16 Aug , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

*తెలంగాణ రైతు బీమా పథకంపై కీలక అప్డేట్.. అన్నదాతల సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తప్పనిసరి

⏭️ తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షలు అందుతాయి. అయితే ఈ ఏడాది కొత్తగా రైతు బీమా పథకంలో చేరే రైతులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను వ్యవసాయ శాక అధికారులు విడుదల చేశారు. పథకంలో కొత్తగా చేరే రైతులు తప్పనిసరిగా తమ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం కాపీలతో పాటు, నామినీ ఆధార్ కార్డును కూడా దరఖాస్తుకు జతచేయాలి. ఈ పత్రాలను పూర్తి చేసి, సంతకం చేసి వ్యవసాయ విస్తరణాధికారులకు (AEO) అందజేయాలి. ఈ దరఖాస్తు పత్రాలు ఏఈవోల వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ పథకంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు మాత్రమే చేరేందుకు అర్హులు. అంటే, 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్య జన్మించిన వారు అర్హులు. 18 ఏళ్లు నిండి, పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న కొత్త రైతులను ఈ ఏడాది జాబితాలో చేరుస్తారు. అదే సమయంలో 59 ఏళ్లు నిండిన రైతులను జాబితా నుంచి తొలగిస్తారు.

03 Aug , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

UP రైతులకు ఖచ్చితమైన వాతావరణ సమాచారం:WINDS Project

UP: రైతులు ఖచ్చితమైన వాతావరణ అంచనాతో, కరువు, వరదలు మరియు తుఫానుల వంటి తీవ్రమైన వాతావరణ సంఘటనలను ఎదుర్కొనేందుకు మరియు ఉత్పాదకతను పెంచడంతో పాటు, పంట బీమా మరియు ఇతర వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలను సహాయపడేలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ సమాచార నెట్‌వర్క్ మరియు డేటా సిస్టమ్ (Weather Information Network and Data System - WINDS) ప్రాజెక్టు ను తిసుకొనుచింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.77 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ ప్రాజెక్టు కింద బ్లాక్ మరియు పంచాయతీ స్థాయిలో 308 ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను & గ్రామ పంచాయతీలలో 55,570 రెయిన్ గేజ్‌లను ఏర్పాటు చేయనున్నారు.

03 Aug , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పశువుల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం

మహారాష్ట్ర రాష్ట్ర సర్కార్ పశువుల పెంపకానికి వ్యవసాయ హోదాను మంజూరు చేసింది. పాడి, కోళ్లు, మేకలు మరియు పందుల పెంపకంలో నిమగ్నమైన రైతులకు వ్యవసాయ వ్యాపారాలతో సమానంగా రాయితీలు అందించడం అవసరమని నిర్ణయించి వ్యవసాయ సమాన హోదా ఇవ్వాలని గురువారం ప్రభుత్వ తీర్మానం పేర్కొంది. ప్రస్తుతం, మహారాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 12% మరియు మొత్తం వ్యవసాయ రంగంలో పశువుల ఉత్పత్తి వాటా 24% ఉంది. ఇదే విధానం మన రాష్ట్రంలో కూడా రావాలని ఇక్కడి రైతులు కొరుకుంటున్నారు.

03 Aug , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

2025- 26 ఖరీఫ్ MSP పంటల ధరలు!

2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ కనీస మద్దతు ధరలను చూద్దాం. మన తెలుగు రాష్ట్రాల్లో ఆత్యందికంగా సాగుచేసే పత్తికి 589 క్వింటాకు పెరిగింది. అలాగే కంది పంటకు 450 క్వింటాకు పెరిగింది. పెరిగిన ధరలు మరో నెల రోజుల్లో ఖరీఫ్ లో సాగుచేసినా సోయా, పెసర, మక్క వంటి స్వల్పకాలిక పంటల దిగుబడులు అందనున్నాయి. Crop. 2025-26. 2024-25 వరి -69/- 2369/- 2300/- జోన్న-328/- 3699/- 3371/- మొక్కజొన్న-175/- 2400/- 2225/- కందులు- 450/- 8000/- 7550/- పెసలు- 86/- 8768/- 8682/- సోయాబిన్- 436/- 5328/- 4892/- పత్తి-589/- 8110/- 7521/- పల్లి-480/- 7263/- 6783/-


03 Aug , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మీకు తెలుసా ? : DDKY (ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన)

