02 Dec , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తుఫాన్ అలెర్ట్ ! వాతావరణ హెచ్చరిక !!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శక్తివంతమైన తుఫాన్‌గా మారే ప్రమాదం ఉంది. పసిఫిక్‌ సముద్రం మీదుగా వచ్చే తూర్పుగాలుల ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మంచి వర్షపాతం నమోదవుతోంది. రానున్న రోజుల్లో సముద్రతీరంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కావున ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని, వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున కోతలలో కొనుగోళ్ల సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. త్వరగా కోతకు వచ్చే శనగ, మినుము, మొక్క జొన్న పంటలను త్వరగా కోతలు ముగించుకొగలరు. వచ్చే 3, 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు కురిసే ఈ వర్షాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

28 Nov , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పరిమళ పంటతో – సిరుల వర్షం !!

రైతులు ఒకే రకం పంటలకన్న వినూత్నంగా డిమాండ్ ఉన్న పంటలవైపు మక్కువ చూపితే లాభాలు సాదించవచ్చు. అలాంటి పంటే - జెరీనియం ఇది ఒక సుగంధ మొక్క, ఈ చెట్టు నుంచి నూనెను ఉత్పత్తి చేస్తారు. దీన్ని మెడిసిన్, కాస్మోటిక్స్, ఫార్మాసూటికల్ రంగాల్లో సువాసనగల సబ్బులలో ఉపయోగిస్తారు. మార్కెట్‌లో జెరేనియం ఆయిల్‌ ధర లీటరుకు రూ. 10 వేల నుంచి రూ. 16 వేల వరకు పలుకుతోంది. పంట వేసిన నాలుగు నెలల నుంచి దిగుబడి వస్తుంది. ఎకరానికి 10-12 టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కోతకోతకు దిగుబడి పెరిగే ప్రత్యేకత మరియు తెలుగు రాష్ట్రాలలో పంట సాగుకు అనుకూలం. చీడపిడల బెడద కుడా తక్కువే, సేంద్రియ ఎరువులతో సాగుచేసి సిరులను పండించవచ్చు. మొక్కల కొరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో CSIR-CIMAP ఆరోమా మిషన్లో భాగంగా ఈ మొక్కలను అందిస్తారు. రైతులకు ప్రోత్సాహంగా సాగు మరియు కోతవాటి కొరకు నర్సరీ తయారు చేయాడం శిక్షణ ఇస్తారు.

25 Nov , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతుల ఖాతాల్లోకి - 2023 రబీకి రైతు బంధు !!

తెలంగాణ ప్రభుత్వం ద్వారా 2023 రబీకి రైతు బంధు సహాయాన్ని పంపిణీ చేయడం ప్రారంభిస్తున్నట్లు తెలియజేస్తుంది. అక్టోబర్ 5, 2018 నాటి ECT దిశలో నిర్దేశించిన షరతులకు అనుగుణంగా 24 నవంబర్, 2023 నుండి తెలంగాణ రైతు బంధు సహాయాన్ని పంపిణీ చేయడానికి కమిషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

24 Nov , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

సులభతరంగా RAWE ప్రోగ్రాం చేస్తున్న విద్యార్దులు !!

అగ్రికల్చర్ BSc చదివే విద్యార్థులకు RAWE ప్రోగ్రాం అత్యంత ముఖ్యమైనది. విద్యార్దులు ఈ ప్రోగ్రాం లో అనేక సవాళ్లు మరియు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నాపంట స్మార్ట్ కిసాన్ అగ్రీ యాప్ ఈ RAWE ప్రోగ్రాంని సులభతరం చేసింది. మల్లారెడ్డి విశ్వవిద్యాలయం అగ్రికల్చర్ BSc చదివే 400 పైగా విద్యార్థులు నాపంట సహకారంతో గడ్డిపల్లి, రామగిరిఖిల్లా, మమ్నూర్, యాగంటిపల్లె, తునికి, జమ్మికుంట, వనపర్తి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా చుట్టుపక్కల గ్రామాలలో వివిధ వ్యవసాయ పనులను దగ్గరుండి నేర్చుకుంటూ రైతులకు సలహాలు, సూచనలు, నూతన సాగు విధానాలను వివిధ ప్రదర్శనల ద్వారా తెలియజేస్తున్నారు.


20 Nov , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

సి.సి.ఐ. ద్వారా పత్తి అమ్ముటకు ఆధార్ అనుసందానం తప్పనిసరి!!

