01 Sep , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నేల సాగు కన్నా బ్యాగు సేద్యం మిన్న!

సేంద్రియ కూరగాయ పంటలను పొలంలో సాధారణ పద్ధతి లో నేల లో కన్నా బ్యాగు ల్లో సాగు చేయటం ద్వారా ఎక్కువగా దిగుబడి తీయవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం లో ప్రయోగాత్మక సాగు లో రుజువైంది.పట్టణాలకు దగ్గరల్లోని భూముల్లో భూసారం అంతగా లేకపోవడం, చౌడు సమస్యాత్మక భూముల్లో బ్యాగు సేద్యం ద్వారా కూరగాయల ఉత్పత్తి పొందడానికి తద్వారా అన్సీజన్ లో రైతులు అధికాదాయం పొందడానికి అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అడుగున్నర ఎత్తు, అడుగు వెడల్పు ఉండే పాలిథిన్ బ్యాగు లో 15కిలోల పశువుల ఎరువు,15కిలోల ఎర్రమట్టి,100గ్రా వేపపిండి కలిపిన మిశ్రమాన్ని నింపారు. ప్రతి 15రోజులకోసారి జీవామృతం పోయాలి. పంచగవ్య, రాజ్మాగింజల ద్రావణం, కొబ్బరినీరు నాలుగైదు సార్లు పిచికారీ చేయాలి.

30 Aug , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఉపాధితో ‘ఉద్యానా’నికి ఊతం

చిన్న, సన్నకారు రైతులను లాభాల బాటలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పంటల దిశగా వారిని ప్రోత్సహిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకుని జూలైమాసంలో ఉపాధి హామి ఫథకం ద్వారా దరఖాస్తులు కొరింది. ఇందులో భాగంగా 33,6998 ఎకరాల్లో పండ్ల తోటలు వేసేందుకు 18640 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లా నుండి 2978 మంది రైతులు ధరఖాస్తు చేసుకున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 1005 ఎకరాలు లక్ష్యంగా పెట్టుకుంటే 1472 (147%) ఎకరాల్లో సాగుచేసేందుకు ముందుకు వచ్చారు. ముఖ్యంగా మామిడి, జామ, నిమ్మ, కొబ్బరి, డ్రాగన్ ప్రూట్ వంటి పంటలు పెంచేందుకు ఆసక్తీ కనబర్చారు. ఈ పథకానికి ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, చిన్న,సన్నకారు రైతులకు 90 శాతం సబ్సీడితో అందించనున్నారు.

29 Aug , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

డ్రాగన్ ఫ్రూట్- తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం !!

డ్రాగన్ ఫ్రూట్ పంటపై ఈమధ్య చాలా మంది రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకు ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉండటమే కాక అధిక హెల్త్ బెనిఫిట్స్ ఉండటం వల్ల ఈ డ్రాగన్ ఫ్రూట్స్ ను ప్రజలు తినడానికి ఇష్టపడుతున్నారు. తినేవారితో పాటు పండించే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఈ పంటను పండించడానికి ఎక్కువ నీరు అవసరం లేదు. పంట నిర్వహణ- ఫ్రూట్ ప్యాకింగ్, మార్కెటింగ్, ఎగుమతి కూడా చాలా సులభం. ఇలా సాగు ఖర్చు తక్కువ ఉండడంతో చాలా మంది రైతులు పండించడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.

28 Aug , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

విద్యుత్ ట్రాక్టర్ @ ఒకసారి ఛార్జ్ చేస్తే 4 గంటలు

సాగురంగంలో ఖర్చులు రోజురోజుకు పెరగటం, కూలీల లేమి సమస్యలతో రైతులు అవస్థలు పడుతున్నారు. అయితే పెద్దపల్లి జిల్లాకు చెందినా శసిరథ్ రెడ్డి డిజిల్ తో పనిచేసే ట్రాక్టర్ కి బదులు విద్యుత్ తో పనిచేసేలా పరిశోధనలు మొదలుపెట్టి నాలుగైదు లక్షల ఖర్చుతో 26 హెచ్ పి మోటారును బిగించి ట్రాక్టర్ ను తయారుచేశాడు. అయితే ఇందులో 32 లిథియం ఫాస్పేట్ బ్యాటరీలను అమర్చి, స్మార్ట్ కంట్రోలర్ ని బిగించాడు . ఈ బ్యాటరి పుల్ చార్జీ చేస్తే దాదాపు 4 గంటల పాటు పనిచేస్తుందని,డిజిల్ తో పోలిస్తే 10 రేట్లు ఖర్చును ఆధాన చేస్తుందంటున్నారు.