పంటల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా దేశ సర్కారు జూలై 16న  ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఆరేళ్లపాటు రూ.24 వేల కోట్లతో దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఎంపిక చేయబడిన ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన DDKY సమితిని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ఆదర్శ రైతులు, సంబంధిత అధికారులు ఉంటారు. ఈ పథకం ద్వారా అధిక ఉత్పాదకత , వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో విలువ జోడింపు, స్థానిక జీవనోపాధి కల్పన , దేశీయ ఉత్పత్తి పెరుగుదల, మరియు స్వావలంబన సాధించేలా DDKY సమితులు మరియు నోడల్ ఆఫిసర్లు పరిశీలిస్తారు. ఈ పథకం ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా 1.7కోట్ల మంది లబ్బిపొందే అవకాశం ఉంది.

02 Aug , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఖరీఫ్ సాగు విస్తీర్ణం : 829.64 లక్షల హెక్టార్లు

2025-26 సీజన్‌కు భారతదేశంలో వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, జూలై 25, 2025 నాటికి ఖరీఫ్ పంటల మొత్తం విస్తీర్ణం 829.64 లక్షల హెక్టార్లు సాగైంది. ఇది గత సంవత్సరం కంటే 31.73 లక్షల హెక్టార్ల పెరిగింది. 2024-25తో పోలిస్తే వరి విస్తీర్ణం దాదాపు 29 లక్షల హెక్టార్లు, పప్పుధాన్యాలు 3.11 లక్షల హెక్టార్లు, ముతక తృణధాన్యాలు 5.75 లక్షల హెక్టార్లు పెరిగింది. కాని నూనెగింజల సాగు గత సంవత్సరం కంటే 3.83 లక్షల హెక్టార్లు తగ్గింది. ఇందులో ముఖ్యంగా సోయాబీన్‌ విస్తీర్ణం అత్యధికంగా తగ్గింది. పత్తి సాగు కూడా గత సీజన్‌తో పోలిస్తే ఇది 2.37 లక్షల హెక్టార్లు తగ్గింది.

02 Aug , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

విరుగుడు లేని పారాక్వాట్ గడ్డి మందు పై అవగాహన పెంచాలి : కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ జిల్లాలోని పెస్టిసైడ్ డీలర్లు, వ్యవసాయ అధికారులు, టీఎస్ ఎంసీఈసీ, డిఎపిపి సభ్యులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమావేశం నిర్వహించారు. పురుగు మందులు విక్రయించిన డీలర్ల వద్ద రైతు వివరాలు ఉండాలన్నారు. ముఖ్యంగా విరుగుడు లేని పారాక్వాట్ గడ్డి మందు దుష్పరిమణామాలను రైతులకు వివరించాలని సూచించారు. పిచికారి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను రైతులకు వ్యవసాయ అధికారులకు తెలియజేయాలన్నారు. డీలర్లు క్రయవిక్రయముల్లో నిబంధనలు పాటించాలని ఆదేశించారు.


01 Aug , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఏ పండ్లు ఇవి? మీకు తెలిస్తే కామెంట్ చేయండి.

ఈ రకం పండ్లను మీ దగ్గర ఏమని పిలుస్తారు. తినడం వల్ల ఉపయోగాలను కామెంట్ లో తెలపండి.

01 Aug , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

20వ విడత : రేపే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులు శనివారం రిలీజ్ చేయనున్నారు.దేశ వ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులకుగాను రూ. 20,500 కోట్లు జమ అవనున్నాయి. ఈ ప్రోగ్రాంలో కేంద్ర వ్యవసాయం మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొననున్నారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రూ.6,000 ఆర్థిక సాయాన్ని(రూ.2,000 చొప్పున) అందజేసేది అందరికీ తెలిసిందే.

01 Aug , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పులుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ : 040-23231772

పులుల సంచారం పెరిగింది-పీసీసీఎఫ్ చీఫ్ సువర్ణ రాష్ట్రంలో పులుల సంచారం పెరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వన్యప్రాణులు కనిపిస్తే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని అటవీ దళాల ప్రధాన సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) సువర్ణ కోరారు. పులులు ఎక్కడైనా సంచరించినట్లు అనిపిస్తే టోల్ ఫ్రీ నంబర్ 040-23231772కు కాల్ చేయాలని చెప్పారు. మన రాష్ట్రంలో పులుల సంతానం పెరగడం లేదని, మహారాష్ట్ర నుంచి ఎక్కువగా చిరుతలు వస్తున్నాయన్నారు. రెండేండ్లలో ఏడు చిరుతలను పట్టుకున్నామన్నారు.