12 Oct , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పత్తి కొనుగోళ్లకు సీసీఐ సిద్దం !!

ఈ వానాకాలం సీజన్‌లో పండించిన పత్తిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వ కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) సంస్థ సిద్ధమైంది. పత్తి కొనుగోలుకు మార్కెటింగ్‌ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సీజన్‌లో 1.09 లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశారు. దాదాపు 10 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో 23 జిన్నింగ్‌ మిల్లులున్న 9 చోట్ల కాటన్‌ సీసీఐ ద్వారా ఈ నెల చివరి వారం నుంచి కొనుగోళ్లు చేపట్టనున్నది. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.7,020గా ప్రకటించింది. అయితే తక్కువ ధరకు దళారులకు అమ్మి మోసపోవద్దని, సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని అధికారులు పత్తి రైతులకు సూచిస్తున్నారు.

09 Oct , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పండ్ల పై స్టిక్కర్లు ఎందుకు అతికిస్తారు ?

మనం పండ్లు కొనే సమయంలో వాటిపై స్టిక్కర్లు ఉండటం గమనిస్తూ ఉంటారు. అసలు స్టిక్కర్లను ఎందుకు అతికిస్తారు అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అయితే ఆ స్టిక్కర్ల ద్వారా ఆ పండును ఏ విధంగా పండించారో మనం సులభంగా తెలుసుకోవచ్చు. 3 లేదా 4 నంబర్ తో మొదలైన స్టిక్కర్ సహజసిద్ధమైన ఎరువులు మరియు కెమికల్స్ సహాయంతో రెండు విధాలుగా పండించిన పండ్లకు మాత్రమే వేస్తారు. ఒకవేళ పండ్లపై ఉన్న స్టిక్కర్ 9 అనే నంబర్ తో మొదలు పెడితే వాటిని సహజసిద్ధంగా పండించారని అర్థం చేసుకోవాలి. సేంద్రీయ ఎరువులతో సహజసిద్ధంగా పండించినవి కావున ఇలాంటి పండ్లను తినడం మంచిది. పండ్లపై ఉన్న స్టిక్కర్ పై సంఖ్య 8 అనే నంబర్ తో మొదలైతే మాత్రం జన్యు మార్పిడి ద్వారా ఆ పండ్లను పండించారని అర్థం చేసుకోవాలి.అలాంటి పండ్లను తినకపోవడమే మంచిది.

03 Oct , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలంగాణకు పసుపు బోర్డు !!

దేశంలో పండే పసుపులో సుమారు 70 శాతం నిజామాబాద్ ప్రాంతంలోనే పండుతుంది. అందుకే పసుపుకు ప్రత్యేకంగా బోర్డు కావాలని సుమారు నాలుగు దశబ్దాలుగా రైతులు వివిధ రూపాల్లో పోరాటాలు, నిరసనలు చేశారు. ఎట్టకేలకు తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ గారు పసుపు బోర్డు (Turmeric Board) మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడ బోర్డును ఏర్పాటు చేస్తే ఆ సంస్థ కేవలం పసుపుపైనే దృష్టి పెడుతుంది. లేదంటే సలహాలు, సూచనలు, పరిశోధనల కోసం రైతులు స్పైసెస్ బోర్డుపైనే ఆధారపడాల్సి ఉండేది అని, పసుపు బోర్డు ప్రకటనతో తెలంగాణ రైతులకు శుభవార్త తేలింది. దీంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పసుపు రైతుల సంబరాలు అంబారాన్ని అంటాయి.

21 Sep , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఒక్క ఉల్లిపాయ 9 కిలోలు - వరల్డ్ రికార్డ్ !!

సాధారణంగా, ఉల్లిపాయలు 100 గ్రాముల నుండి 200 గ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. మహాఅయితే అరకిలో వరకు ఉంటాయి. అలాంటిది ఏకంగా ఒక రైతు 9 కేజీల బరువు ఉన్న ఉల్లిపాయను పండించాడు. ఆ ఉల్లిపాయ బరువు సుమారుగా 8.9 కిలోలు ఉంది. ఇక దాని పొడవు విషయానికి వస్తే 21 అంగుళాలు ఉంటుంది. ఈ ఉల్లిగడ్డ ఏకంగా రికార్డును సృష్టించింది. యూనిటైడ్ కింగ్ డమ్ లోని గ్వెర్న్సే ప్రాంతానికి చెందిన గారెత్ గ్రిఫిన్ అనే ఒక రైతు ఎన్నో సంవత్సరాలుగా పంటలు పండిస్తున్నాడు. ఈ రైతు ఉల్లిపాయను పండించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంచలనం సృష్టించాడు. 12 ఏళ్లు కష్టపడి ఎట్టకేలకు ఇటీవల ఓ భారీ ఉల్లిపాయను పండించాడు. దీనిని ఆయన ఆరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షోలో ప్రదర్శించారు.


