NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నాపంట యాప్ తొ, ప్రతి రైతు అవుతాడు స్మార్ట్!!
నాపంట® స్మార్ట్ రైతు యాప్ అనేది రైతులు తమ వ్యవసాయ పనులను ఆధునీకరించడానికి, లాభదాయకతను పెంచడానికి రూపొందించబడినది. ఇందులో రైతులు 120కి పైగా పంటలకు సంబందించిన తెగుళ్లు, వ్యాధులు మరియు కలుపు నిర్వహణ పద్ధతులతో సహా, సమయానుకూల సమాచారం మరియు వ్యవసాయానికి కావలసిన అన్నిరకాల సూచనలను పొందవచ్చు. రైతులు తమ పంటల గురించి ఖచ్చితమైన సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో మరియు ఖర్చులను తగ్గించుకుంటూ దిగుబడిని మెరుగుపరచడంలో సహాపడుతుంది. నాపంట ప్లాట్‌ఫారమ్ ద్వారా 3,500 పైగా వ్యవసాయ మార్కెట్లలోని రోజువారీ ధరలతో పాటు 5,000 పైగా వివిధ కంపెనీల పురుగుమందుల ఉత్పత్తులు మరియు వాటి ప్రత్యామ్నాయాల వివరాలు కూడా సులువుగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాపంట యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి : bit.ly/NaPanta
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఒక్కసారి నాటితే 8 పంట కాలల వరకు దిగుబడులు
వాణిజ్య పంటల సాగుతో పోలిస్తే వరి సాగు చేయడం కాస్త సుఖమైన పని. అట్లాగే ఈ పంటలో వచ్చే అదాయం కూడా తక్కువే. సొంత పొలం ఉన్నప్పటికి ఎకరాకు 20 నుంచి 25 వేలు మిగలటం గగనమే. ఇలా పెరిగుతున్న ఖర్చులను తగ్గించేందుకు డ్రమ్ము సీడ్ విధానం, నాట్లు వేసే యంత్రాలు వంటివి వచ్చినప్పటికి పెద్దగా ఖర్చులో మార్పులేమి లేవు. ప్రస్తుతం విత్తన ఖర్చు, నారుపోయటం, నాట్లేయడం వంటి భాదలు తోలిగేలా చైనాకు చెందిన యున్నాన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒకసారి నాటితే 4 సంవత్సరాల (8 పంటలు) వరకు పంట దిగుబడినిచ్చే పీఆర్-23 (Perennial Rice) పేరుతో వంగడాన్ని రూపొందించారు. ఇండియాలోనూ ఇలాంటి విత్తనాలు అభివృద్ది చెందితే వరి సాగు రైతులకు విత్తనం, నారు మడుల తయారు, నాట్ల ఖర్చులు తగ్గినట్టే.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఒకే చెట్టుపై 250 రకాల యాపిల్స్
ఇంగ్లాడ్, పశ్చిమ ససెక్స్ లోని చిచెస్టర్ సమీపంలోని చిధామ్ లో నివసించే బార్నట్ తన ఇంటి అవరణంలోని యాపిల్ చెట్టుకు అంటుకడుతూ 250 వేరైటీలను ఒకే మొక్కకు అంటుకట్టి జాగ్రత్తగా అభివృద్ధి చేశాడు. తనకి మొక్కల పై మక్కువ తో పెద్ద మొత్తంలో మొక్కలు నాటాలకున్నప్పటికి స్థలభావం దృష్యా ఇలా ఒకే మొక్కకు అంటు కట్టే విధానాన్ని ఎంచుకున్నానని బార్నట్ హార్టికల్చరిస్ట్ వివరించాడు. కొత్త రకాలను ప్రతి సంవత్సరం వేసవిలో మొలకెత్తించి, శీతాకాలంలో అంటుకోవడం ఇతనికి పరిపాటి. సుమారు 20 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టుపై పండ్ల బరువు కారణంగా విరగకుండా కర్రతో సపోర్టు ఇచ్చి పెంచుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మళ్ళీ రైతులకి వడగండ్ల వాన!!
