29 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వాణిజ్య పంటగా వెదురు సాగు

అటవీ జాతికి చెందిన వెదురు బొంగు పంటను 2017 తర్వాత వ్యవసాయ పంటగా గుర్తించి మిషన్ బంబూ పేరుతో రైతులకు మొక్కల పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో రైతులు వెదురు సాగు చేస్తున్నారు. ఎకరాకు 800 నుంచి 1000 మొక్కలు వరకు నాటుకోవచ్చని, నాటిన మూడో ఏడాది నుంచి దిగుబడులు మొదలైతాయని, ఇలా నాటిన దాదాపు 50 సంవత్సరాల వరకు దిగుబడులు వస్తాయని వ్యవసాయ, ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ఇటివల నిర్మల్ జిల్లా, ముథోల్ పరిసర ప్రాంతాల్లో వెదురు సాగుచేసే రైతులతో హార్టికల్చర్ ఆఫీసర్ శ్యామ్ రావు రాథోడ్ సమీక్షించి సలహాలు, సూచనలు అందించారు.

28 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

బ్యాగులకు రంధ్రాలుంటే తిరస్కరణ

ఉమ్మడి వరంగల్ రైస్ మిల్లర్ల నుంచి వచ్చే నాసిరకంగా ఉన్న బియ్యం నింపే గన్నీ సంచులను భారత ఆహార గిండ్డంగుల సంస్థ తిప్పి వెనక్కి పంపుతుంది. ఇటీవల హన్మకొండ, జనగామ జిల్లాలోని ఎఫ్ సీ ఐ కేంద్రాలకు వచ్చిన దాదాపు 90 శాతం గన్నీ సంచులు నాసిరకంగా, రంధ్రాలు ఉన్నాయని తిరిగి వెనక్కి పంపారు. సెంట్రల్ జ్యూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియ వారు చెప్పిన విధంగా ప్రతీ బ్యాగు 580 గ్రాములు కలిగి ఉండాలని చెప్పినప్పటికీ, 20 గ్రాములు తక్కువగా ఉంటుందని ఎఫ్ సీఐ అధికారులు చెబుతున్నారు.

27 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ముడి జనపనార పండించే రైతుకు శుభవార్త

ముడి జనపనార రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2023- 24 సంవత్సరానికి గాను క్వింటా జనపనారకి 300 రూపాయలను పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరతో ప్రస్తుతం రూ.5050 చెరిందని, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరను పెంచామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

27 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

క్వింటా ఎండు మిర్చి @ 48786/-

ఈ ఏడాది అతి, అనావృష్టితో చాలా పంటలు దెబ్బతిన్నప్పటికీ వచ్చిన అరకోర దిగుబడులకు మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉండటం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పంటైనా మిరపకి కర్నూలు మార్కెట్ యార్డులో రికార్డు ధరలు పలుకుతున్నాయి. శనివారం కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటా ఎండు మిర్చికి 48 వేల 786 రూపాయలు పలకటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరతో మార్కెట్ యార్డులో శనివారం ఒక్కరోజే 295 క్వింటాళ్ల ఎండుమిర్చి బస్తాలను రైతులు విక్రయానికి తీసుకువచ్చారు.


24 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పంట నష్టం సేకరణలో ఏఈవోలు

ఇటీవల (17 – 21 మార్చి,2023) కురిసిన చెడగోట్టు వానాలతో నష్టపోయినా రైతుల వివరాలను గ్రామాల వారీగా సేకరించాలని వ్యవసాయ అధికారలకు ముఖ్యమంత్రి అదేశించారు. నష్టపోయినా పంటల వివరాలతో పాటు రైతు బ్యాంకు ఖాతా వివరాలు, పట్టాపాస్ బుక్ వివరాలను సేకరించాలని ప్రభుత్వ కార్యదర్శి రాహూల్ బొజ్జా ఉత్తర్వులు జారిచేశారు. ఈ పక్రియను 4 రోజుల్లో పూర్తిచేయలని, అనంతరం ఎకరాకు10 వేల చోప్పున డిజాస్టార్ మేనేజ్మేంట్ నుంచి పరిహారం అందించేలా కార్యచరణ సిద్దం చేస్తున్నారు.

24 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రాష్ట్రానికి వర్ష సూచన

తమిళనాడులో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల్లో వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం గురువారం ప్రకటించింది. ఈదురు గాలులు, వడగండ్లు, ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే పంట కోతలు పూర్తైనా రైతులు నిల్వచేసే ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకొవాలని సూచిస్తున్నారు.