26 Aug , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🌱🌾 అన్నదాతలను కలవరపెడుతున్న తెగుళ్ళు !!

మునుపెన్నడూ లేనివిధంగా ఈ సారి తెగుళ్లు వ్యాపించాయి అనుకూలంగా లేని వర్షాల వల్ల ఇప్పటికే పెట్టుబడులు రెట్టింపు కాగా పురుగుల మందుకోసం ఖర్చు భారీగా పెరుగుతుంది.జూన్ లో వర్షభావం వలన సాగు ఆలస్యం కాగా ఆగస్టు లో మళ్ళీ వర్షాలు తగ్గాయి. ఈ మార్పుల తో పంటలకు చీడపీడలు పెరుగుతున్నాయి. *వరి లో కాండం తోలుచు పురుగు వ్యాపిస్తున్నట్లు వ్యవసాయ శాఖ వారు పేర్కొన్నారు ఇలా కొనసాగితే సరైన పోషకాలు అందక తెల్లకంకిగా మారి తాలు గింజలు ఏర్పడతాయి అన్నారు. *ప్రత్తి లో లేత కొమ్మల భాగల నుంచి రసాన్ని పీల్చు తున్నాయి మరియు కాండం పై బూజు ఏర్పడుతుంది. *మొక్కజొన్నకు కత్తెరపురుగు ఆకుల చివరి నుంచి కత్తిరిస్తూ తింటూ ఉంటుంది. *కంది పంటకు ఎండు తెగులు వ్యాపించి పూత రావడం లేదు. *మిర్చి లో లేత మొలకలు ఎండిపోగా ఇతర మొక్కలకు మొదళ్ల లో మచ్చలు ఏర్పడి వేర్లు కుళ్లిపోతున్నాయి.

23 Aug , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

జాతీయ గోపాల రత్న- 2023 అవార్డుల దరఖాస్తులు

జాతీయ పశుసంవర్ధక, పాడి, మత్స్య పరి శ్రమ శాఖ ఆన్లైన్ నామినేషన్లను ఆహ్వానిస్తోంది. వెబ్సైట్ ద్వారా ఈ నెల15 నుంచి వచ్చే నెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దేశీ పశుజాతుల పెంపకదారులకు, పాడి రైతులకు స్థిరమైన జీవనోపాధిని అందించేందుకు ప్రభుత్వం 3 విభాగాల్లో ఈ పురస్కారాలను అందిస్తోంది. ప్రతి విభాగంలో మూడు అవార్డులతో పాటు రూ.5, రూ.3, రూ.2 లక్షల నగదు బహుమతులు ఇస్తారు. నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవం రోజు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. గుర్తింపు పొందిన దేశీ గోజాతులు (ఏపీ- ఒంగోలు, పుంగనూరు, మోటు, తెలంగాణ- పొడతూర్పు), గేదెలను శ్రద్ధగా పెంచి పోషించే రైతులు. ఉత్తమ సేవలందిస్తున్న డెయిరీ సహకార సంఘం లేదా పాల ఉత్పత్తిదారులు కంపెనీ లేదా పాడి రైతు ఉత్పత్తిదారుల సంస్థలు. ఉత్తమ సాంకేతిక నిపు సేవలందిస్తున్న కృత్రిమ గర్భధారణలు ఈ పురస్కారాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ప్రమాణాలు, నామినేషన్ ఆన్లైన్ ప్రక్రియ గురించి మరిన్ని వివ రాల కోసం https://awards.gov.in లేదా https://dahd.nic.in వెబ్సైట్లను చూడొచ్చు.

22 Aug , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రోజుకు 240 గ్రాముల కూరగాయలు తినాలి.

ICRISAT లోని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ 50వ వార్షికోత్సవంలో అంతర్జాతీయ కూరగాయల పరిశోధన కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మార్కోవో పేరీస్ పాల్గొన్నారు. ఆయన రైతులకు కూరగాయలు పండించే విధానాన్ని వివరించారు. కూరగాయలు ఎంత తీసుకోవాలి, నిత్యం కూరగాయలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటారని, ఒక మనిషి నిత్యం 240 గ్రాముల కూరగాయలను ఆహారంగా తీసుకోవా లి. భారత్లో కేవలం 145 గ్రాములే తీసుకుంటున్నారని అన్నారు. కూరగాయల సాగులో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం వల్ల అవి తిన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. కూరగాయలు, పండ్లపై మరింత పరిశోధన జరగాలన్నారు.


21 Aug , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఉద్యాన పంట సాగులో అనంతపురం టాప్ తక్కువ ధరకే పండ్లు ,కూరగాయలు!!

అత్యల్ప వర్షపాతం తో నమోదయ్యే ప్రాంతంగా నిలిచింది అనంతపురం .ఈ ప్రాంతం లో బత్తాయి, డ్రాగన్ పండ్లు,అంజూర్,దానిమ్మ పండ్లు గ్రాండ్9 అరటి గెలలు మరియు ఖర్జూర పండ్లను పండిస్తున్నారు.తక్కువ నీటి తో అధిక దిగుబడినిచ్చే పంటలు రైతులకు మంచి ఆదాయ వనరుగా మారాయి.ఈ జిల్లా లో పండించే కూరగాయలు రుచికి నాణ్యతకు కూడా పేర్కొన్నవి.టమాట,పచ్చి మిరప,బెండకాయలు,ఎండు మిర్చి మొదలగు పంటలు సరసమైన ధరలకు లభిస్తుండటం తో కొనుగోలుదారులకు ,రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఈ ఉద్యాన పంట ఉత్పత్తులను విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు.రాష్ట్రం లో అన్ని పండ్లను పండించే జిల్లాల్లో మొదటిస్థానం లో నిలిచింది .ఈ తరహా పంటలు రైతులకు లాభదాయకంగా ఉంటుంది.

21 Aug , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఈ నెల 25 నుంచి 27 వరకు ఇండియాలో అతిపెద్ద అగ్రిటెక్ ఎక్స్ పో !!

బెంగళూరులోని BIECలో మూడు రోజులపాటు 14వ ఎడిషన్ అగ్రిటెక్ ఇండియా 2023 అతిపెద్ద అగ్రి ఎక్స్ పో జరుగనుందని, ఇందులో వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, వ్యవసాయ డ్రోన్లు, విత్తనాలు, వ్యవసాయ రసాయనం, గ్రీన్ హౌస్, హైడ్రోపోనిక్స్, పరికరాల సరఫరాదారులు ఒకే వేదికపై చూడవచ్చని. 20కి పైగా దేశాల నుండి వందలాది మంది ఎగ్జిబిటర్లు పాల్గొనున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

21 Aug , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మిల్లెట్స్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ !!

ఆంధ్రప్రదేశ్ చిరుధాన్యాల దిగుబడిలో మొదటిగా మరియు ఎగుమతుల్లో ఏడవ స్థానంలో నిలిచిందని నాబార్డు నివేదికలు విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సాహం ధాన్యాలను డిమాండ్ ఆధారంగా దేశీయ, అంతర్జా తీయ మార్కెట్కు ఎగుమతి చేయటంతో పాటు రాష్ట్ర స్థాయిలో పాఠశాలలు, హాస్టళ్లలో పోషకాహారం కింద వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ప్రపంచ మార్కెట్లలో భారతీయ మిల్లెట్లను ప్రోత్సహించడానికి స్టార్టప్లు, అకడమిక్ రీసెర్చ్ సంస్థలు, భారతీయ మిషన్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, ఎగుమతిదారులతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, ప్రత్యేకంగా ఎగుమతి ప్రమోషన్ ఫోరమ్ (ఈపీఎఫ్) ను ఏర్పాటు చేసినట్లు కూడా తెలిపింది. ఐక్యరాజ్యసమితి 2023 ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఏడాది పొడుగునా వీటి ఉత్పత్తితో పాటు వినియోగం పెంచేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణ పై దృష్టి కొనసాగించాలని, చిరుధాన్యాల సాగులో జొన్నలు, సజ్జలను అధికంగా పండిస్తుండ గా సామలు, అరిక, రాగులు, కొర్రలు, వరిగ, ఊద ధాన్యాల సాగు విస్తీర్ణాన్ని కూడా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.