02 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

RBK ల ద్వారా ఒక్క రూపాయి కే ఫ్రూట్ కవర్

పంట దిగుబడిని నాశనం చేసే పండు ఈగలు ఆశించకుండా మామిడి ఇతర పండ్ల తోటలలో రక్షణకు ఫ్రూట్‌ కవర్లను స్వల్ప ధరలకే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. బయట ఒక కవర్‌ ధర రూ.3 ఉండగా సబ్సిడీ ద్వారా రైతు భరోసా కేంద్రాల్లో ఒక్క రూపాయికే రైతులకు అందచేస్తున్నారు..

28 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఆకాల వర్షాలు - రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు!

రాబోయే 5 రోజుల వరకు తెలంగాణాలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో మరియు వడగళ్ళతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారి చేసింది. 1. రైతులు చెట్లకింద విద్యుత్ స్థంభాల, తీగలు మరియు చెరువుల వద్ద ఉండకుండా మరియు పశువులను సురక్షిత ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. 2. పోలాల నుండి అధిక వాన నీటిని బయటకు పోవడానికి మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. 3. కోసిన పంటను తొందరగా సురక్షిత ప్రదేశానికి తరలించాలి. మార్కెట్ కి తరలించిన ధాన్యాన్ని తడవకుండా టార్పాలిన్ తో కప్పి ఉంచాలి. 4. పంట కోతకు సిద్దంగా ఉన్నటువంటి రైతులు రాబోవు మూడు రోజుల వరకు కోతలను మరియు పంటలలో రసాయన మందులు పిచికారీ చేసుకోకుండా వాయిదా వేసుకోవాలి.

27 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతు కోసం - నాపంట రైతు కమ్యూనిటి సేవలు

ప్రియమైన రైతు సోదరులకు నమస్కారం..! 👉🏻 గత కొన్ని సంవత్సరాలుగా మీరు *నాపంట స్మార్ట్ అగ్రి యాప్* సేవలను ఉపయోగిస్తూనందుకు ధన్యవాదాలు., 👉🏻 *నాపంట స్మార్ట్ అగ్రి యాప్* ద్వారా రైతులు రోజువారీ వ్యవసాయంలో బాగంగా, సరైన సమయంలో నమ్మకమైన సలహాలు & సూచనలు పొందుతూ, పంట సంరక్షణతో పాటు పంట ఖర్చూ తగ్గించుకుంటూ లాభాలు పొందుతున్నారు. 👉 *నాపంట స్మార్ట్ అగ్రి యాప్* పంటకు సంభందించిన సలహలు , మార్కెట్ ధరలు, పెస్టిసైడ్ వివరాలు,డీలర్స్ సమాచరమే కాకుండా *తోటి రైతులకు దగ్గర అవ్వడం కోసం అగ్రి ఫోరమ్ , రైతు కమ్యూనిటీ, న్యూస్ & ఈవెంట్స్ ద్వారా మారుతున్న కాలనికి అనుగుణంగా మీకు తోడ్బాటు అందిస్తుంది.* 👉 మీకు మరింత దగ్గర అవ్వడానికి మా ప్రతినిధులు కేవలం మొబైల్ యాప్ కాకుండా whatsapp ద్వారా కూడా పంటకు సంబంధించిన సూచనలు ఇవ్వడానికి అందుబాటులో ఉంటారు. *👉🏻నాపంట యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి : bit.ly/NaPanta* *https://chat.whatsapp.com/G0nRDl4oGqnE698Lf4ndky*

27 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

30న ఆర్గానిక్ మేళా

30న భారత సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో ఈ నెల 30(ఆదివారం) ఉ. 9.30-సా. 7.30 వరకు ఖమ్మంలోని కొత్త బస్టాండ్ పక్కన ఆర్గానిక్ మేళా జరగనుంది సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులను విక్రయిస్తారు. చిరుధాన్యాల కూరగాయలు, పండ్ల తోటలు, మిద్దెతోటల సాగుపై సదస్సు నిర్వహిస్తారు. సదస్సులో పాల్గొనదలచిన వారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. గోకృపామృతం మరియు విత్తనాల ఉచిత పంపిణీ ఉంటుంది. అందరూ ఆహ్వానితులే.


26 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పాత పంటల జాతర

విశాఖ జిల్లా అరకు ప్రాంతంలోని డుంబ్రిగుడ మండలం కిల్లోగూడలో సంజీవని సంస్థ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ సహకారంతో ఈ నెల 28- 29 తేదిల్లో జరగనుంది.ప్రకృతి వ్యవసాయనికి పట్టుకొమ్మ అయిన పాత పంటల విత్తనాల వైవిధ్యాన్ని ప్రతి ఏటా వినియోగిస్తూ పరిరక్షించుకొవటమే ఈ 15 వ పాత పంటల జాతర ముఖ్య ఉద్దేశ్యమని సంజీవని వ్యవస్థాపకులు దివుళ్లు పచారి గారు తెలిపారు. రైతులు అనాదిగా సాగు చేస్తున్న చిరుధాన్యలు, పప్పు ధాన్యలు , నూనె గింజలు, కూరగాయలతో పాటు దేశీ వరి రకాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున్న పాల్గొని, సేంద్రియ సాగుకు ఎక్కువ మంది రైతులు మళ్లేలా ప్రోత్సహించాలి.

