NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
భారతదేశంలో ADeX మరియు ADMF ని తెలంగాణ ప్రారంభించింది !!
తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు భారతదేశపు మొట్టమొదటి వ్యవసాయ డేటా ఎక్స్ఛేంజ్ (ADeX) మరియు అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ (ADMF)ని ఆగస్టు 2023లో హైదరాబాద్ లోప్రారంభించారు. ADeX వ్యవసాయ రంగానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (DPI) గా అభివృద్ధి చేయబడింది. ADeX యొక్క ముఖ్య ఉద్దేశ్యం పరిశ్రమలు మరియు స్టార్టప్ల ద్వారా వ్యవసాయ డేటా యొక్క న్యాయమైన మరియు సమర్థవంతమైన వినియోగాన్ని నిర్ధారించడం మరియు ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో డేటా ఆర్థిక వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహాన్ని అందించడం.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ట్రాక్టర్ కొనాలి అనుకునే రైతులకు శుభవార్త
ట్రాక్టర్ కొనాలి అనుకునే రైతులకు శుభవార్త రైతులకు వ్యవసాయంలో ఆసరాగా నిలిచే యంత్రాల్లో ట్రాక్టర్ ప్రధానమైనది. కానీ దీనిని కొనుగోలు చేయడం మాత్రం రైతులకు ఇప్పటికీ భారంగానే ఉంది. అన్నదాతకు తక్కువ ధరకే వ్యవసాయ పనిముట్లు అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ట్రాక్టర్ యోజన స్కీమ్ అమలు చేస్తోంది. ఈ స్కీమ్‌లో భాగంగా రైతులు 50 శాతం తక్కువ ధరతో (సబ్సిడీతో) ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చు. రైతు వయస్సు మాత్రం 18 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల లోపు ఉండాలి. గడిచిన 7 సంవత్సరాలుగా ట్రాక్టర్ కొనుగోలు చేయని వారికి ఈ పథకం కింద మళ్లీ దరఖాస్తు పెట్టుకోవచ్చు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తగ్గిన టమాటా ధర, కేజీ ఎంతంటే...
గత పది రోజులుగా భారీగా పెరుగుతూ రైతు మార్కెట్ లోనే 150 రూపాయలకు చేరిన టమోటో ధరలు కాస్త ఇప్పడు తగ్గుముఖం పట్టాయి. ఏకంగా కేజీ టమోటోపై రైతు మార్కెట్ లోనే 70 రూపాయలు తగ్గి ప్రస్తుతం కేజీ టమోటో 80 రూపాయలుగా ఉంది. అంటే సగానికి సగం తగ్గినట్లే. ఇక వచ్చే వారం రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గనున్నట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. ఈ విధంగా తగ్గితే ప్రజలకు టమాటా కష్టాలు తీరినట్లే.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఆసియాలోనే అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ గా కోహెడ !!
ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ నిర్మించనున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పండ్ల రైతులను ప్రోత్సహించడంతోపాటు ఎగుమతులకు అవకాశం కల్పించేలా ఆధునాతన వసతులతో, సరికొత్తగా కోహెడలో 199 ఎకరాల్లో రూ.403 కోట్లతో దుకాణాలు, కోల్డ్ స్టోరేజీల నిర్మాణం, పండ్ల ఎగుమతులకై ఎక్స్‌పోర్టు జోన్, రహదారులు, పార్కింగ్ మార్కెట్ ప్రణాళికను చేసారని. కొహెడ మార్కెట్‌లో వ్యాపారులు, ట్రేడర్లు, రైతులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌గా నిలుస్తుందన్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మొదలైన రైతుల రుణమాఫీ !!
ఈరోజు నుండి రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 2014 నుండి 2018 లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో జమచేయనునున్నారు. రైతుల సంక్షేమం మరియు వ్యవసాయాభివృద్ది కొరకు తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీకి 19 వేల కోట్ల రుణమాఫీ పునః ప్రారంభం చేయనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో ఆనందం కనిపిస్తున్నప్పటికి రైతుల ఖాతాల్లో ఎప్పుడు పడుతుందో అని బ్యాంకుల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పక్రియ నేటితో మొదలై సెప్టెంబర్ 2వ వారం లోపు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
చెరకు సాగు రైతులకు ప్రభుత్వం తీపి కబురు !!
కేంద్ర ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి చెరకు ధర క్వింటాల్ కి రూ.315 ధరగా నిర్ణయించింది. దేశంలో చెరకు రైతులు ఇప్పటివరకు పొందుతున్న తమ చెరుకు పంటకు ఇదే అధిక ధర. అలాగే ప్రభుత్వం యూరియా సబ్సిడి పధకాన్ని "పీఎం ప్రణామ్" పథకం క్రింద మరో మూడేళ్లకు పెంచుతూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంకా రైతుల సంక్షేమానికి అనేక ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా కేంద్రం నిర్ణయించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
మూడు రోజుల పాటు భారీ వర్షాలు !!
తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ వానలను ఆసరా చేసుకొని సాగును చేసుకోవాలి. వరి పంటలో చేయవలసిన పనులు: 1. వరి పంట సాగు రైతులు ఈ వానలను సద్వినియోగం చేసుకొని నాట్లు పూర్తీ చేసుకోవాలి. 2. ఈ వర్షం వరికి అనుకూలంగా ఉన్నందున ఇప్పటి వరకు మొదలుపెట్టని రైతులు దమ్ముచేసి నేరుగా స్వల్పకాలిక విత్తనాలను చల్లుకోవాలి. 3. ఉల్లికోడు మరియు మొగిపురుగు తగ్గించడానికి కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకోవాలి. 4. 40 రోజుల పంటకు మొదటి దఫా ఎరువులను వేసుకోవాలి. ఇతర పంటలలో అంతరకృషి చేసుకోవడం మరియు మురుగు నీటి కాలువలు తీసుకోవడం మంచిది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వర్షాకాలం - రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
1. రైతులు చెట్లకింద విద్యుత్ స్థంభాల, తీగలు మరియు చెరువుల వద్ద ఉండకుండా మరియు పశువులను సురక్షిత ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. 2. పోలాల నుండి అధిక వాన నీటిని బయటకు పోవడానికి మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. 3. పాములు, తేళ్లు, విషపు కీటకాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాగే తెగిపడిపోయిన కరెంట్ వైర్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి చెప్పులు, చేతిలో టార్చ్ తీసుకెళ్లాలి. 4. పురుగుల మందులు గాలికి కొట్టుకొస్తాయి కాబట్టి ముక్కు, నోటికి వస్త్రం కట్టుకుని రసాయనాలు పిచికారీ చేయాలి. 5. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దు. ఫోన్ వాడొద్దు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతును రాజు చేస్తున్న టమాటా !!
దేశ వ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈసారి టమాటా పంట ఎక్కువగా సాగు కాకపోవడం, దీనికి తోడు పండిన పంట నష్టపోవడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక టమాటా ధరలు ఆకాశాన్నంటాయని ప్రజలు బాదపడుతున్నారు. అయితే టమాటా ధర ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే ఒక్కోసారి కిలో టమాటా రూ. 1, రూ. 2 కే అమ్ముకోలేక రైతులు రోడ్ల పక్కన పారబోయడం. పొలాల్లోనే టమాటా పంటను వదిలేయడం ఎన్నో చూశాం. కానీ ప్రస్తుతం మాత్రం 150 నుంచి రూ. 200 వరకు ధర పలుకుతోంది. రైతు రాజు అవ్వాలని అందరం అనుకుంటాం అయితే టమాటా పంటను సాగు చేసిన ఓ రైతు మాత్రం నెల రోజుల్లోనే కోటీశ్వరుడిగా మారాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
విజయవాడలో సీ-ఫుడ్ ఫెస్టివల్ !!
విజయవాడలో ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మత్స్య శాఖ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 75 శాతం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నా, మన రాష్ట్రంలో వినియోగం మాత్రం 5 శాతం లోపే ఉందని, ఈ పరిస్థితిని అధిగ మించాలంటే డొమెస్టిక్ మార్కెట్ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్థానిక వినియోగాన్ని పెంచడం, ప్రత్యా మ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను మరియు వినియోగదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.