14 Sep , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలంగాణలో పొల్లు పొల్లు వర్షాలు☔⛈️

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న మూడు రోజులు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో మోతాదుకు మించి వర్షాలు కురిసే అవకాశముందని, రైతులు ఆధిక వర్షాలకు తమ పంటలను నష్టపోకుండా నీరు బయటకు పొయేట్లు ఏర్పాటు చేసుకొవాలి. అలాగే సోయా, పెసర, మినుము వంటి పంటలు కొత దశలో తగు జాగ్రత్తలు తీసుకొవాలి. మరింత సమాచారం కొసం నాపంట యాప్ నీ వీక్షించండి.

13 Sep , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు !!

రాష్ట్రంలో 2.18 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని, రైతులు అధిక ధరలు చెల్లించి వ్యాపారుల వద్ద కొనుగోలు చేయవద్దని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ప్రైవేటు డీలర్ల వద్ద 90 వేల టన్నులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద 41 వేల టన్నులు, మార్క్ ఫెడ్ వద్ద 81 వేల టన్నులు, కంపెనీ గోదాముల్లో 6 వేలటన్నుల వరకు నిల్వలు ఉన్నాయన్నారు. అలాగే రాబోయే నాలుగు రోజులలో మరో 18వేల టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందని వ్యవసాయశాఖ మంత్రి వివరించారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.

12 Sep , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కోరాపుట్ కలజీర బియ్యానికి GI గుర్తింపు !!

సువాసన మరియు పోషక విలువలకు ప్రసిద్ది చెందిన ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలోని పత్రపుట్, పూజారిపుట్ మరియు మొహులి ప్రాంతల్లో సాగుచేసే ‘కోరాపుట్ కళజిర రైస్’ కి ఇటివల GI గుర్తింపు లభించింది. ఈ బియ్యంలోని ఔషద నాణ్యత జ్జాపకశక్తిని పెంపొందిస్తుందని, అలాగే మధుమేహాన్ని తగ్గిస్తుందని, హిమోగ్లోబిన్ స్థాయిలను మరియు శరీరం యొక్క జీవక్రియను పెంచుతుంది. ఈ బియ్యం గింజలు నల్ల జిలకర గింజలవలే కనిపిస్తాయి.


06 Sep , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వర్షాలకు పత్తిలో చేపట్టాల్సిన చర్యలు !!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సాగు అయ్యే పత్తి వర్షాభావ పరిస్థితుల వలన పంట బెట్టకు వచ్చింది. పత్తి పంట ప్రస్తుతం పూత దశ నుంచి కాయ పక్వానికి వచ్చే దశలో ఉంది. 1. బెట్ట పరిస్థితుల నుంచి పంటను కాపాడుకోవడానికి చేపట్టాల్సిన చర్యలు 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13.0.45) లేదా 20 గ్రాముల యూరియాను లీటరు నీటిలో కలుపుకొని - వారం వ్యవధిలో రెండుసార్లు పంటపై పైపాటుగా పిచికారీ చేసుకోవాలి. 2. తెగులు (ఆకులు) ఎర్రబడటం కనిపిస్తే 10 గ్రాముల పొటాషియం నైట్రేట్ (13, 0, 45) తోపాటు 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ను లీటరు నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. మొదటి పిచికారీ చేసిన నాలుగు రోజుల తర్వాత ఐదు గ్రాముల సూక్ష్మపోషకాల మిశ్రమం (ఫార్ములా 4) ను లీటరు నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారి చేసుకోవాలి. 3. బెట్టితో పూత ఎండిపోయి రాలినట్లు గమనిస్తే లీటరు నీటికి 1.5 గ్రాముల బోరాక్స్ ను కలుపుకొని వారం వ్యవధిలో పైపాటుగా రెండుసార్లు పిచికారీ చేసుకోవాలి. ఇది కాయ వృద్ధికి తోడ్పడుతుంది.

04 Sep , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మట్టి అరటికి జియో ట్యాగ్ !!

కన్యాకుమారి జిల్లాకు చెందిన మట్టి అరటి రకానికి ఇటీవల భైగోళిక సూచిక ట్యాగ్ లభించింది. మట్టి అరటిలో ఆరు రకాలుగా ఉన్నాయని ఇవి కన్యాకుమారికి చెందినవని వీటిని బేబి అరటి అని కూడా పిలుస్తారు ముఖ్యంగా కల్కులం మరియు విలవం కోడ్ తాలూకాలో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. దీనిని శిశువు ఆహారంగా పిలుస్తారు. ఇందులో తక్కువ మొత్తంలో కలిగే ఘన పదార్థాల కంటెంట్ (TSSC) ఉంటుంది. ఈజిఐ ట్యాగ్ 10 సంవత్సరాల వరకు చెల్లుబాటులో ఉంటుంది.

02 Sep , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రాబోయే రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు!!

ప్రస్తుతం దక్షిణ మధ్య అరేబియా సముద్రంలో ఒక బలమైన అల్పపీడనం ఏర్పడింది. ఇది అరేబియాలోని తేమను కర్ణాటక, కేరళ మీదుగా మన వైపుగా నెడుతుండం వలన, అదే సమయంలో పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒక ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం ఈ నెల 4/5 తారీఖు కల్లా బలమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ రెండిటి వలన ఉభయ తెలుగు రాష్ట్రాల రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 2,3,4,5,6,7,8,9 తారీఖులలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల అతి భారీ వర్షాల కు అవకాశం వుంది.