NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
కొత్త లబ్దిదారులకు రైతుబంధు
జూన్ 16 నాటికి కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చిన ప్రతి రైతులకు ఈ వానాకాలం రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం పొందడానికి కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవోలకు రైతుబంధు పోర్టల్లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. రైతు పట్టాదారు పాస్బుక్ వివరాలను రైతుబంధు పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. ఈ నెల 26 నుండి రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతుల ఖాతాల్లో రైతుబంధు !!
ఈ నెల 26 నుంచి వానాకాలం పంట పెట్టుబడికి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరియు త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని, పట్టాల పంపిణీ అనంతరం, రైతులకు కూడా రైతుబంధు సాయం అందించాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులకు తొలకరి శుభవార్త !!
ఆలస్యమైన నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన కదలిక మొదలైంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తోలకరులు ఆరంభమైనవి. రాబోయే రెండు మూడు రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తరించి 24, 25 నుంచి రుతుపవన వర్షాలు కురవనున్నాయి. ఈ నెల ఆకారి వరకు నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో విస్తరించి మంచి వర్షాలు పడనున్నాయి. వానల కోసం ఎదురుచూస్తున్నా రైతులు ఈ నెల 24 నుండి ఖరిఫ్ పంటల వ్యవసాయ పనులు నిరాటంకంగా మొదలుపెట్టవచ్చు. Courtesy: ASP
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తొందరపడకు రైతన్నా...
జూన్ 3 వారం అవుతున్నా ఋతుపవనాల జాడ లేదు, నైరుతి ఋతుపవనాల రాక ఆలస్యమయ్యేలా ఉన్నందున పత్తి రైతులు తొందరపడి విత్తనాలను వేయొద్దు. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలో, ఈ వేడికి విత్తనాలు విత్తితే మొలకశాతం తగ్గుతుందని, దీంతో విత్తనాలు వృథా అయిపోయి సాగు ఖర్చు పెరుగుతుంది కావున వానలు పడిన తర్వాత భూమి చల్లబడి అనుకూలంగా ఉన్నాకే పత్తి విత్తుకోవాలంటున్నారు. జూలై 15 వరకు విత్తుకో వచ్చని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ములుగు అటవీ కళాశాల- తేనెటీగల పెంపక శిక్షణ
సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో రెండో విడత కింద ఎన్బీహెచ్ఎం పథకం ద్వారా తేనెటీగల పెంపకంపై రైతులకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. ఏడు రోజుల పాటు శిక్షణలో పాల్గొనే వారికి అల్పాహారం, భోజనం, టీ, రాత్రి భోజనం మరియు వసతి ఏర్పాట్లు కల్పించబడుతాయని తెలిపారు. ఆసక్తిగల రైతులు పూర్తి వివరాలకు నరేష్ 98498 10511, శశాంక్ 8985972587 నెంబర్లపై సంప్రదించాలని సూచించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులు నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా ?
రైతులు విత్తనం తీసుకునేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. ప్రభుత్వ అనుమతి పొందిన లేదా విత్తన ధృవీకరణ సంస్థ లైసెన్సు పొందిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనాలి. 2. తక్కువ ఖరీదు ఉన్న, మూటలలో కట్టిన విత్తనాలను కొనవద్దు మరియు కొనుగోలుదారు నుండి బిల్లును తీసుకోవాలి. 3. విత్తనాలు కొంటున్నపుడు సంచి వెనకాల ట్యాగ్ లు, లైసెన్స్ నెంబర్, విత్తనం, లాట్ నెంబర్, QR కోడ్ వీటితో పాటు "Date of packing" మరియు "Validity Dates" కూడా రైతులు సరి చూసుకోవాలి. 4 మొలక శాతం 80% అంత కంటే ఎక్కువగా ఉండేలా, జన్యు శాతం 98% అంతకంటే ఎక్కువగా మరియు ఇతర పదార్థాలు 2% అంతకంటే తక్కువగా ఉండేలా రైతులు సరిచూసుకోవాలి. 5. ఒకవేళ ప్రత్తి విత్తనాలు కొంటున్నప్పుడు బీటీ మరియు నాన్ బీటీ విత్తనాల తేడా కోసం "GEAC" చే ముద్రించిన నంబర్ ఉన్నది లేనిది రైతులు గుర్తించాలి. నంబర్ ఉంటే బిటి విత్తనాలు గా గుర్తించాలి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పత్తి మోళ్లను కలియ దున్నితేనే భూమికి సత్తువ
పత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు రాకుండా ఉండాలంటే సాగు భూమిలో వేసవి నుంచే ముందస్తుగా చర్యలు తీసుకోవాలని. పత్తి పంట దిగుబడి పూర్తయ్యాక చెట్ల మొదళ్లను అలాగే ఉంచుతున్నారు. అదే భూమిలో వానాకాలం పత్తి వేస్తే పురుగుల ఉద్ధృతి పెరుగుతుంది. పత్తి మోళ్లలో గుడ్లు, లార్వా కోశస్థ దశ రూపంలో నిల్వ ఉండే వానాకాలం పంట వేయగానే పురుగు ఆశించి నష్టపరుస్తుంది. పత్తి మోళ్లను ట్రాక్టర్ నాగలి లేదా రోటోవేటర్ లతో భూమిలో కలియదున్నాలి. పురుగు అవశేషాలను సమూలంగా నాశనం చేయవచ్చు. తద్వారా సేంద్రియ కర్బన పదార్థాలను అందించి భూమి సత్తువను పెంచుకోవచ్చని వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఖాతాల్లోకి అకాల వడగళ్ళ వాన నష్టపరిహారం
మార్చి 16 నుంచి 21 వరకు తెలంగాణలోని 26 జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్లతో వరి, జొన్న, మిర్చి, వేరుసెనగ, పత్తి, కూరగాయలు, మామిడితోటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.151.46 కోట్ల పరిహారం విడుదల చేసింది. ఈ నిధులను జిల్లాల వారీగా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులకు పంపించి, నేరుగా రైతుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీకి ఆదేశించారు. పంట నష్టాలను స్వయంగా పరిశీలించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారంగా అందిస్తామని. ఈ మేరకు వ్యవసాయశాఖ సర్వేలు నిర్వహించి 1,51,645 ఎకరాల నష్టాన్ని నమోదు చేసింది. దీనికి అనుగుణంగా 1,30,988 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేయాలని ఆదేశించింది. మహబూబాబాద్ జిల్లాలో 12,684 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం పరిహారం జమ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ ఒకటి రెండు రోజుల్లో పడనున్నాయని తెలిపారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులకు న్యాయసలహాలు
లీప్స్ రైతులకు క్షేత్రస్ఖాయిలో భూమి, వ్యవసాయ చట్టాలపై సమగ్ర శిక్షణ ఇచ్చెందుకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి ఒక సాగు న్యాయ నేస్తం వాలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చేలా లీప్స్ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సునీల్ కుమార్ తెలిపారు. భూమిపై హక్కులు, సాగు చట్టాలు చాలా ఉన్నప్పటికి చాలా మంది రైతులకు అవగహన కొరవడిందన్నారు. గ్రామంలో ఉంటూ ఇతరులకు సాహాయం చేసే ఉద్దేశ్యం ఉన్న యువత ఈ నెల 30 లోపు 90002 22674 కి వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకొవాలని ఎవైనా సందేహాలు ఉంటే నివృతి చేసుకొవాలని సూచించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
అమోజాన్ తో ICAR MOU
న్యూఢిల్లీ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) మరియు అమెజాన్ కిసాన్‌తో ఒక అవగాహనా ఒప్పందం జరిగింది. ఇది రైతుల దిగుబడులు మరియు ఆదాయం పెంచేందుకు చేయాల్సిన వివిధ పంటల శాస్త్రీయ సాగుపై రైతులకు మార్గనిర్దేశం చేయనున్నారు. అలాగే అమెజాన్ ఫ్రెష్‌తో సహా భారతదేశం అంతటా వినియోగదారులకు అధిక నాణ్యత తాజా ఉత్పత్తుల నాణ్యత నిర్ధారించడంలో సహాయపడుతుంది. డాక్టర్ హిమాన్షు పాఠక్, సెక్రటరీ డేర్ మరియు డైరెక్టర్ జనరల్ ICAR తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ-ప్రైవేట్-రైతుల-భాగస్వామ్య (PPPP) విజయవంతం కావాలన్నారు.









