20 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పెరుగుతున్న యాసంగీ పత్తి సాగు

ఖరీఫ్ సీజన్ అనగా జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో పత్తి విత్తనాలు నాటడం అనావాయితి. అయితే ఇటివల నల్గొండ, ఖమ్మం జిల్లాకు చెందిన కొందరు రైతులు యాసంగీ పత్తి సాగు చేస్తున్నారు. ముందుగా పత్తి విత్తనాలు నాటడం కొద్దిగా కష్టమైనప్పటికి కలుపు సమస్య, తెగుళ్ల సమస్య తక్కువ ఉంటుందని రైతులు బావిస్తున్నారు. ఎకరాకు ఎక్కువ మోతాదులో విత్తనాలు నాటి ప్రతి చెట్టుకు 40 పైచీలుకు కాయలు కాసేలా ఉన్నాయని చెబుతున్నారు. ఇలా ప్రయోగత్మకంగా చేస్తున్న సాగు ఫలితాలనిస్తే రానున్న రోజుల్లో యాసంగీ పత్తి జోరందుకుంటుంది.

19 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తగ్గుతున్న పాల ఉత్పత్తి

పెరుగుతున్న పాడి ఖర్చులు, 40 డిగ్రీలు దాటుతున్న ఉష్టోగ్రతలు, విజృంభిస్తున్న వింత వ్యాధులతో పాలు ఉత్పత్తి తగ్గుతుంది. గతేడాది 221 మిలియన్ టన్నుల పాల ఉత్పత్తితో ప్రపంచంలో మొదటి స్ఖానంలో ఉన్నప్పటికి ఈ ఏడాది మొదటి ఉత్పత్తి భారీగా పడిపోయింది. మేత ఖర్చులు భారీగా పెరగడం, లాంఫీ వంటి చర్మ వ్యాధి సోకి దేశంలో చాల వరకు పశువులు మరణించాయి ఇదికూడా పాల ఉత్పత్తి తగ్గడానికి ఒక కారణంగా చెబుతున్నారు. అయినప్పటికి విదేశాల నుండి పాల దిగుమతి చేసుకోబోమని దేశంలోనే పాలకు సంబందించిన ఉపఉత్పత్తులను ఉత్పత్తి చేస్తామని కేంద్ర జంతు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల తెలిపారు .

18 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మిరప విత్తన ధరలు పైపైకి

ఈ ఏడాది మిరప కాపు, మార్కెట్ ధరలతో రానున్న వర్షాకాలంలో సాగు విస్తీర్ణం పెరగనుందని అంచనా. దీంతో సీజన్ ఆరంభానికి ముందే మిరప విత్తనాలకు డిమాండ్ పెరుగుతుంది. నాణ్యమైన, మంచి విత్తన రకాలకు కిలో లక్ష ఇరవై వేల నుండి లక్షయాబై వేల వరకు పలుకుతుంది. వచ్చే నేలలో ఆరంభంలో మిరప విత్తన అమ్మకాలు జోరుకానున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్‌ పేరుతో విత్తన ధరల్ని రెట్టింపు చేశారు. ఇదే అదునుగా మోసాలకు తాపులేకుండా, నాసీ రకం విత్తనాలతో నష్టపోకుండా విత్తన ఎంపిక నుండే తగు జాగ్రత్తలు తీసుకొవాలి. విత్తన రకం, లెబుల్, లాట్ నెంబర్, జర్మినేషన్ శాతాలను తనికి చేసుకోని ఎంచుకొవాలి. నారు పోసుకునే ముందే రైతు స్థాయిలో విత్తన మొలక శాతాన్ని పరిక్షించుకుంటే మంచింది.

17 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

7200 కేంద్రాల్లో వడ్లసేకరణ

ఈ యాసంగి వడ్ల సేకరణకై రాష్ట్రవ్యాప్తంగా 7200 కేంద్రాలను ప్రారభించారు. వరి సాగుచేసినా రైతులు దళారులకు విక్రయించి మోసపోవద్దు. వరికి మద్దతు ధరల వివరాలు గ్రేడ్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌కు రూ.2,060, సాధారణ రకానికి రూ.2,040 రూపాయలు చెల్లించనున్నారు. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, టార్పలిన్ కవర్లను అందుబాటులో ఉంచుకొవాలి. పెరిగన ఉష్టోగ్రతల దృష్యా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తగు జాగ్రత్తలు తీసుకొవాలి.


15 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కృషిదర్శన్ ఎక్స్ పో 2023

రైతులకు సాంకేతికతను ఎప్పటికప్పుడు అందించేందుకు అనంతపురంలోని ట్రాక్టర్ నగర్, గార్లదిన్నె లో ఉన్న దక్షిణ క్షేత్ర వ్యవసాయ యంత్రముల శిక్షణ మరియు పరీక్షణ సంస్థ నందు "కృషి దర్శన్ ఎక్స్ పో 2023" పేరుతో మే 6 వతేదిన ఒకరోజు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ క్రార్యక్రమంలో యంత్రాల తయారీ దారులు, ఇంజనీర్లు, రైతులు పాల్గొన్నున్నారు. ఈ కార్యక్రమానికి రైతులు పెద్దఎత్తన పాల్గోని తమకు క్షేత్రస్థాయిల కావాల్సిన యంత్రాలు, పనిముట్లను ఎంచుకొని సాగును బాగుచేసుకొవాలనేదే మా భావన.

