04 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

సౌరవిద్యుత్ కి పునాదులవుతున్ననీటి కాల్వలు

నీటి కోసం ఉపయోగపడే కాల్వలు కొత్తగా కరెంటు ఉత్పత్తికి ఉపయోగపడేలా వినూత్న ప్రయోగం చేసింది గుజరాత్ ప్రభుత్వం. గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా 532 కిమీ పొడవైన నర్మదా కాలువల నెట్‌వర్క్‌ను సోలార్ పవర్ ప్రాజెక్ట్ గా మార్చబోతున్నారు. ఈ విధానంతో నీటి ఆవిరిని నిరోధిస్తుంది, భూమి వినియోగాన్ని తగ్గిస్తుంది. అలాగే సౌర ఫలకాలు చల్లబడుతుంటాయని గ్రిడ్ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ దేశ వ్యాప్తంగా అమలు జరిగేలా చేస్తే ఇక సోలార్ కరెంటుకు భూములు వేలాదిగా దొరికినట్టే అని అందరు భావిస్తున్నారు.

04 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

भारत में बेमौसम बारिश और ओलावृष्टि से फसलों को नुकसान पहुंचता है

पिछले दो सप्ताह से पश्चिमी विक्षोभ के कारण पंजाब, हरियाणा, उत्तर प्रदेश और मध्यप्रदेश में तूफान, ओलावृष्टि और तेज हवा के साथ बे मौसम बारिश हुई है। बे मौसम बारिश अभी कुछ और दिनों तक जारी रहने की उम्मीद है। बारिश ऐसे समय आती है जब सर्दियों की फसल कटाई के लिए लगभग तैयार हो जाती है। खराब मौसम के कारण तीन राज्यों में फसलों को भारी नुकसान हुआ है, जिससे किसानों के लिए भारी उपज नुकसान और कटाई की चुनौतियों का डर पैदा हो गया है। मध्य प्रदेश, राजस्थान और उत्तर प्रदेश में अनुमानित 5.23 लाख हेक्टेयर गेहूं की फसल बर्बाद हो गई, और मुनाफा घटा है, जिसके कारण राज्य के कई हिस्सों में बड़े पैमाने पर विरोध प्रदर्शन हुए । गेहूं के अलावा सरसों, चना, जौ और अन्य सब्जियों की फसल प्रभावित हुई है। कुछ राज्य सरकारों ने किसानों को राहत देने के लिए कदम उठाए हैं।

03 Apr , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఒక్కసారిగా పెరిగిన వేరుశనగ ధర క్వింటా రూ. 7,370

తెలుగు రాష్ట్రాల్లో వేరుశనగ పంటకు తెగుళ్ళు మరియు కీటకాలు ఆశించి తీవ్ర నష్టం ఏర్పడింది దీనితో రైతులకు లాభాలు తగ్గిపోయాయి. అయితే వనపర్తి వ్యవసాయ మార్కెట్‌ యార్డులో వారం రోజులుగా పెరగని వేరుశనగ ధరలు ఒక్క రోజు వ్యవధిలో క్వింటాపై రూ. 240 పెరిగింది దీనితో క్వింటా గరిష్ఠ ధర రూ.7,370 కు చేరింది.

29 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

10 రూపాయలకే భూసార పరిక్ష

7 సంవత్సరాలు పూర్తై 8 సంవత్సరంలో అడుగుపెట్టిన భూసార పరిక్ష ఫథకం. సాయిల్ హెల్త్ కార్డ్ పథకం 2015 ఫిబ్రవరి 19న రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. గత 7 ఏళ్ల వ్యవధిలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ 23 కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 11 వేల 531 కొత్త భూసార పరీక్ష ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయి. మట్టి పరిక్షల వల్ల రైతులు తమ పొలాల్లోని మట్టిలో ఉన్న పోషకాలోపాలు, పిహెచ్ స్థాయి, సేంద్రియకర్బనం వంటి వివరాలు తెలుసుకోవచ్చు. దీంతో అనవసరపు ఎరువుల ఖర్చులు తగ్గటంతో పాటు నాణ్యమైన దిగుబడులు సాధించవచ్చు. ఇప్పటకైనా అందరూ రైతులు మట్టి సామార్దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలని, కేవలం 10 రూపాయలకే పరిక్ష చేసి భూసార కార్డులను సైతం అందిస్తున్నామని సాయిల్ హెల్త్ ల్యాబ్ అధికారులు చెబుతున్నారు.


29 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట

మార్కెట్ లోకి వచ్చే నకిలీ విత్తనాలను కనిపెట్టడం రైతులకు చాలా క్లిష్టమైన పని. ఇటీవలి కేంద్ర ప్రభుత్వం మార్కెట్లో నకిలీ విత్తనాలను గుర్తించేందుకు సీడ్‌ ట్రేసబిలిటీ బార్‌కోడ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బార్‌కోడ్‌ను రైతులు స్కాన్ చేసి అసలువో లేదా నకిలీవో గుర్తించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలను వచ్చే వానాకాలం నుండి ఈ ప్రక్రియ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. విత్తనం ఎక్కడ ఉత్పత్తి అయ్యింది, ఎక్కడ ప్యాకింగ్ జరిగింది, మార్కెట్ లోకి ఎవరు విక్రయించారు, విత్తన నాణ్యత, జన్యు స్వచ్ఛత ఇలా దాని పుట్టు పూర్వోత్తరాలు అన్నీ ఒక్క బార్ కోడును స్కాన్ చేసి రైతులు తెలుసుకోవచ్చు.