23 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఫసల్ బీమా యోజన (FBY)

ఈ పథకం కింద, రైతులు తమ పంటలకు కరువు, వరదలు, అగ్నిప్రమాదం, తుఫాను, తెగుళ్లు మరియు వ్యాధులు వంటి వివిధ నష్టాల పరిస్థితుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు బీమా కవరేజీ మరియు ఆర్థిక సహాయం అందించడానికి భారత ప్రభుత్వం 2016లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పంట నష్టపోయిన రైతులు బీమా పొందవచ్చు. దీనికి రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మరికొంత ప్రీమియం చెల్లిస్తాయి. నష్టం జరిగినప్పుడు వెంటనే బీమా కంపెనీకి లేదా సంబంధిత అధికారులకు తెలియజేయండి. మీ పంటలలో సంభవించిన నష్టాన్ని సమయ వ్యవధిలోపు క్లెయిమ్ ఫైల్ చేయండి. క్లెయిమ్ ఆమోదించబడిన తర్వాత, బీమా కంపెనీ పరిహారం మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు విడుదల చేస్తుంది. కావునా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పంట నష్టం నుండి బయటపడండి.


23 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ప్రతి ఎకరానికి రూ 10,000 నష్టపరిహారం!!

ప్రతి ఎకరానికి రూ. 10,000 నష్ట పరిహారం!! అకాల వర్షాల వల్ల నష్టపోయిన తెలంగాణ రైతుకి కొంత ఊరట. ఈరోజు క్షేత్ర స్థాయి పంటల పరిశీలన తరువాత, తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల కురిసిన వడగండ్ల వానల వల్ల నష్టపోయిన పంటల రైతులకి అభయమిచ్చారు. పంటతో సంబంధం లేకుండా నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ. 10,000/- (పది వేల రూపాయలు) నష్టపరిహారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అని, దానికోసం రూ. 228 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నష్ట పరిహారం కౌలు రైతులకి కూడా వర్తిస్తుందని తెలుపడం, కౌలు రైతుల నష్టాలకి కూడా కొంత ఉపశమనం.

21 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రూ. 45000/- వరకు వరి పంట రుణ పరిమితి పెంపు!

ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన సోమవారం నాటి సమావేశంలో జిల్లాల వాతావరణ పరిస్థితులు, జిల్లా స్థాయి సాంకేతిక కమిటీలు తయారు చేసిన పంట రుణ పరిమితులను పరిగణనలోకి తీసుకుని 2023-24 సంవత్సరానికి సగటున రుణాలను 15% నుంచి 20% మేర పెంచాలని నిర్ణయించడం జరిగింది. ఇక నుంచి వరి సాగుకు పంట రుణ పరిమితిగా రానున్న ఖరిఫ్ లో 42 వేలు , రబీలో 45 వేల వరకు రుణ పరిమితి ని రైతులు పొందవచ్చు.

20 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వ్యవసాయంలో రోబో

ఇతర రంగాలతో పోలిస్తే టెక్నోలజి వ్యవసాయ రంగలో వెనకబడి ఉన్నప్పటికి వ్యవసాయ రంగాల్లో ఏ మాత్రం వెనకంజా వేయకుండా శాస్రవేత్తలు, విద్యావంతులు పరిశోదిస్తున్నారు. పరిశోధకుల నిరంత కృషి వలెనే డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు రిమోట్ కంట్రోల్ మరియు బ్యాటరి సాయంతో నడిచే రోబో ట్రాక్టర్ అందుబాటులోకి వచ్చింది. సరైన సమయంలో కూలిలు అందుబాటులో లేకపోవడం మరియు కూలి రేట్లు ఎక్కువ అవ్వకుండా ఖర్చు తగ్గిచుకోవడానికి ఈ రోబో ఎంతగానో సహాయపడుతుంది. ఇది బ్యాటరితో నడిచేది కావున తక్కువ ఖర్చు మరియు వేరే వారి పై ఆధారపడకుండా రైతు సొంతగా తానెగానే వాడవచ్చు. ఈ రోబో మూడు అంగుళాల లోతుకి దున్నడం, సాళ్ళ మధ్య కలుపు, పురుగు మందుల పిచికారి, విత్తనాలు మరియు నారు వేసుకోవడానికి ఉపయోగించవచ్చు. పవర్ టిల్లర్, ఎద్దుల అరక, బ్రష్ ట్రాక్టర్, స్ప్రేయర్ ద్వారా చేసే పనులన్నీ ఈ రోబో ట్రాక్టర్ చేస్తుంది. దినిని అన్ని పంటల్లోను వాడవచ్చు అని రోబో సృష్టికర్తలైన ధర్మేంద్ర మరియు త్రివిక్రం తెలియజేసారు.