09 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పంట నష్టానికి ప్రకృతి వ్యవసాయమే పరిష్కారమా....

మన దేశంలో ఇటివల కాలంలో కత్తెర పురుగు, నల్ల తామర, రుగోస్ తెల్లదోమ వంటి పురుగులు ఆశించి ఎక్కువ మొత్తంలో పంట నష్టానికి కారణం అవుతున్నాయి. అయితే రసాయన వ్యవసాయం వలన పురుగులు వలన 50 % పంట నష్టపోతె ప్రకృతి వ్యవసాయంలో 10 % మాత్రమే అవుతుంది, వ్యవసాయ సాగు మార్చుకుంటే వీటి తీవ్రత తగ్గే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరిస్తున్న రైతు సాధికార సంస్థలు తెలియజేసారు. 30 రకాల పచ్చిరోట్ట పంటలను సాగు చేసిన తరువాత వాణిజ్య లేదా ఆహార పంటలను సాగు చేయడం వలన వాతావరణానికి నష్టం కలగకుండా, చీడపీడలను తట్టుకొని అధిక దిగుబడులతో పాటు ప్రకృతి వ్యవసాయం చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని లాభం పొందుతున్న రైతులు చెపుతున్నారు.

08 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నత్త నడకన ధాన్యం కొనుగోలు

రోజు కురుస్తున్న వర్షాలతో నత్తనడకన సాగుతున్న ధాన్యం కొనుగోలు

08 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కిలో జీడిపప్పు రూ.15-40 మధ్యే.

కేవలం 15 నుంచి 40 రూపాయల్లో మంచి క్వాలిటి పప్పు దొరుకుతుందంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మేలా లేనప్పటికి ఝార్ఖండ్లో జాన్తడా జిల్లా నాలా గ్రామ రైతులు మాత్రం అమ్ముతున్నారు. ఇక్కడినేలలు వేరే పంటలకు అనుకూలంగా లేవని పరిశోధకులు చెప్పటంతో అందరు రైతులు జీడితోటల పెంపకం చేపట్టారు. పంటంతా ఒకే సారి రావటంతో లోకల్ డిమాండ్ తగ్గి, ఉత్పత్తి పెరగటంతో ధరలు అమాంతం పడిపోయాయి.

08 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

హెచ్‌టీ పత్తి అనుమతులకు అవకాశాలు

సాగులో ఖర్చు తగ్గిస్తూ, రాబడి పెంచి ఆదాయం రేట్టింపు చేసే దిశలో శాస్రవేత్తలు, ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే జన్యుమార్పిడి విత్తనాలతో మానవజాతీకి ప్రమాదమని, అలాగే నేల, నీరు, వాతవరణం కలుషితం అవుతాయని మన ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నప్పటికి ఇప్పటికే పలు పంటలు అందుబాటులోకి వచ్చాయి. ఇదిలా ఉండగా వాణిజ్య పంటగా సాగుచేసే పత్తిలో హెర్బిసైడ్‌ టాలరెన్స్‌-హెచ్‌టీ బ్రీడ్ అందుబాటులోకి వచ్చింది. కలుపు మందు పిచికారీ చేసినప్పుడు పత్తి మొక్కకు ఎలాంటి నష్టం వాటల్లకుండా ఉండటమే దీని ప్రత్యేకత. ఈ విత్తనాలతో కలుపు పెట్టుబడులు, ఎరువుల ఖర్చు తగ్గుతుడటంతో రైతులు ఆసక్తీగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విత్తనాలకై జెనిటిక్‌ ఇంజనీరింగ్‌ అప్రైజల్‌ కమిటీ పరిశీలిస్తోంది. మహికో,ర్యాలీస్‌, బయోసీడ్‌ కంపనీలు ఈ విత్తనాలను అభివృద్ది చేశాయి. రానున్న రోజుల్లో ఈ విత్తనాలకు అనుమతులు లభిస్తే పెట్టుబడుల ఖర్చు కాస్తోకూస్తో తగ్గినట్టే.


