19 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వేసవిలో వాటర్ ఆపిల్ వారెవ,.

యాపిల్ అనగానే అందరికి గుర్తోచ్చే కాశ్మీర్, సిమ్లా పండ్లే. కానీ వాటర్ యాపిల్ అంటూ ఇటీవల మార్కెట్లో వినిపిస్తుంది. ఈ వాటర్ యాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఎరుపు, తెలుపు రంగులో బిన్నమైన రూపంతో ఉండే ఈ పండు వేసవిలోనే దిగుబడి వస్తుంది. ఈ పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ ఎ లాంటి చాలా రకాల పోషకాలు మెండుగా ఉన్నాయి. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. వాటర్ ఆపిల్ తినడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటుగా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.

18 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఎరువుల ధరలు యాథాతథం

ఈ ఏడాది ఎరువుల ధరలు పెంచేది లేదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పాత ధరల ప్రకారం కేంద్ర కేబినెట్ రూ. 1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీకి ఆమోదం తెలిపింది. ఇందులో యూరియాకు 70 వేల కోట్లు, డీఏపీకి 38 వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. సకాలంలో ఎరువులు అందించడమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు వాటి భారం రైతులపై పడకుండా ఈ నిర్ణయం తీసు కున్నట్లు కేంద్ర మంత్రి మనస్సుఖ్ మాండవియా తెలిపారు.

17 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

డ్రైవర్ లెస్ ట్రాక్టర్ సూపర్

డైవర్ లేని కార్లను ఇప్పుడిప్పుడే వింటున్న తరుణంలో ఇదే తరహా ట్రాక్టర్ నీ ఆవిష్కరించారు వరంగల్ జిల్లా కిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రోఫెసర్లు. పి. నిరంజన్ రెడ్డి, మహ్మద్ వసీం ఇద్దరు ప్రొఫెసర్లు రైతులు ఉపయోగించే ట్రాక్టర్ నీ డ్రైవర్ లేకుండా పొలం గట్టుపైన కూర్చొని రిమోట్ ఆధారంగా అన్ని రకాల పనులు చేసుకునేలా రూపోందించారు. దిని ధర 20 వేల వరకు ఉంటుందని, దీనికోసం ప్రత్యేక శిక్షణ అవసరం లేదని ఎవరైనా వినియోగించవచ్చని తెలిపారు. స్మాట్ ఆగ్రికల్చర్ ట్రాక్టర్ గా దినికి నామాకరణం చేశామని,ఈ టెక్నాలజిపైనా పేటేంట్ కూడా తీసుకుంటామని, అనతంరం ఐవోటీ కిట్ రూపంలో మార్కెట్లోకి విడుదలవుతుందన్నారు.

17 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఈ రకం వరి సాగు చేయవద్దని ఆదేశాలు

మహబూబాబాద్ జిల్లా 2023 – 24 ఖరీఫ్ పంట కాలంలో వరి రకం 1001 రైతులు సాగు చేయవద్దని జిల్లా కలెక్టర్ కె .శశాంక్ జిల్లా వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. దీనికి కారణం - 1001 వరి దొడ్డు రకం వలన రా రైస్ క్వింటాకు 70 శాతం రావడం లేదని జిల్లాలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంఘం వాపోతున్నారు. అలాగే. దీని వలన తాము తీవ్రంగా నష్ట పోతున్నట్లు రైస్ మిల్లర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమీక్షించిన కలెక్టర్ వరి రకం 1001 ను సాగు చేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.


12 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నీటి సంరక్షణ కోసం 49 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం : NMCG

జీవనదుల పరిరక్షణ, రానున్న తరాలకు స్వచ్చమైన నీటిని అందించడం అందరి భాద్యత. దీనికోసం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అనే సంస్ధ నీటి సంరక్షణ మరియు నదుల పరునుజ్జీవనం పట్ల యువతకు అవగహాన కల్పించేలా 49 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమంలో గజేంద్ర సింగ్ షెకావత్ జలశక్తీ మంత్రి పాల్గొన్నారు. రానున్న రోజుల్లో శుభ్రమైన నీటిని జీవనదుల్లో చూసే భాగ్యం కల్గలని ఆశీద్దాం.

12 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

హార్టికల్చర్‌ డిప్లొమాలో చేరుటకు అడ్మిషన్స్ ప్రారంభం.