సి.సి.ఐ. (C.C.I.) ద్వారా పత్తి అమ్ముటకు ఆధార్ అనుసందానం , OTP తప్పనిసరి చేసింది. కావునా పత్తి రైతులు మీ ఆదార్ తో అనుసందానం అయిన బ్యాంక్ ను ఈ కింది వెబ్ సైట్ లో లింక్ ద్వారా చెక్ చేసుకుని బ్యాంక్ యాక్టివ్ గా ఉన్నదా, లేదా చెక్ చేసుకోవచ్చు. తద్వారా మీ బ్యాంక్ ఖాతా Inactive గా ఉంటే Active చేసుకోవాలి లేదా మీ పేరు మీద వాడుకలో ఉన్న ఇతర బ్యాంక్ ఖాతాను ఆదార్ తో అనుసందానం చేసుకోవడం వలన C.C.I. వారు పత్తి కొనుగోలు చెల్లింపులు ఆ బ్యాంకు ఖాతాకు చెల్లిస్తారు. ఈ క్రింది లింక్ ద్వారా ఆధార్ అనుసందానం అయిన బ్యాంక్ వివరాలు తెలుసుకోండి (https://dbtbharat.gov.in/) లేదా (https://myaadhaar.uidai.gov.in/)

16 Nov , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కేంద్రం గుడ్ న్యూస్ - ఎర్ర చందనంపై ఆంక్షలు ఎత్తివేత

ఎర్ర చందనం అత్యంత విలువైన కలప. దీనిని ఎర్ర బంగారం అని కూడా అంటారు. ఆంద్రప్రదేశ్ లో మాత్రమే పెరిగే ఈ ఎర్ర చందనంకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. దాదాపు గత 20 ఏళ్లుగా రివ్యూ ఆఫ్ సిగ్నిఫికెంట్ ట్రేడ్ ప్రాసెస్‌లో ఉంది, ఎన్నో అనుమతులు తీసుకుంటే తప్ప సాగు కోసం మరియు ఎగుమతి కోసం అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఎర్ర చందనం పై ఉన్న ఆంక్షలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి ఎర్ర చందనం పెంపకంతో పాటు ఎగుమతులపై ఆంక్షలను తొలగిస్తున్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు.

09 Nov , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వరికి కనీస మద్దతు ధర నిర్ణయించిన ప్రభుత్వం..!

ఖరీఫ్ సీజన్లో కృష్ణా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు కామన్ రకం వరికి క్వింటాకు కనీస మద్దతు ధర రూ.2,183గా,గ్రేడ్-A రకానికి క్వింటాకు రూ.2,203గా నిర్ణయించామని JC అపరాజితాసింగ్ తెలిపారు. ఈ నెల 14 నుంచి ధాన్యం కొనుగోలుకై జిల్లాలోని 317 రైతు భరోసా కేంద్రాలను సిద్ధం చేశామని ఆమె స్పష్టం చేశారు.


03 Nov , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రానున్నా రోజుల్లో అక్కడక్కడ జల్లులు !!

భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో తూర్పు మరియు ఈశాన్య గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడిన నేపథ్యంలో గురువారం నాటి తాజా పరిణామం ఫలితంగా ఈ ప్రకటన చేసింది. రానున్న రోజుల్లో ఉత్తర కోస్తా, రాయలసీమ, దక్షిణ కోస్తాలో మరియు తెలంగాణ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ మరింత వివరించింది. గత రెండు రోజులుగా, అనేక జిల్లాలు వివిధ స్థాయిలలో వర్షపాతాన్ని చవిచూశాయి, ఈ వాతావరణ నమూనా నెల మొత్తం కొనసాగుతుందో లేదో అనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

30 Oct , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పెరిగిన ఉల్లిపాయ ధరలు !!

మొన్నటి వరకు టమోటా ధరలు భారీగా పెరిగి సామాన్యులకు చుక్కలు చూపించాయి. ప్రస్తుతం ఉల్లిపాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్ నగరంలో, ఉల్లిపాయల ప్రస్తుత మార్కెట్ ధర కిలో 70 నుండి 100 రూపాయలుగా ఉంది. ఖరీఫ్‌ పంటలు మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే వరకు ధరలు తగ్గే ఛాన్స్ లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇది ఇలా ఉంటే రైతుకు మాత్రం ఈ ధరలకి గిట్టుబాటు అవ్వట్లేదు.

14 Oct , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ప్రస్తుత సీజన్ వానాకాలమా ? ఎండకాలమా !!!

మండుతున్న ఎండలు ప్రస్తుత సీజన్ వానాకాలమా ? ఎండకాలమా అనిపించేలా ఉష్ణోగ్రత ఉంటుంది . రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవాలి లేదా చల్లటి వాతావరణం ఉండాలి. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విచిత్ర వాతావరణం కనిపిస్తుంది. చాలాచోట్ల ఎండ వేడి, ఉక్కపోత. మరికొన్నిచోట్ల చదురుమదురు వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల సీజన్లో వేడి పెరగడానికి కారణాలు సర్వసాధారణమే అంటున్నారు నిపుణులు. కాకపోతే ఈసారి భిన్న పరిస్థితులు ఎండలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడానికి వాయువ్య దిశ నుంచి వస్తున్న గాలులు పొడి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. నవంబర్‌ 2వ వారం నుంచి రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పింది..దీనికి తోడు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ప్రభావం కూడా ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు.