14 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులకు శుభవార్త - మార్కెట్ యార్డులో రూ.5 కే భోజన సౌకర్యం !

తెలంగాణ ప్రభుత్వం పట్టణానికి పనికోసం వచ్చే రైతులు సమీప పట్టణ మార్కెట్టుకు వెళ్ళినప్పుడు అధిక మొత్తంలో వారి భోజనానికి ఖర్చు చేయవసి వస్తుంది. వారికీ తక్కువ ధరకు భోజన సౌకర్యాన్ని అందిస్తున్న పథకం ‘అన్నపూర్ణ పథకాన్ని’ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు అన్నపూర్ణ పథకాన్ని హైదరాబాద్ సహా పలు నగరాల్లో, పట్టణాల్లో, ఆసుపత్రుల్లో అమలు చేస్తున్నారు. ఇక్కడ కేవలం రూ.5కే భోజనం అందజేస్తారు. రైతుల ఖర్చులను తగ్గించిన నాణ్యమైన ఆహారం అందించాలని ప్రభుత్వం కృషి చేస్తుందని అధికారులు తెలిపారు.

14 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

టన్నుకు 24 వేలు పలుకుతున్న అరటి ధర!!

ఆంద్రప్రదేశ్ రాజమహేంద్రవరంలో అరటి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్, ఎగువ రాష్ట్రాల్లో అరటి లేకపోవడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం టన్ను అరటి ధర రూ.24 వేలకు చేరింది. గత సీజన్లో టన్ను రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకూ పలికింది. ప్రస్తుతం అరటికి మంచి ధర ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత మూడేళ్లలో ఈ ధరే అత్యధికమని వారు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా అరటి సాగు జరిగే మహారాష్ట్ర , బీహార్, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో దిగుబడులు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో, రాష్ట్రంలోని అరటికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.

13 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలుగు రాష్ట్రాలకి అకాల వర్షాల బెడద...!!

రైతులు తస్మాత్ జాగ్రత్త..!! తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నటు తెలంగాణ వెదర్ మ్యాన్ తెలియజేసింది. ఈ నెల 16-20 వరకు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. 2013-2014 తర్వాత మళ్ళి ఈ మార్చ్ లోనే ఏక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కొన్ని రకాల పంటలకు నష్టం కలిగే అవకాశం ఎక్కువ గా ఉన్నట్లు సూచించారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు చేపడితే పంటలకు నష్టం వాటిల్లకుండా ఉండే అవకాశం ఉంటుంది.

09 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మహిళ మణి విజయగాధ

నేటి యుగంలో పురుషులతో సమానంగా వైద్య, విఙ్ఞాన, వ్యాపార, విద్య రంగాల్లోనె కాక వ్యవసాయంలోనూ మహిళలు ముందున్నారు. ఇంటి పనులతో పాటు భర్తతో దీటుగా అన్ని వ్యవసాయ పనులు చేస్తూ, సహాయపడుతుంది. సూర్యాపేట జిల్లా, పెన్ పహాడ్ మండలం, దూపహాడ్ గ్రామానికి చెందినా లక్ష్మి అనే మహిళ వారికి ఉన్న 40 ఎకరాల వ్యవసాయాన్ని సాగులో సహాయమే కాక కూలిల కొరత తీర్చేందుకు తీర్చేందుకు భర్త అరవింద్ సహకారంతో ట్రాక్టర్ నేర్చుకొని దుక్కి దున్నడం, మందు కొట్టడం వంటి అనేక వ్యవసాయ పనులలో చేదోడుగా ఉంది.


08 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వరి వద్దు ఇతర పంటలతో లాభాలు పొందుదాం.

గతంలో ప్రధానంగా రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి సాగు చేసేవారు. దీంతో సాగుకు ఖర్చు తక్కువ కావడంతో పాటు ఎరువులు, కూలీల ఖర్చు తక్కువగా ఉండేది. పండించిన ధాన్యానికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉండడంతో రైతులకు ఎక్కువ లాభాలు వచ్చేవి. 30 ఏండ్ల కిందట రైతులు ప్రజలకు నిత్యం ఉపయోగపడే పంటలు సాగు చేసేవారు. ప్రస్తుతం భూములన్నీ అన్ని పంటల సాగుకు అనుకూలమైనా రైతులు కూడా వరిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. ఒకే రకమైన పంటలు సాగుచేయడం వల్ల భూసారం దెబ్బతిని దిగుబడి తక్కువగా వస్తున్నది. పంట ఉత్పత్తులు ఎక్కువ కావడం వల్ల మద్దతు ధర లభించడం లేదు. దీంతో మార్కెట్లో మిగతా పంట ఉత్పత్తుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సాగుచేపడితే మేలని వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆరుతడి పంటలు సాగుచేయడం వల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించొచ్చని చెబుతున్నరు. గతంలో రైతులు వేరుశనగ, పప్పుశనగ, పొగాకు, మొక్కజొన్న, కుసుమ, పత్తి, ఆముదం, పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, మినుములు, కొర్రలు, సజ్జలు, జొన్నలు, పెసర్లు, కంది, అలసందలు, వాము తదితర పంటలు సాగు చేసేవారు. ఈ పంటలకు పెట్టుబడి తక్కువ, లాభాలు ఎక్కువగా వచ్చేవి. రైతులు ఇతర పంటలు పండించి లాభాలు పొందాలని ప్రభుత్వం కోరుకుంటుంది.

06 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులు కోటీశ్వరులయ్యే పంట

సంప్రదాయ పంటలు పండిస్తే పెద్దగా లాభాలు ఉండవు. అందుకే రైతులు కొత్త పంటల వైపు చూస్తున్నారు. ప్రయోగాలు చేసి ఎంతో మంది రైతులు విజయవంతమయ్యారు. మనమందరం వెనీలా ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతాం. అయితే ఈ వనిల్లా ఏమిటి మరియు అది ఎక్కడ నుండి వస్తుంది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? వెనీలా అనేది పండించే మసాలా అని తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు . ఇది తూర్పు మెక్సికో, గ్వాటెమాల, సెంట్రల్ అమెరికా, ఉగాండా, జమైకా కాకుండా భారతదేశంలో కూడా దీనిని సాగు చేస్తారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో వెనిలా ఒకటి. ఈ మసాలా కిలో విత్తనాల ధర రూ దాదాపు 40 నుంచి 50వేల వరకు పలుకుతున్నాయి . ప్రస్తుతం రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న పంటల్లో వెనీలా కూడా ఉంది. మనదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఎంతో మంది రైతులు వెనీలాను (Vanilla Farming) పండిస్తున్నారు. కుంకుమ పువ్వు తర్వాత అత్యంత ఖరీదైన పంటగా వెనీలాయే. వెనీలాను పెద్ద ఎత్తున సాగు చేస్తే. రైతులు కోటీశ్వరులవుతారు. అంత బాగా లాభాలు వస్తాయి.

06 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులకు అద్దె డ్రోన్లు

వ్యవసాయ రంగాల్లో ఆధునిక పద్దతుల్లో పండించే విధానాలు పెరుగుతున్నాయి. విత్తనాల నుండి ఎరువులు చల్లడం వరకు అన్ని డ్రోన్లతో చేసే రోజులు ముందున్నాయి .రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి రైతు అగ్రోస్ సేవా కేంద్రాలలో త్వరలో రైతులకు అద్దెకు మరియు కొనుగోలుకు డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించింది. డ్రోన్ల ద్వారా స్ప్రే చేయడం వలన తక్కువ నీరు, పురుగుల మందు అవుతుంది అంతే కాకుండా ఇలా చేయడం వలన రైతులకు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా, కులిల ఇబ్బందులను అధిగమించవచ్చు అని తెలిపారు


06 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మిక్రోగ్రీన్స్ - తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు

ప్రస్తుతం వ్యవసాయంలో తక్కువ కాలంలో, తక్కువ ఖర్చులతో - ఎక్కువ లాభాలు, అధిక దిగుబడుల పై రైతుల దృష్టి పెరిగింది. మైక్రోగ్రీన్స్ ఇవి కొన్ని ఆకుకూర మొక్కలు పూర్తిగా ఎదగక ముందే కూరగాయలలా మరియు మూలికలు వాడుకునేవిగా చెప్పవచ్చు . వీటిలో అధిక పోషకాలు ,యంటిఆక్సిడెంట్లు , విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వలన కాన్సెర్, డైబెటిస్, గుండె సంబందిత అనేక ఆరోగ్య సమస్యలును దూరం చేయవచ్చు .మైక్రోగ్రీన్స్ అనేవి పూర్తిగా పెరిగిన ఆకుకూరల కంటే ఎక్కువ ఆరోగ్యకరమైనవి. టర్నిప్, ముల్లంగి, బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యారెట్, పాలకూర, బచ్చలికూర, ఉసిరికాయ, క్యాబేజీ, దుంప మరియు తులసి వంటి అనేక రకాల మొక్కలను మైక్రోగ్రీన్స్‌గా పెంచవచ్చు. మైక్రోగ్రీన్‌లను ఏ సీజన్‌లోనైనా నాటవచ్చు, అయితే సీజన్‌ను బట్టి సాగు చేయడం మంచిది. మైక్రోగ్రీన్‌ల మంచి ఉత్పత్తి పరిసర ప్రాంతాల వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. కొత్తిమీర, ఆవాలు, ఉల్లిపాయలు, ముల్లంగి, పుదీనా మరియు వంటి మొక్కలు సాగుకు మంచివి. పొలాల్లోని మైక్రోగ్రీన్‌లను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. వ్యవసాయానికి ఎక్కువ సేంద్రియ ఎరువు లేదా నేల అవసరం. ఇది నేల అవసరం లేకుండా నీటిలో పెరిగే మైక్రోగ్రీన్లు కూడా ఉన్నాయి. వీటిని టెర్రేస్ నుండి బాల్కనీ ఎక్కడైనా పెంచుకోవచ్చు. దీని కోసం ప్రతిరోజూ 3 నుండి 4 గంటల సూర్యకాంతి సరిపోతుంది. వ్యవసాయం పెద్ద ఎత్తున జరిగితే, బలమైన సూర్యకాంతి నుండి పంటను రక్షించాల్సిన అవసరం ఉంటుంది. మిక్రోగ్రీన్స్ పెంచడం కుడా తేలికగా ఉంటుంది మరియు ఇవి విత్తనాలు 3 రోజులలో మొలకెత్తుతాయి, ఈ మొలకెత్తిన విత్తనాలను ఎండలో ఉంచి, రోజుకు 2 నుండి 3 సార్లు నీరు పెట్టాలి. మైక్రోగ్రీన్‌లు ఒక వారంలో సిద్ధంగా ఉంటాయి.

02 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కల్తీ నూనెకు స్వస్తి

ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ స్వచ్ఛమైన విజయ గానుగ నూనెను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. బుధవారం మినిస్టర్స్ క్వార్టర్స్ విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి విజయ గానుగ నూనెను మార్కెట్లోకి విడుదల చేశారు. రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో తయారు చేసిన గానుగ నూనెలో కల్తీ ఉండదని, వచ్చే రోజుల్లో అందరికి కల్తీ లేని నూనె అందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు.

02 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

బోరుకి రిటేoతా?

బోరు డ్రిల్లింగ్కు రేట్ ఫిక్స్ చేయండి గద్వాల జిల్లాలో బోరు బావులు తవ్వడానికి సంబంధించి రేట్ ఫిక్స్ చేయాలని అడిషనల్ కలెక్టర్ అపుర్వ్ చౌహాన్ అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్ లో ఎస్సీ కార్పొరేషన్, భూగర్భ జల అధికారులతో సమీక్షించారు. బోర్ ఫ్లషింగ్, డ్రిల్లింగ్ డెప్త్, కేసింగ్, తదితర వాటికి సరైన రేట్లు నిర్ణయించి ప్రొసీడింగ్స్ తయారు చేయాలని ఆదేశించారు. ఇదే విధంగా అన్ని జిల్లాలో జరిగితే రైతులకు మేలు కలిగే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు.