01 Aug , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

PMకిసాన్ సంపద యోజన బడ్జెట్ రూ. 6520 కోట్లకు పెంపు

కేంద్ర కేబినెట్ గురవారం రైతులు మరియు కోఆపరేటివ్ సొసైటీలకు ఊరట కల్పించింది. PMKISAN కిసాన్ సంపద యోజన పథకం బడ్జెట్ రూ.4600 కోట్ల నుండి రూ.6520 కోట్లకు పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 2025-26 నుంచి 2029-29 వరకు నాలుగేళ్లకు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి రూ.2000 కోట్ల గ్రాంట్ మంజూరు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా పాడి, పశువులు, మత్స్య, చక్కెర, వస్త్ర, ఆహార ప్రాసెసింగ్, నిల్వ మరియు శీతల గిడ్డంగి, కార్మిక మరియు మహిళా నేతృత్వంలోని సహకార సంఘాలు వంటి వివిధ రంగాలకు చెందిన 13,288 సహకార సంఘాలలోని సుమారు 2.9 కోట్ల మంది సభ్యులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

28 Jul , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

120 కోట్ల రూపాయలతో 89కోట్ల చేప పిల్లల పంపిణీ

*మహిళ సంఘాల చేతికి చేపల పెంపకం: డిప్యూటి సీఎం భట్టి రాష్ట్రవ్యాప్తంగా చెరువులు, ప్రాజెక్టుల్లో 89 కోట్ల చేప పిల్లల పంపిణి చేయనున్నట్లు డిప్యూటి సీఎం భట్టి గారు పాల్వంచ కలెక్టరేట్ లో ప్రకటించారు. ఈ ఆగస్టులోనే చేపపిల్లలను వదిలేలా ప్రభుత్వం ప్రణాళిక చేస్తుందని, దినికోసం 120కోట్ల బడ్జెట్ కేటాయించదన్నారు. ఈ పంపిణిలో కూడా మాహిళ సంఘాలకు అవగాహాన కల్పించాలని, వారు ఆర్ధికంగా ఎదిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

28 Jul , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఆగస్టు నెలలోనైనా యూరియా కొరత తీరేనా

2025 వానాకాలని 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయించగా నేటివరకు 2.37 లక్షల టన్నుల యూరియా తక్కువగా కేంద్రం సరఫరా చేసింది. ఈ లోటు సరఫరా వల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడిందని, దీనికోసం ఇప్పటికే ఐదారుసార్లు కేంద్రఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వినతి పత్రాలు రాశామని, ఆగస్టు మాసం కేటాయింపులతో పాటు లోటు యూరియాని కూడా అందించే అవకాశం ఉందన్నారు. డీలర్లు ఎవరు కూడా ఎంఆర్పీ రేటుకు ఎక్కువ అమ్మకూడదని, అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

30 Jun , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కొబ్బరికి చరిత్రలో ఎన్నడూ లేని రేటు!

ఇతర రాష్ట్రాల్లో దిగుబడి తగ్గిన కారణంగా, రాష్ట్ర కొబ్బరికి గణనీయమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొబ్బరి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం వెయ్యి కొబ్బరి కాయల ధర రూ.22,000 నుండి రూ.23,000 వరకు ఉంది. గతేడాది మే నెలలో ఇదే ధర కేవలం రూ.12,000 మాత్రమే ఉండేది. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు 2 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది.


30 Jun , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నారుకు బదులుగా నేరుగా వరి సాగు

తాజాగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, వరి రైతులు డైరెక్ట్ సీడింగ్ విధానాన్ని ఎక్కువగా స్వీకరిస్తున్నారు. ఈ పద్ధతిలో నారును నాటకుండానే నేరుగా విత్తనాలను పొలంలో విత్తడం వల్ల నీటి వినియోగం తగ్గుతుంది. రైతులకు ఇది కార్మిక వ్యయాలను కూడా తగ్గించడంలో ఉపయోగపడుతోంది. పలు జిల్లాల్లో ఈ విధానం అనుసరించి 66 శాతం వరి సాగు ప్రారంభమైంది. సాధారణ సాగుతో పోల్చితే 10–15 శాతం ఎక్కువ దిగుబడిని అందించే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. వర్షాలు ఆలస్యమవుతున్నా, ఈ విధానం వల్ల పంటలకు గడువు మించకుండా సాగు జరగుతుందని రైతులు ఆశిస్తున్నారు.