15 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కార్బైడ్ తో మగ్గించిన పండ్లతో క్యాన్సర్

ఎండాకాలం వచ్చిదంటే చాలు అందరికి గుర్తొచ్చేది మామిడి పండ్లు. ఈ మామిడిలను సహజసిద్దంగా పండించినవి తింటే రుచితో పాటు ఆరోగ్యంగా ఉంటారు. కార్బన్ తో పండించడం నిషేదమాని అందరికి తెలిసిందే. సహజసిద్దంగా పండించే పండ్ల రంగు, రుచి, వాసన బాగుంటుంది. వివిధ మార్కెట్లలోగాని, విక్రయకేంద్రాల్లో గాని కార్బైట్స్ ని గుర్తించినట్లయితే వెంటనే వ్యవసాయ అధికారులకు గానీ మార్కెటింగ్ శాఖకు తెలపండి.

15 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలుగు గడ్డ పై జీ 20 వ్యవసాయ సమ్మిట్

హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జూన్‌‌ 15 నుంచి 17 వరకు జీ20 అగ్రికల్చర్‌‌ సమ్మిట్ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలకు చెందిన అగ్రికల్చర్‌‌ మినిస్టర్లు, ఇక్రిశాట్, ఓఈసీడీ, ఏడీబీతో పాటు ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్‌‌ అండ్‌‌ అగ్రికల్చర్‌‌ సంస్థలు, వరల్డ్‌‌బ్యాంక్‌‌ సంస్థల ప్రతినిధులు కానున్నారు. వ్యవసాయానికి సంభదించి ఇది నాల్గోవ సదస్సు. వ్యవసాయంలో మారుతున్న మార్పులు, రానున్న రోజుల్లో ప్రజల అవసరాలు తీర్చేలా సాగుబాగు వంటీ కార్యక్రమాలపై చర్చలు జరగనున్నాయి.


13 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మిరప క్వింటాలుకు రూ.20 వేలు

ఈ ఏడాది ఆహార పంటలతో పొల్చితే వాణిజ్య పంటలు సాగుచేసే రైతులకు మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. పత్తి మార్కెట్ ఆరంభంలో 10 వేల వరకు పలుకగా, ఇప్పుడు మిరప పంటకు 20నుంచి 22 వేల వరకు క్వింటాకు పలుకుతుంది. మహారాష్ట్రలోని నాగపూర్ లో అత్యధికంగా పలుకుతుండటంతో వ్యయప్రయాసాలకు ఓర్చి పక్కనే ఉన్న ఖమ్మం, ఆదిలాబాద్ రైతులు అక్కడికి మిరప పంటను తీసుకేళ్తున్నారు. మన దగ్గరి వ్యవసాయ మార్కెట్లలోనూ ఇదే ధరలు పలికితే తమకి రవాణా ఛార్జీలు ఆదా అవుతాయని రైతుల భావిస్తున్నారు.

13 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

NABARD Student Internship Scheme (SIS) 2023-24

NABARD invites applications for Student Internship Scheme 2023-24 from students pursuing their post- graduate degree/PGDM (having completed 1" year) or 5 years integrated courses (having completed 4 year) from institute/university. 1. Applications are invited only online through NABARD website. 2. Opening date for registration and submission applications - April 07, 2023 3. Closing date for submission of applications - April 23, 2023 4. For more details, visit website (https://www.nabard.org/whats-new.aspx).

12 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

40 శాతం మేర పెరిగిన వ్యవసాయ ఎగుమతులు

రోజురోజుకు సాగురంగం కొత్తపుంతలు తోక్కుతున్న వేళ, నాణ్యమైన దిగుబడులతో ఎగుమతులు ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 5 సంవత్సరాల్లో (2017-2022 ) ఎగుమతులు పెరిగాయని, ఇందులో తెలంగాణ మరియు మహారాష్ట్ర ముందజలో ఉన్నాయని వెల్లడించింది. వ్యవసాయ ఎగుమతులు 2020-21లో రూ. 6,337 కోట్లుగా ఉండగా, అవి 2021-22లోదాదాపు రూ. 10,000 కోట్లకు పెరిగాయి. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు , తృణధాన్యాలు, పత్తి, మామిడి, ద్రాక్ష, నిమ్మ, బియ్యం, సొయాబిన్, మొక్కజొన్న వంటి పంటలతో పాటు కొద్ది మొత్తంలో మాంసాన్ని కూడా ఎగుమతులు చేస్తున్నారు. సాగుకు రాయితీలు,సబ్సిడీలు, అధునాతన సాంకేతిక విధానాలు రైతుల ధరి చేరితే రానున్న 5 ఏండ్లలో మరో 35 నుంచి 40 శాతానికి ఎగుమతులు పెరగవచ్చు.