NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
కొయ్యూరులో జ్యూస్, సోడా యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు !!
మండలంలో జీడి మామిడి సాగు ప్రధానమైంది. మండలంలోని 33 పంచాయతీల్లో సుమారు 40 వేల ఎకరాలకు పైగానే జీడిమామిడి తోటలు విస్తరించి ఉన్నాయి.. ఈ తోటల్లోని పండ్లను కొన్ని సార్లు వృథాగానే బయట పారే స్తుంటారు. ఈ పండ్లతో జీడి మామిడి జ్యూస్, సోడా తయారు చేయించే యూనిట్ని కొయ్యూరులో నెలకొల్పేందుకు వెలుగు అధికారులు అధ్యయనం చేస్తున్నారు. పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ అదే శాల మేరకు వెలుగు ఏపీఎం శ్రీనివాస రావు, సిబ్బంది గంగవరం మండలంలో ఏర్పాటు చేసిన యూనిట్ను ఇటీవల పరిశీలించారు. ఓ సంస్థ సుమారు 20 లక్షలతో జ్యూస్, సోడా తయారు చేసి యంత్రాలను అందించింది. వీటికి మంచి డిమాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఇలా తయారు చేసిన సోడా ఆరు మాసాల పాటు నిల్వ చేసే అవకాశం ఉంది. రైతులకు సైతం ఆర్ధికంగా ఉపయోగం ఉంటుంది. కొంతమందికి ఉపాధి దొరుకుతుంది. ఈ ఏడాదిలోనే జీడిమామిడి పండ్ల జ్యూస్, సోడా యూనిట్ అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వేల ఎకరాల పంట నష్టం
వడగళ్ల వానతో మొక్కజొన్న, బీర, టమాట, బొబ్బర, మిరప, గులాబీ, ఉల్లి మరియు కొన్ని పొట్ట దశ వచ్చిన వరి నేల వాలింది. మామిడి పిందేలు, కాయలు రాలి తీవ్ర నష్టం వచ్చిందని రైతులు బాధపడుతున్నారు. ఆరు జిల్లాల్లో సుమారుగా 50 మండలాల్లోని 650 గ్రామాల్లో ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో వడగళ్లతో పంట పొలాలన్నీ మంచుతో నిండిపోయాయి. పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. దీనితోపాటు సంగారెడ్డి, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగురు జిల్లాలోనూ పలుచోట్ల వడగళ్ల వానతో పంట పొలాలు దెబ్బతిన్నాయి. రానున్న నాలుగు రోజులు తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వేసవిలో పశువులు జాగ్రత్త
వేసవిలో గత ఏడాదికన్నా వేడి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అధిక ఉషోగ్రతలు, వేడి గాలుల వలన పాడి పశువులు ఉష్ణతాపానికి గురవుతాయి. ఈ పరిస్తితులలో యజమానులు సస్యరక్షణ చర్యలు తీసుకోని కాపడుకోవాలని పశు వైద్యాధికారులు చెబుతున్నారు. అందుకని మేతలో భాగంగా వేసవిలో సులువుగా జీర్ణమయ్యే గంజి, జావ లాంటి పదార్థాలు ఇవ్వడంతో పాటు ఎక్కువ శాతం పచ్చిమేత ఇవ్వాలి. పచ్చిగడ్డి ఉద యం, ఎండు గడ్డి రాత్రి సమయాల్లో ఇస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మినరల్ మిక్చర్, ఉప్పు కలిపిన ద్రావణం ఇవ్వడం మంచిది. పశువుల్ని మేపేందుకు ఉదయం 6 నుంచి 10గంటల వరకు సాయంత్రం 5 నుంచి 7గంటల వరకు బయటకు పంపడం మంచిది. పశువులకు వడదెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మేత విషయంలో పచ్చి గడ్డికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, చల్లని నీరు తాగించాలి. చల్లటి వాతావరణంలోనే మేతకు బయటకు పంపించాలి. ఈ రెండు నెలలు పశువులు, జీవాలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఈ ఏడాది చింతపండు గురించి మరిచిపోవల్సిందేనా!!
ఈ ఏడాది ఆశించిన స్థాయిలో కాపు లేదు. చింత పువ్వు దశలో ఈదురుగాలులు, వర్షాలు అధికంగా కురవడంతో ఆ ప్రభావం పంటపై పడింది. చాలాచోట్ల ఇదే పరిస్థితి. వాస్థవంగా ఏటా జిల్లాలో గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు, కొమరాడ, పాచిపెంట ప్రాంతాల్లో 5 వేల క్వింటాళ్ళు, సీతం పేట మన్యంలో ఏటా రెండు వేల క్వింటాల్ల వరకు చింతపండు దిగుబడి వస్తుంది.సాదారణంగా మన్యంలో చింతపండుకు మంచి డిమాండ్ ఉంది. గత ఏడాది చింతపండు నిల్వలు ఎక్కువగా ఉండడంతో కొనుగోలుకు మొగ్గు చూపలేదు. అయితే ఈ ఏడాది చింతపండు ధర మరింత ప్రియంగా ఉండే అవకాశం ఉంటుందని ఆశపడ్డారు.కానీ ఆశించిన దిగుబడి లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆయిల్ పామ్ లో అంతర పంటగా మొక్కజొన్న
సిరులు కురిపిస్తున ఆయిల్ పామ్ పై రైతులు ఎంతగానో ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే మరి పంట దిగుబడికి 3 నుండి 4 ఏళ్ళు వేచి చూడకుండా తోటలో మొక్కలు నాటినా నాలుగేళ్ల వరకు మొక్కజోన్న అంతర పంటగా సాగు చేసి ఎక్కువ ఆధాయం పొందవచ్చు. భుసారాన్ని బట్టి 8 వేల నుండి 10 వేల వరకు పెట్టుబడి అవుతుంది మరియు 90 రోజులకు 70 వేలకు పైగా ఆదాయాన్ని పొందవచ్చని అంతేకాక నీటి వినియోగం, ఎరువుల వాడకం తగ్గుతుందని అంతర పంటగా తీపి మొక్కజొన్న (sweet corn) సాగు చేసేందుకు ఖరిఫ్ లో జూన్- ఆగుస్ట్ మరియు రబీలో మర్చి- మే వరకు ఏడాదికి రెండుసార్ల వేసుకోడానికి అనుకులం అని సాగుచేసే రైతులు చెబుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులకు శుభవార్త - మార్కెట్ యార్డులో రూ.5 కే భోజన సౌకర్యం !