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నుండి ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుండి 40 కి మీ వేగంతో గాలితో పాటు వడగళ్ల వాన కూడా వచ్చే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో వరి కోత సమయం కావడంతో రైతులు తీవ్ర ఆందోళకు గురువవుతున్నారు. రానున్న నాలుగు రోజుల పాటు మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి అని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇప్పటికే అకాల వర్షాల వలన పంట నష్టపోయిన రైతులను ఈ వాన భయపెడుతుంది, కోతకు సిద్ధంగా ఉన్న వరి మరియు మామిడి పంటల్లో నష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. కావున రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పెరిగిన పత్తి విత్తన ధరలు
ఈ ఏడాది బిజి 2 పత్తి విత్తన ప్యాకెట్ పై 43 రూపాయలు పెంచుతున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ గెజిట్ విడుదల చేసింది. గతేడాది పత్తి ప్యాకెట్ కి 810 రూపాయలు ఉండగా ఈ ఏడాది పెరిగిన ధరతో 853 రూపాయలకు చెరింది. రెండుమూడేళ్లుగా పత్తి పంటలో నాణ్యమైన దిగుబడులు రావటంలేదని, దీనికి తోడు విత్తన ధరలు పెంచడంపై రైతులు, రైతుసంఘాల నాయకులు విమర్శిస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
సౌరవిద్యుత్ కి పునాదులవుతున్ననీటి కాల్వలు
నీటి కోసం ఉపయోగపడే కాల్వలు కొత్తగా కరెంటు ఉత్పత్తికి ఉపయోగపడేలా వినూత్న ప్రయోగం చేసింది గుజరాత్ ప్రభుత్వం. గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా 532 కిమీ పొడవైన నర్మదా కాలువల నెట్‌వర్క్‌ను సోలార్ పవర్ ప్రాజెక్ట్ గా మార్చబోతున్నారు. ఈ విధానంతో నీటి ఆవిరిని నిరోధిస్తుంది, భూమి వినియోగాన్ని తగ్గిస్తుంది. అలాగే సౌర ఫలకాలు చల్లబడుతుంటాయని గ్రిడ్ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ దేశ వ్యాప్తంగా అమలు జరిగేలా చేస్తే ఇక సోలార్ కరెంటుకు భూములు వేలాదిగా దొరికినట్టే అని అందరు భావిస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
भारत में बेमौसम बारिश और ओलावृष्टि से फसलों को नुकसान पहुंचता है
पिछले दो सप्ताह से पश्चिमी विक्षोभ के कारण पंजाब, हरियाणा, उत्तर प्रदेश और मध्यप्रदेश में तूफान, ओलावृष्टि और तेज हवा के साथ बे मौसम बारिश हुई है। बे मौसम बारिश अभी कुछ और दिनों तक जारी रहने की उम्मीद है। बारिश ऐसे समय आती है जब सर्दियों की फसल कटाई के लिए लगभग तैयार हो जाती है। खराब मौसम के कारण तीन राज्यों में फसलों को भारी नुकसान हुआ है, जिससे किसानों के लिए भारी उपज नुकसान और कटाई की चुनौतियों का डर पैदा हो गया है। मध्य प्रदेश, राजस्थान और उत्तर प्रदेश में अनुमानित 5.23 लाख हेक्टेयर गेहूं की फसल बर्बाद हो गई, और मुनाफा घटा है, जिसके कारण राज्य के कई हिस्सों में बड़े पैमाने पर विरोध प्रदर्शन हुए । गेहूं के अलावा सरसों, चना, जौ और अन्य सब्जियों की फसल प्रभावित हुई है। कुछ राज्य सरकारों ने किसानों को राहत देने के लिए कदम उठाए हैं।
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఒక్కసారిగా పెరిగిన వేరుశనగ ధర క్వింటా రూ. 7,370
తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ పంటకు తెగుళ్ళు మరియు కీటకాలు ఆశించి తీవ్ర నష్టం ఏర్పడింది దీనితో రైతులకు లాభాలు తగ్గిపోయాయి. అయితే వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో వారం రోజులుగా పెరగని వేరుశనగ ధరలు ఒక్క రోజు వ్యవధిలో క్వింటాపై రూ. 240 పెరిగింది దీనితో క్వింటా గరిష్ఠ ధర రూ.7,370 కు చేరింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
10 రూపాయలకే భూసార పరిక్ష
7 సంవత్సరాలు పూర్తై 8 సంవత్సరంలో అడుగుపెట్టిన భూసార పరిక్ష ఫథకం. సాయిల్ హెల్త్ కార్డ్ పథకం 2015 ఫిబ్రవరి 19న రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. గత 7 ఏళ్ల వ్యవధిలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ 23 కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 వేల 531 కొత్త భూసార పరీక్ష ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. మట్టి పరిక్షల వల్ల రైతులు తమ పొలాల్లోని మట్టిలో ఉన్న పోషకాలోపాలు, పిహెచ్ స్థాయి, సేంద్రియకర్బనం వంటి వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో అనవసరపు ఎరువుల ఖర్చులు తగ్గటంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. ఇప్పటకైనా అందరూ రైతులు మట్టి సామార్దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని, కేవలం 10 రూపాయలకే పరిక్ష చేసి భూసార కార్డులను సైతం అందిస్తున్నామని సాయిల్ హెల్త్ ల్యాబ్ అధికారులు చెబుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట
మార్కెట్ లోకి వచ్చే నకిలీ విత్తనాలను కనిపెట్టడం రైతులకు చాలా క్లిష్టమైన పని. ఇటీవలి కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో నకిలీ విత్తనాలను గుర్తించేందుకు సీడ్ ట్రేసబిలిటీ బార్‌కోడ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బార్‌కోడ్‌ను రైతులు స్కాన్ చేసి అసలువో లేదా నకిలీవో గుర్తించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను వచ్చే వానాకాలం నుండి ఈ ప్రక్రియ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. విత్తనం ఎక్కడ ఉత్పత్తి అయ్యింది, ఎక్కడ ప్యాకింగ్ జరిగింది, మార్కెట్ లోకి ఎవరు విక్రయించారు, విత్తన నాణ్యత, జన్యు స్వచ్ఛత ఇలా దాని పుట్టు పూర్వోత్తరాలు అన్నీ ఒక్క బార్ కోడును స్కాన్ చేసి రైతులు తెలుసుకోవచ్చు.