25 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఆర్బీకేల ద్వారా పచ్చిరోట్ట విత్తన పంపిణి

రైతులకు ఖరీఫ్ సాగు సాఫీగా సాగాలన్నా.. అధిక దిగుబడులు సాధించాలన్నా, మరియు చీడ పీడల నుంచి రక్షణ పొందాలంటే పచ్చిరొట్ట సాగు అత్యంత కీలకం. పంట విత్తే ముందు వీటిని పొలాల్లో చల్లి సీజన్ సమీపించి వర్షాలు కురవగానే కలియదున్నడం ద్వారా భూములు సారవంతమవుతాయి. ఈ విదంగా రైతులను ప్రోత్సహించేందుకు జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి విత్తనాలను మరియు ప్రకృతి వ్యవసాయ విధానంలో 30 రకాల విత్తనాలతో పచ్చిరొట్ట విత్తనాల కిట్ను రూపొందించి ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులోకి తెచ్చింది. రైతులు సద్వినియోగం చేసుకోగలరు.

24 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నిమ్మకు ఫుల్ డిమాండ్

వేసవి తాపంతో నిమ్మకు డిమాండ్ భాగా పెరిగింది. ఈ ఏడాది అకాల వర్షాల కారణంగా నిమ్మ చెట్లకు ఉన్న పూత రాలిపోయి, దిగుబడులు తగ్గిపోయాయి. మార్కెట్‌లో ఒక్కో నిమ్మకాయను వ్యాపారులు 8 నుండి 10 రుపాయల వరకు అమ్ముతున్నారు. ఒక కిలో నిమ్మ 200 రూపాయలకు వరకు పలుకుతొంది. మరో రెండు నెలలు వరకు మార్కెట్ లో నిమ్మకు డిమాండ్ ఇలానే కొనసాగే అవకాశం ఉంది.


24 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఆంధ్రప్రదేశ్ ఆర్బీకేల్లో చేపపిల్లలు

రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, సబ్సిడీ యంత్రాలు, బీమా, మార్కెటింగ్ వసతులు వంటి సేవలు అందిస్తుంది. వీటితో పాటు ఈ ఏడాది నుండి చేపల సీడ్ సరఫరా చేయడానికి సర్కారు ప్రణాళికలు చేసింది. దీనికోసం అని రాష్ట్రంలోని ఆర్బీకేలకు 54 ప్రభుత్వ ఫిష్ సీడ్ ఫామ్స్ ని ఈ - మత్స్యకార యాప్ ద్వారా అనుసంధానం చేసింది. రైతులు ఆర్బీకేల్లో బుకింగ్ చేసి రాష్ట్రంలో లైసెన్స్ పొందిన రిజర్వాయర్లకు జిల్లాల వారీగా ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1817 లైసెన్స్డ్ రిజర్వాయర్లు ఉన్నాయని, వీటికి 10.10 కోట్ల సీడ్ అవసరమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఏడాది మరింత మత్స సంపద పెరగనుందని రైతులు అనందం వ్యక్తంచేస్తున్నారు.

21 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మక్కకు దిక్కేది

యాసంగి మక్క పంట చేతికొచ్చింది. ట్రక్కుల్లో ఎత్తుకొని మార్కెట్లోకి వెళ్లారు. కానీ కొనేవారు కానరాక ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. మద్ధతు ధర లేక అందినకాడికి దళారులు ఇచ్చి తీసుకెళ్తున్నారని నిర్మల్ రైతులు వాపోతున్నారు. క్వింటా 1700 కి మించి చెల్లించడంలేదని, మార్చి చివర్లో 2200 వరకు పలికిందని రైతులు తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వం దృష్టీసారించి మద్ధతుధర చెల్లించి కొనుగోలు జరిగేటట్లు చూడాలని రైతులు కోరుకుంటున్నారు.

20 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మార్కెట్లోకి వస్తోంది నానో డీఏపీ

2021 సంవత్సరంలో నానో యూరియా ప్రపంచంలోనే మొదటి సారిగా రైతులకు అందించినా ఇఫ్కో కంపనీ ఈ ఏడాది నానో డీఏపీ ని కూడా అందించేందుకు సర్వం సిద్దం చేస్తుంది. నానో డీఏపీ ఆర లీటరుకు 600 రూపాయలని ప్రకటించింది. ఒక ఆర లీటరు బాటిల్ ఒక బస్తా ఎరువుతో సమానమని, అలాగే మొక్క ఆకులపై పడినప్పుడు కిరణజన్య సంయోగ క్రియ రేటుని పెంచి పంట దిగుబడులు పెరిగేలా చేస్తుందని ఇఫ్కో శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఈ డీఏపీలో నత్రజని 8 శాతం, భాస్వరం 16 శాతంగా ఉన్నాయంటున్నారు. రానున్న రోజుల్లో నానోజింకు, నానో కాపర్ వంటి ఎరువులను కూడా మార్కెట్లోకి తీసుకొస్తామంటున్నారు.