29 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వాణిజ్య పంటగా వెదురు సాగు

అటవీ జాతికి చెందిన వెదురు బొంగు పంటను 2017 తర్వాత వ్యవసాయ పంటగా గుర్తించి మిషన్ బంబూ పేరుతో రైతులకు మొక్కల పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది ఎకరాల్లో రైతులు వెదురు సాగు చేస్తున్నారు. ఎకరాకు 800 నుంచి 1000 మొక్కలు వరకు నాటుకోవచ్చని, నాటిన మూడో ఏడాది నుంచి దిగుబడులు మొదలైతాయని, ఇలా నాటిన దాదాపు 50 సంవత్సరాల వరకు దిగుబడులు వస్తాయని వ్యవసాయ, ఉద్యాన అధికారులు చెబుతున్నారు. ఇటివల నిర్మల్ జిల్లా, ముథోల్ పరిసర ప్రాంతాల్లో వెదురు సాగుచేసే రైతులతో హార్టికల్చర్ ఆఫీసర్ శ్యామ్ రావు రాథోడ్ సమీక్షించి సలహాలు, సూచనలు అందించారు.

28 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

బ్యాగులకు రంధ్రాలుంటే తిరస్కరణ

ఉమ్మడి వరంగల్ రైస్ మిల్లర్ల నుంచి వచ్చే నాసిరకంగా ఉన్న బియ్యం నింపే గన్నీ సంచులను భారత ఆహార గిండ్డంగుల సంస్థ తిప్పి వెనక్కి పంపుతుంది. ఇటీవల హన్మకొండ, జనగామ జిల్లాలోని ఎఫ్ సీ ఐ కేంద్రాలకు వచ్చిన దాదాపు 90 శాతం గన్నీ సంచులు నాసిరకంగా, రంధ్రాలు ఉన్నాయని తిరిగి వెనక్కి పంపారు. సెంట్రల్ జ్యూట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియ వారు చెప్పిన విధంగా ప్రతీ బ్యాగు 580 గ్రాములు కలిగి ఉండాలని చెప్పినప్పటికీ, 20 గ్రాములు తక్కువగా ఉంటుందని ఎఫ్ సీఐ అధికారులు చెబుతున్నారు.


27 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ముడి జనపనార పండించే రైతుకు శుభవార్త

ముడి జనపనార రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. 2023- 24 సంవత్సరానికి గాను క్వింటా జనపనారకి 300 రూపాయలను పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరతో ప్రస్తుతం రూ.5050 చెరిందని, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) సిఫార్సుల మేరకు కనీస మద్దతు ధరను పెంచామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

27 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

క్వింటా ఎండు మిర్చి @ 48786/-

ఈ ఏడాది అతి, అనావృష్టితో చాలా పంటలు దెబ్బతిన్నప్పటికీ వచ్చిన అరకోర దిగుబడులకు మార్కెట్ ధరలు ఆశాజనకంగా ఉండటం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పంటైనా మిరపకి కర్నూలు మార్కెట్ యార్డులో రికార్డు ధరలు పలుకుతున్నాయి. శనివారం కర్నూలు మార్కెట్ యార్డులో క్వింటా ఎండు మిర్చికి 48 వేల 786 రూపాయలు పలకటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరతో మార్కెట్ యార్డులో శనివారం ఒక్కరోజే 295 క్వింటాళ్ల ఎండుమిర్చి బస్తాలను రైతులు విక్రయానికి తీసుకువచ్చారు.

24 Mar , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పంట నష్టం సేకరణలో ఏఈవోలు

ఇటీవల (17 – 21 మార్చి,2023) కురిసిన చెడగోట్టు వానాలతో నష్టపోయినా రైతుల వివరాలను గ్రామాల వారీగా సేకరించాలని వ్యవసాయ అధికారలకు ముఖ్యమంత్రి అదేశించారు. నష్టపోయినా పంటల వివరాలతో పాటు రైతు బ్యాంకు ఖాతా వివరాలు, పట్టాపాస్ బుక్ వివరాలను సేకరించాలని ప్రభుత్వ కార్యదర్శి రాహూల్ బొజ్జా ఉత్తర్వులు జారిచేశారు. ఈ పక్రియను 4 రోజుల్లో పూర్తిచేయలని, అనంతరం ఎకరాకు10 వేల చోప్పున డిజాస్టార్ మేనేజ్మేంట్ నుంచి పరిహారం అందించేలా కార్యచరణ సిద్దం చేస్తున్నారు.