార్ సంస్థలు కూడా ప్రదర్శనశాలను జ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయనున్నాయి. 32వసారి నిర్వహించబడుతున్న.‘‘కిసాన్” ఆగ్రి షోలో 30 వేల మందికి పైగా విజిటర్లు వచ్చే అవకాశం ఉందని అంచనా ఉంది . 12 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్ లోని హైటెక్స్ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. రైతులు హాజరై ఉపయోగించుకోవలసిందిగా కోరుకుంటున్నాము.. Jai kisan👳🌾
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వ్యవసాయంలో తెలుగు రాష్ట్రాలు..
దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తెలంగాణ వ్యవసాయ రంగం సైతం మెరుగైన వృద్ధిరేటును కనబరుస్తోంది.తాజాగా స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ గణాంకాలూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల ఉత్పత్తులు ఏడాదికేడాది భారీగా పెరుగుతున్నాయి. ఏడేళ్లనాటి పరిస్థితులతో పోల్చుకుంటే రెట్టింపుకంటే ఎక్కువగా తెలంగాణ రికార్డులు సృష్టించింది. 2014-15తో పోలిస్తే 2021-22నాటికి తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు దేశంలోని వివిధ రాష్ట్రాల పనితీరుని పరిశీలించిన వ్యవసాయ ఆర్థికవేత్తలు దీనిని ప్రచురించారు. సగటున 8.6 శాతం స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(GSDP)తో దేశంలోనే మూడో స్థానంలో తెలంగాణ నిలిచిందని అందులో ప్రకటించారు. యావరేజ్ GSDP 8.9 శాతంతో గుజరాత్ అగ్రస్థానంలో, 8.7 శాతంతో ఉత్తరాఖండ్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. 8.6 శాతంతో తెలంగాణ తదనంతర స్థానంలో కొనసాగుతోందని నివేదిక స్పష్టం చేసింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
యాసంగిలో రా రైస్ కావాలని పట్టు..!
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొండితనం ప్రదర్శించింది. దొడ్డు రకం వడ్లు (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. రైతుల శ్రేయస్సు దృష్ట్యా దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది. బుధ వారం ఢిల్లీలో యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ వివిధ రాష్ట్రాలతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఈ యాసంగిలో కూడా దొడ్డు వడ్లు తీసుకోబోమని స్పష్టంచేసింది. గత ఏడాది కూడా యాసంగి పంట కొనుగోలుపై కేంద్రం ఇదే వైఖరిని అవలంబించింది. దీంతో రాష్ట్రంలోని రైతాంగం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పోరాటమే చేసింది. సీఎం కేసీఆర్ సైతం ప్రత్యక్షంగా ఢిల్లీలో జరి గిన రైతుల ధర్నాలో పాల్గొని కేంద్ర వైఖరిని తీవ్రంగా ఖండించారు. అయినా కేంద్రం స్పందించకపోవడంతో రూ.1,000 కోట్ల నష్టాన్ని భరించి రైతులు పండిం చిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ సీజన్లోనైనా కేంద్ర > ప్రభుత్వ వైఖరిలో మార్పు వస్తుందని ఆశించారు. కానీ కేంద్రం మాత్రం రైతుల పట్ల తన నియంతృత్వ వైఖరిని కొనసాగించింది. రాష్ట్రంలో ఈ ఏడాది యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో 57 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యింది. దాదాపు 1.50 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఈసారి కూడా దొడ్డు ధాన్యం తీసుకునేది లేదని కేంద్రం భీష్మించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్.. మంత్రులు, అధికారులతో సమీక్షించనున్నట్టు సమాచారం.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పనసకి గిరాకీ
విహహాది శుభకార్యాలు, విందుల్లో లేత పనస కాయలను కూరగా, వేపుళ్లు, పచ్చడిగా , బిర్యానీలు తయారు చేస్తుండంటంతో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుందని సాగుదారులు చేబుతున్నారు. ఎరువులు , మందులు లేనీ ఈ పంటకు కిలో 5 నుంచి 10 రూపాయల వరకు ధర దక్కుతుందని చింతపల్లి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివిధ పంటలతో పోలిస్తే ఈ పంట సాగు లాభాదయకంగా ఉందంటున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
463 కోట్లతో సుస్థిర వ్యవసాయం
463 కోట్లతో సుస్థిర వ్యవసాయం జమ్మూ కాశ్మీర్ వ్యవసాయనికి పునరుజ్జీవింపజేసే ప్రాజెక్టు ను రూపొందించారు.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సాంకేతికత జోడించడం మరియు సమగ్ర వ్యవసాయ విస్తరణ సేవల ద్వారా రైతులు మరియు విద్యావంతులైన యువతకు సాధికారత కల్పించడం వంటి సేవలతో పాటు అన్ని రకాల రైతు సేవలకు అధికారికoగా వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.