15 May , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఏపీలో పశువులకు గోధార్ కార్డులు

ఆంధ్రప్రదేశ్‌లో పశువులకు ఆధార్ తరహా ‘గోధార్’ కార్డులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. విజయవాడలో జరిగిన టెక్ ఏఐ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు స్టార్టప్ కంపెనీలతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ పథకాన్ని తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఆయన సూచించారు. పశువుల ఆరోగ్య సమాచారం, రోగ నిర్ధారణ కోసం ఈ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే కోళ్ల వ్యాధుల ముందస్తు గుర్తింపుకు ప్రత్యేక మొబైల్ యాప్ అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.

13 May , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలంగాణకు వర్ష సూచన!

భారత వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ తీరాన్ని ఇప్పటికే తాకాయి. ప్రస్తుతం ఇవి చురుకుగా కదులుతున్నాయి. ఈ నెల 27వ తేదీ నాటికి కేరళ తీరాన్ని చేరే అవకాశం ఉంది. జూన్ 12వ తేదీ వరకు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముంది.ఈసారి తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఉష్ణోగ్రతల ప్రభావం రాబోయే వారం రోజుల్లో తగ్గనుంది.


17 Apr , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వంగ ధర బోర్లా పడింది!

బొబ్బిలి, రామభద్రపురం ప్రాంతాల్లో వంగ ధర ఒక్కసారిగా బోర్లా పడిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. గతేడాది కిలో రూ.20 ఉండగా, ఇప్పుడు కేవలం రూ.3కు పడిపోవడం రైతులకు తీవ్ర నష్టం తెచ్చిపెట్టింది. రవాణా ఛార్జీలు కేటుకు రూ.50 పడుతుండగా, మార్కెట్లో ధర మాత్రం చాలా తక్కువగా ఉండడం వల్ల రైతులు దోపిడీకి లోనవుతున్నారు. గతేడాది 200 ఎకరాల్లో సాగు చేసిన వంగను, ఈసారి 450 ఎకరాలకు పెంచడంతో, ఇతర ప్రాంతాల్లో కూడా సాగు పెరిగింది. దీంతో రవాణా కూడా 50 శాతానికి తగ్గింది. నిల్వ సామర్థ్యం లేక రైతులు అడిగిన తక్కువ ధరకే పంట అమ్మకానికి వెనకాడలేక పోతున్నారు. 50 సెంట్లలో రూ.40 వేలు పెట్టుబడి పెట్టి పండించిన వంగ, మొత్తం రూ.10 వేలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు.

08 Apr , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ట్రంప్ సుంకాలతో మామిడి ఎగుమతులపై పడనున్న భారం !!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 26% ప్రతీకార సుంకాలు భారతీయ మామిడి ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోని మామిడి రైతులు ఈ ఎగుమతులపై కొత్త కష్టాలను ఎదుర్కొంటున్నారు. మామిడి పండ్ల ఎగుమతులు ఈ సుంకాల పెంపుతో తగ్గిపోతున్నాయి. ఇండియా మొత్తం మీద 7,64,500 ఎకరాల్లో మామిడి సాగుతూ, ఏటా 24,45,900 టన్నుల ఉత్పత్తి అవుతున్నాయి. అందులో 45,000 టన్నుల మామిడి అమెరికాకు ఎగుమతవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 10,000-15,000 టన్నులు అమెరికా ఎగుమతవుతుంది. ప్రస్తుతం ఈ ఎగుమతుల విలువ రూ.150-230 కోట్లు, కానీ ట్రంప్ సుంకాల కారణంగా ధరలు రూ.50 కోట్లు పెరిగే అవకాశముంది.

27 Mar , 2025

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వరంగల్ మార్కెట్‌లో బంగినపల్లి మామిడికి రికార్డు ధర!

వరంగల్ ఎనుమాముల ముసలమ్మ కుంటలో గురువారం ప్రారంభమైన నూతన మామిడి మార్కెట్‌లో తొలి రోజే బంగినపల్లి మామిడి రికార్డు ధర సాధించింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్లకు చెందిన రైతు విజయపాల రెడ్డి తీసుకువచ్చిన బంగినపల్లి మామిడిని టన్నుకు రూ.1.22 లక్షలకు కొనుగోలు చేశారు. మార్కెట్ చరిత్రలో మామిడికి ఇంత గరిష్ట ధర నమోదు కావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.