31 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

జూన్ రెండో వారంలో నైరుతి ఋతుపవనాలు

వాతావరణ శాఖ ఋతుపవనాలు గమనం పై బులిటెన్ ను విడుదల చేసింది. జూన్ 4 వ తేదీన కేరళలోకి నైరుతి ఋతుపవనాల ప్రవేశించనున్నట్లు వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో విస్తరించానికి దాదాపు వారం నుంచి 15 రోజుల సమయం పడుతుందన్నారు. ఋతుపవనాలు ప్రవేశించడం ద్వారా ఎండలు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది. చిరుజల్లులను చూసి తొందర పడి రైతులు విత్తనాలు విత్తుకుంటే భూమిలో మొలకలు ఉడికిపోయే అవకాశం ఉంది కావున విత్తనం విత్తే తేమ కనబడినప్పుడే విత్తనాలు విత్తుకొవాలని రైతులకు విజ్తప్తీ.

31 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

good news for all

ఆసక్తి కల రైతులు మరియు agriculture products marketing చేస్తున్న ఎవరైనా సరే ఈ అవకాశం వినియోగించుకోవచ్చు. మరిన్ని పూర్తి సమాచారం కోసం 8247811789 నంబర్ లో WhatsApp ద్వారా సంప్రదించండి.

30 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రాష్ట్రవ్యాప్తంగా ఆడపదడప వర్షాలు

తెలంగాణకు వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి 5 రోజులపాటు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణలోని కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయన్నారు. గాలుల వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ వర్షాలను దృష్టీలో ఉంటుకొని కాంటాలు కానీ వరి రైతులు తగు జాగ్రత్తలు తీసుకొవాలని, అలాగే లోతు దుక్కులు దున్నుకొవడం, పచ్చి రోట్ట పైర్ల వంటివి సాగు చేయడం వంటి పనులపై రైతులు దృష్టీ సారించాలి.

29 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వరి పొలాల్లో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

వరి సాగులో నీటి వాడకం అత్యధికం. నారు నాటిన తర్వాత నాలుగు నెలల వరకు నీరు తగ్గకుండా చూసుకోవాలి. అయితే సేంద్రియ పద్దతిలో సాగుచేసే వరి రైతులు చేపల సాగు చేసేలా ఇండోనేషియా రైతులు వినూత్న ప్రయత్నాలు సాగిస్తున్నారు. చేపలు, రొయ్యలు, బాతులను పెంచుతూ ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. దీంతో వరి పొలాల్లో ఆక్సిజన్ బాగా లభించి దిగుబడి 10%శాతం పెరుగుతుంది అలాగే పొలంలోని కీటకాలను చేపలు తినడం వల్ల కీటకాల సంఖ్య తగ్గుతుందంటున్నారు.


27 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

5న ప్రకృతి రైతుల మహా సమ్మేళనం

జూన్ 5 - సోమవారంన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గో- ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రకృతి రైతుల మహా సమ్మేళనం నిర్వహించనున్నారు. పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్లో ఉ. 10 గంటలకు సమ్మేళనం ప్రారంభమవుతుంది. “పాలాన్ని అమ్మే వ్యవసాయం మానేద్దాం, పాలాన్ని కొనుగోలు చేసే వ్యవసాయాన్నే చేద్దాం” అనే నినాదంతో ఈ మహా సమ్మేళనం నిర్వహించనున్నారు. దీనికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న 10 వేల మంది రైతులు, వినియోగదారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ పాల్గొని పర్యావరణ రక్షణ వ్యవసాయ విలువలను తెలుసుకోగలరు.

26 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులకు బాసటగా గ్రోద్రెజ్ - ఎస్ బిఐ

ఆయిల్ ఫామ్ రైతులకు చేదోడువాదోడుగా ఉండెలా ఆర్థికంగా సహాయపడేలా రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా గ్రోద్రెజ్ మరియు ఎస్ బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) భాగస్వామ్యంతో ఫైనాన్స్ ఆఫర్ను ప్రారంభించినట్లు గోద్రెజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ ఇటివల ప్రకటించింది. తక్కువ రుణ సౌకర్యంతో మైక్రో ఇరిగేషన్ పరికరాల ఏర్పాటు , పశువును రక్షించడానికి ఏర్పాట చేసే ఫెన్సింగ్, ఆయిల్ పామ్ తోటల వద్ద బొర్ వెల్స్ బావులను ఏర్పరచటానికి రుణాన్ని పొందేలా తోడ్పాటు అందిస్తుంది. ఆయిల్ పామ్ సాగు ప్రొత్సహించేందుకు మొక్కలు నాటిన మొదటి 5 ఏళ్ల కాలంలో తోటలను నిర్వహించడానికి సహయంగా పనిచెయనుందని గ్రోద్రెజ్ అధికారులు తెలిపారు.