06 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🌾యాసంగి వానతో నష్టం 8700 కోట్లు🌧

తెలంగాణ యాసంగిలో కురుస్తున్న అకాల వానల వలన వరి, మామిడి,మొక్కజొన్న వంటి ప్రధాన పంటలతోపాటు నిమ్మ, బొప్పాయి, మునగ వంటి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఈ ఏడాది యాసంగి సాగు విస్తీర్ణం 72.63 లక్షల ఎకరాలుగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాదే పెద్ద ఎత్తున సాగు జరిగిందని, ఇదే స్థాయిలో నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. మామిడిలో దాదాపు 70 శాతం పంట నష్టపోయిందని దీని విలువ దాదాపు 8700 కోట్లుగా ఉంటుందన్నారు. వరి 12లక్షల ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పెట్టుబడులన్నీ నష్టపోయాయని రైతులు వాపోతూ, సర్కారు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

05 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

అకాల వర్షాన్ని తట్టుకున్న దొడ్డు రకం వరి వంగడం జేజిఎల్ - 24423

జేజిఎల్ - 24423 వరి రకాన్ని జగిత్యాల రైస్ -1 అని కుడా అంటారు. జగిత్యాల పోసాలా శాస్రవేత్తలు దీనిని 2019 లో విడుదల చేస్తే 2022- 23 వానాకాలం మరియు యాసంగిలో లక్షల ఎకరాలలో సాగు చేసి అకాల వర్షాలకు, వడగళ్ళ వాన మరియు ఈదురు గాలులకు పడిపోకుండా 90 శాతం వరకు తట్టుకునే నిలిచిందని శాస్రవేత్తలు తెలిపారు. ఇది రెండు సిజన్లకు అనుకూలమైన స్వల్పరకం అంతేకాక తక్కువ ఎత్తుతో దృడంగా ఉండి వర్షాలను, చలిని, దోమను కొంతవరకు తట్టుకుని అధిక దిగుబడి కూడా ఎక్కువే. జేజిఎల్ - 24423 కాక మరికొన్ని రకాల వంగడాలు త్వరలో రానున్నాయని శాస్రవేత్తలు వెల్లడించారు.

04 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలుగు రాష్ట్రాలకు మోచా తుఫాన్ ముప్పు !!

తెలుగు రాష్టాలకు వాతావరణ శాఖ మళ్లీ రెయిన్ అలెర్ట్ ప్రకటించింది. ఉపరతల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. తీర ప్రాంతంలో మోచా తుఫాన్ కలకలం రేపుతోంది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారి ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఈ నెల 9వ తేదీ వరకు మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.


03 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🌾తడిసిన ధాన్యానికి అదే ధర

భారీ వర్షాలకు ఆగమవుతోన్న తెలంగాణ అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం మనసు కుదుటపడే వార్త చెప్పింది. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు తడిసిన ధాన్యం గురించి తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకే కొంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతులెవ్వరూ అధైర్యపడొద్దని.. పండిన ప్రతీ గింజా కొంటామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది.

03 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మామిడి పండ్లను తింటున్నారా ?

మామిడి పండును కేవలం కడిగి తింటే సరిపోదు మామిడిలో ఫైటిక్ యాసిడ్‌ అనే కెమికల్ ఉంటుంది. ఫైటిక్ యాసిడ్ అనేది యాంటీ న్యూట్రియంట్ అంటే ఇది ఇనుము, జింక్, కాల్షియం మరియు మినరల్స్ లోపాలను కలిగించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఇతర మినరల్స్ ను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. కావున 10-30 నిమిషాలు నీటిలో నానబెట్టి తినడం ఆరోగ్యానికి మంచిది.

02 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తడిసినా ధాన్యంపై ఉప్పు నీళ్ల పిచికారీ

తడిసినా ధాన్యంపై ఉప్పు నీళ్ల పిచికారీ. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో పంట నష్టం అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు ఐదు లక్షల ఎకరాల్లో వరి, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. తేమ శాతం ఎక్కువుందంటూ సర్కారు కొనకపోవడంతో ఆయా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన వేల క్వింటాళ్ల వడ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి. అయితే తడిసిన ధాన్యం పాడవకుండా ఉప్పు కలిపిన నీళ్లను పిచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల ధాన్యం రంగు మారకుండా, మొలక రాకుండా ఉంటుంది. ఇంకా కోతలు కానీ రైతులు మరో కొన్ని రోజులు వాయిదా వేయడమే మేలు.