తెలంగాణ ప్రభుత్వం పట్టణానికి పనికోసం వచ్చే రైతులు సమీప పట్టణ మార్కెట్టుకు వెళ్ళినప్పుడు అధిక మొత్తంలో వారి భోజనానికి ఖర్చు చేయవసి వస్తుంది. వారికీ తక్కువ ధరకు భోజన సౌకర్యాన్ని అందిస్తున్న పథకం ‘అన్నపూర్ణ పథకాన్ని’ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు అన్నపూర్ణ పథకాన్ని హైదరాబాద్ సహా పలు నగరాల్లో, పట్టణాల్లో, ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నారు. ఇక్కడ కేవలం రూ.5కే భోజనం అందజేస్తారు. రైతుల ఖర్చులను తగ్గించిన నాణ్యమైన ఆహారం అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
టన్నుకు 24 వేలు పలుకుతున్న అరటి ధర!!
ఆంద్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో అరటి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్, ఎగువ రాష్ట్రాల్లో అరటి లేకపోవడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం టన్ను అరటి ధర రూ.24 వేలకు చేరింది. గత సీజన్లో టన్ను రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకూ పలికింది. ప్రస్తుతం అరటికి మంచి ధర ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లలో ఈ ధరే అత్యధికమని వారు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా అరటి సాగు జరిగే మహారాష్ట్ర , బీహార్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో దిగుబడులు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో, రాష్ట్రంలోని అరటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెలుగు రాష్ట్రాలకి అకాల వర్షాల బెడద...!!
రైతులు తస్మాత్ జాగ్రత్త..!! తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నటు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలియజేసింది. ఈ నెల 16-20 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. 2013-2014 తర్వాత మళ్ళి ఈ మార్చ్ లోనే ఏక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కొన్ని రకాల పంటలకు నష్టం కలిగే అవకాశం ఎక్కువ గా ఉన్నట్లు సూచించారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు చేపడితే పంటలకు నష్టం వాటిల్లకుండా ఉండే అవకాశం ఉంటుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మహిళ మణి విజయగాధ
నేటి యుగంలో పురుషులతో సమానంగా వైద్య, విఙ్ఞాన, వ్యాపార, విద్య రంగాల్లోనె కాక వ్యవసాయంలోనూ మహిళలు ముందున్నారు. ఇంటి పనులతో పాటు భర్తతో దీటుగా అన్ని వ్యవసాయ పనులు చేస్తూ, సహాయపడుతుంది. సూర్యాపేట జిల్లా, పెన్ పహాడ్ మండలం, దూపహాడ్ గ్రామానికి చెందినా లక్ష్మి అనే మహిళ వారికి ఉన్న 40 ఎకరాల వ్యవసాయాన్ని సాగులో సహాయమే కాక కూలిల కొరత తీర్చేందుకు తీర్చేందుకు భర్త అరవింద్ సహకారంతో ట్రాక్టర్ నేర్చుకొని దుక్కి దున్నడం, మందు కొట్టడం వంటి అనేక వ్యవసాయ పనులలో చేదోడుగా ఉంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వరి వద్దు ఇతర పంటలతో లాభాలు పొందుదాం.
గతంలో ప్రధానంగా రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి సాగు చేసేవారు. దీంతో సాగుకు ఖర్చు తక్కువ కావడంతో పాటు ఎరువులు, కూలీల ఖర్చు తక్కువగా ఉండేది. పండించిన ధాన్యానికి మార్కెట్‌లో డిమాండ్ ఉండడంతో రైతులకు ఎక్కువ లాభాలు వచ్చేవి. 30 ఏండ్ల కిందట రైతులు ప్రజలకు నిత్యం ఉపయోగపడే పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం భూములన్నీ అన్ని పంటల సాగుకు అనుకూలమైనా రైతులు కూడా వరిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. ఒకే రకమైన పంటలు సాగుచేయడం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడి తక్కువగా వస్తున్నది. పంట ఉత్పత్తులు ఎక్కువ కావడం వల్ల మద్దతు ధర లభించడం లేదు. దీంతో మార్కెట్లో మిగతా పంట ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సాగుచేపడితే మేలని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగుచేయడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించొచ్చని చెబుతున్నరు. గతంలో రైతులు వేరుశనగ, పప్పుశనగ, పొగాకు, మొక్కజొన్న, కుసుమ, పత్తి, ఆముదం, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, మినుములు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, పెసర్లు, కంది, అలసందలు, వాము తదితర పంటలు సాగు చేసేవారు. ఈ పంటలకు పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా వచ్చేవి. రైతులు ఇతర పంటలు పండించి లాభాలు పొందాలని ప్రభుత్వం కోరుకుంటుంది.