రెండు సంవత్సరాల హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సు చేయడానికి ఆసక్తి గల అభ్యర్థులు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, ములుగు పరిధిలోని అనుబంధిత పాలిటెక్నిక్ ఈ సంవత్సరం నుండి డాక్టర్ ఘంటా గోపాల్ రెడ్డి ఉద్యాన హార్టికల్చర్‌ పాలిటెక్నిక్ కళాశాలను గడ్డిపల్లి గ్రామం, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లాలో ఏర్పాటు చేయటం జరిగింది. హార్టికల్చర్‌ డిప్లొమా లో చేరుటకు పాలీ సెట్ 2023 పరీక్ష రాసి ఉండి మరియు 10 వ తరగతి పాస్ అయినా 22 సంవత్సరాల వయస్సు లోపు విద్యార్థులు అర్హులు. కావాలసి సర్టిఫికెట్స్ 1. 10 వ తరగతి మార్క్స్ మెమో, 2. కుల ధ్రువీకరణ పత్రము, 3.ఆదాయ పత్రము, 4.ఆధార్ కార్డ్. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది ఫోన్ నంబర్స్ సంప్రదించగలరని మనవి. డా. ఘంటా గోపాల రెడ్డి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాల, గడ్డిపల్లి 9603268682, 994864441, 9849063796.

11 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

భూసార పరిరక్షణ ప్రభుత్వ ధ్యేయం

సాగురంగం మెరుగుపడేందుకు , భూమిలో సారం పెంచేందుకు, ఎరువుల ఖర్చులు తగ్గేందుకు ఉపయోగపడేలా తెలంగాణ సర్కారు 65 శాతం సబ్సిడీపై పచ్చిరొట్ట పైర్ల విత్తనాలను అందిస్తుంది. దాదాపు 76 కోట్ల రూపాయల విలువ చేసే లక్షణాలపై వేల క్వింటాళ్ల విత్తనాలను రైతు సేవా కేంద్రాల ద్వారా అందుబాటులో ఉంచనుంది. జనుము, జీలుగ, పిల్లి పెసర వంటి విత్తనాలతో ప్రధాన పంటలు ఏపుగా పెరిగి, నత్రజని భాస్వరం, గంధకం వంటి ఎరువులు వాడకం తగ్గుతుంది. ప్రధాన పంటకు ముందు పచ్చిరొట్ట పైర్లను చల్లుకొని భూమిలో కలియదున్ని, సాగుఖర్చులు తగ్గించుకునేలా ప్రతీరైతు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాము.


11 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నాకు ఐదేండ్లు నిండాయి@ రైతుబంధు

నాపేరు రైతుబంధు. నేను మే 10 2018 గురవారం రోజున సీఎం చేతుల మీదుగా కరీంనగర్ జిల్లా శాలపల్లిలో నాకు పురుడు పోశారు. నేనంటే రాష్ట్రవ్యాప్తంగా తెలవని నానుడు లేడు. మొదట్లో ఎకరాకు 8 వేలు ఇచ్చినా నేను ఆ తర్వాత ఏడాదే 10 వేలను నాద్వారా నా రాష్ర్ట రైతులందరికి అందిస్తున్నాను. నాకు చిన్న, సన్నకారు, పెద్దరైతులు అనే విభేదాలు సైతం లేకుండా ప్రతి ఏడాది దాదాపు 65 వేల కోట్లను గత 5 సంవత్సరాలుగా నిరంతయంగా అందిస్తున్నేఉన్నాను. నేను మధ్యవర్తులు, బ్రోకర్లు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే పడిపోతాను. నాతో రైతులకు పెట్టబడి తిప్పలు పూర్తిగా తగ్గకపోయినా కాస్తో కూస్తో సాయంగా మారానని మనస్పూర్తిగా భావిస్తున్నాను.

10 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

అన్ని రకాల మొక్కలు లభించును

హైదరాబాద్ కి 50 కిలో మీటర్ దూరంలో ఉన్న సంగారెడ్డి నర్సరీలో ఎలాంటి రకమైన మొక్కలు కావాలన్నా అన్ని కాలాలలో పండించే పండ్లు , పూల , ఔషధ మరియు అన్ని రకాల మొక్కలు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ ఉన్న పండ్ల పరిశోధన కేంద్రం దేశంలో కొత్త రకాల వంగడాలను సృష్టిచడంలో ఇక్కడి సైంటిస్ట్ లో ఎంతో కృషి చేస్తున్నారు. ఇక్కడి వాతావరణం మొక్కల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. ఈ మొక్కలకు ప్రత్యేక స్థానం ఉంది. పండ్ల పరిశోధన కేంద్రంలో ట్రైనింగ్ తీసుకున్న రైతులు స్వయం ఉపాధి ద్వారా పెద్దాపూర్, తిమ్మాపూర్ గ్రామాలలో 300 పైగా నర్సరీలను నడుపుతున్నారు. ఎలాంటి రకమైన పండ్ల మొక్కలైనా ఇక్కడి నర్సరీ ల నుండి ముందుగానే ఆర్డర్ ఇచ్చి తెప్పించు కోవచ్చు. ఇక్కడి నర్సరీ నిర్వాహకులు శాస్త్రీయ పద్దతులు పాటిస్తూ దేశం మొత్తం మొక్కలు అందిస్తున్నారు. వ్యసాయానికే కాకుండా హోమ్ గార్డెనింగ్, రూఫ్ గార్డనింగ్ కోసం కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.

09 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

NEW VARIETY OF MAIZE

ITS ALL ABOUT THE MAIZE VARIETY WHICH CAN FIX NITROGEN