24 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఖరిఫ్ కాలనికి అందుబాటులో ఎరువులు, విత్తనాలు

2023-24 ఖరీప్ పంట కాలం సాగు విస్తీర్ణం గత ఏడాది సాగుతో పొల్చితే పెరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా. వరి సాగు తగ్గించి మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, పెసర, కంది, సోయాబిన్‌, పచ్చిరొట్ట, జొన్న, మినుము ఇతర పంటల సాగు విస్తీర్ణం పెరిగేలా చూడాలని, ఆ దిశగా రైతులను ప్రోస్తాహించాలని వ్యవసాయశాఖ యోచిస్తుంది. ఇప్పటికే వాటికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగ్రోస్‌ రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల్లో వీటిని రైతులు నేరుగా కొనుగోలు చేయొచ్చని చెప్పారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పోలీసుల సహాయంతో ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


23 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రేపే విత్తన మేళా ప్రారంభం

ఈనెల 24న హైదరాబాద్. రాజేంద్రనగర్ లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో, జగిత్యాల, పాలెం, వరంగల్ లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో (కేవీకే) విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాల పరిశోధన సంచాలకులు డా. వెంకటరమణ సోమవారం తెలిపారు. పరిధిలోని 10 రకాల పంటల్లో 45 వెరైటీల వంగడాలకు సంబంధించి 15 వేల క్వింటాళ్ల విత్తనాలను విక్రయానికి అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే రైతుల సందేహాలు తీర్చడానికి శాస్త్రవేత్తలతో చర్చాగోష్ఠి ఏర్పాటు చేస్తున్నారు. రైతులు, యువరైతులు పెద్ద ఎత్తున పాల్గొని నాణ్యమైన విత్తనాలను సేకరించుకునే అవకాశాన్ని సద్వినియోగం చెసుకొవాలి.

22 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలుగు రాష్ట్రాలలో మళ్ళి వర్షాలు..

రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు. పగటి ఉష్ణోగ్రతలు 41 నుండి 43 oC మధ్య రాత్రి ఉష్ణోగ్రతలు 24 నుండి 26 oC మధ్య, గాలిలో తేమ ఉదయం పూట 68-75 శాతం, మధ్యాహ్నం పూట 44 - 70 శాతం నమోదు కావొచ్చునని వాతావరణ కేంద్రం తెలిపింది. కావున పంటలు తడవకుండా టార్పలిన్ పట్టాలను కప్పాలి, పంట కోతలను వచ్చే వారానికి వాయుద వేసుకోవాలి, కోసిన పంటలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలి మరియు యూరియా బస్తాలు తడవకుండా భద్రపరుచుకోవాలి, మామిడి కాయలు రాలి నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వానలను ఆసరా చేసుకొని లోతు దుక్కులు చేసుకోవడం మంచిదని వ్యవసాయ శాఖా తెలిపింది.

20 May , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

సోలార్‌ పవర్డ్‌ ఆగ్రో వెహికల్‌

సాగులో సన్న, చిన్న కారు రైతులు యంత్రాలపై ఎక్కువ పెట్టుబడులు పెట్టలేక పాత పద్దతులు పాటిస్తున్నారు. అయితే సాగులో తన శక్తీ తానే తయారుచేసుకునేలా సౌరశక్తీతో నడిచే యంత్రాన్ని న్యూఢిల్లీలోని ఆమైటీ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 11వ తరగతి చదువుతున్న సుహానీ చౌహాన్‌ ఢిల్లీ ప్రగతి భవన్‌లో ఇటీవల జరిగిన టెక్‌ ప్రదర్శనల సోలార్‌ పవర్డ్‌ ఆగ్రో వెహికల్‌ (ఎస్‌వో-ఏపీటీ)ను తయారుచేశారు. ఈ యంత్రం ద్వారా భూమి చదును చేయటం, విత్తనాలు నాటడం, ఇతర పనుల్లో ఈ వాహనం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని, పర్యావరణహితమైందేగాక, నిర్వహణ ఖర్చులు కూడా ఉండవన్నారు.