27 Jan , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఈ ఏడాది కూడా బాటసింగారం లోనే మామిడి మార్కెట్ !!

మామిడి కొనుగోళ్లు విక్రయాలు ఈ ఏడాది కూడా కొహెడలో కాకుండా బాటసింగారంలోనే నిర్వహించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. దినికోసం బాటసింగారం మార్కెట్లో అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బాటసింగారం మార్కెట్ స్థలం సరిపోనందున గత ఏడాది మాదిరిగానే మార్కెట్ పక్కన ఉన్న స్థలాన్ని అద్దెకు తీసుకుని తాత్కలిక షెడ్లు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్ అధికారులకు ఆదేశించింది. ఫిబ్రవరి నెలా ఖరులోగా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. కానీ రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు మాత్రం సరైన సౌకర్యాలు లేనందున్న ఆసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

25 Jan , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

హైదరాబాద్ లో అతిపెద్ద కిసాన్ అగ్రి షో !!

హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా ఫెబ్రవరి 1- తేదీ నుంచి 3వ తేదీ వరకు ఈ షో జరగనున్నది. ఇప్పటికే ఈ అగ్రి షో చాలా సార్లు విజయవంతం కాగా, ఈ వ్యవసాయ పరిశ్రమకు చెందిన ఎందరో నిపుణులు, విధాన నిర్ణేతలు మరియు రైతులను ఉమ్మడి వేదికపైకి తీసుకురావడానికి ఉద్దేశించబడింది. వారు ఒకరితో ఒకరు సంభాషించడానికి మరియు వ్యవసాయ రంగంలో కొత్త పురోగతిని అన్వేషించడానికి మరియు మీ సంస్థ ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించవచ్చు. దీనిలో రైతులు మూడు రోజుల పాటు ప్రదర్శనను సందర్శించవచ్చు. కిసాన్ షోలో వ్యవసాయ యంత్రాలు , నీరు & నీటిపారుదల టూల్స్ & ఇంప్లిమెంట్స్ స్టార్టప్‌లు, ట్రాక్టర్లు, ప్లాస్టికల్చర్, కాంట్రాక్టు వ్యవసాయం, అగ్రి ఇన్‌పుట్‌లు, మొబైల్ యాప్‌లు ఇతర వ్యవసాయ నూతన ఆవిష్కరణలను చూడవచ్చు.

25 Jan , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం !!

నూనె పంటలను పెంచడమే లక్ష్యంగా సాగుతున్న ఉద్యాన శాఖ, రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లోని 8.14 లక్షల ఎకరాల్లో 1,62,800 మంది రైతులకు ఎకరానికి రూ. 1.20 లక్షల సాగుకు రుణసాయం అందించాలని కేంద్రం రాష్ట్రంలోని బ్యాంకులను ఆదేశించింది. రానున్న రోజుల్లో 80 లక్షల టన్నుల వరకు దిగుబడలు రాగా, వీటి నుంచి 14.80 లక్షల టన్నుల నూనె తయారవుతుందని, దీంతో దాదాపు 10,360 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని వెల్లడించింది. రానున్న రోజుల్లో మరింత సాగు విస్తర్ణం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

28 Dec , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

బయోచార్ తయారి, ఉపయోగాల పై చర్చాగోష్టి !!

నేల సారాన్ని పెంచడానికి వాడే కట్టె బొగ్గును బయోచార్ అంటారు. బయోచార్ను పశువుల ఎరువు లేదా కంపోస్టుతో కలిపి పంటలకు వేసుకుంటే జీవవైవిధ్యాన్ని కొనసాగిస్తూ పంట దిగుబడిని పెంచడానికి సహాయపడింది మరియు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. అవసరమైననే బయోచార్ను రైతులు తయారు చేసుకోవడం మరియు వాడడం పై ఈ నెల 29న అనంతపురం జిల్లా గోరం ట్లకు సమీపంలోని పూల చెట్లపల్లి లోని టుడుటు ఫామ్స్ క్షేత్ర సంద ర్శన, రైతులు, నిపుణులతో చర్చాగోష్టి జరగనుంది. దీనిలో ప్రముఖ బయోచార్ నిపుణులు డా. నక్కా సాయిభాస్కర్రెడ్డి తదితరులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29 (శుక్రవారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్ర సందర్శన, చర్చాగోష్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆసక్తిగల రైతులు, ఔత్సాహిక వ్యవ సాయ పట్టభద్రులు ముందుగా పేర్లు నమోదు చేయించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు, రిజిస్ట్రేషన్ కోసం 95022 93343 నంబరును సంప్రదించండి.


27 Dec , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పెరిగిపోతున్న బియ్యం ధరలు !!

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతుల పై నిషేధం విధించింది. దేశంలో బియ్యం ధరలు రకాలతో సంబంధం లేకుండా అన్ని రకాల బియ్యం ధరలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ ,కర్ణాటక వరి విస్తీర్ణం తగ్గడం మరియు ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో తుఫాన్ ప్రభావం వలన పంట దెబ్బ తినడంతో దిగుబడి తగ్గడం వలన సన్న బియ్యం ధరలు బారిగా పెరిగాయి రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది.

20 Dec , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

చిరుధాన్యాలు మరియు ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు సదస్సు !!

రైతుకోసం తానా మరియు రైతునేస్తం ఫౌండేషన్‌ సంయుక్త నిర్వహణలో 2023 డిసెంబర్‌ 31వ తేదీ (ఆదివారం) ఉ. 10:00 గంటల నుండి సా. 4:00 గం.ల వరకు రైతునేస్తం ఫౌండేషన్‌ ఆవరణ, కొర్నెపాడు, పుల్లడిగుంట దగ్గర, గుంటూరు నందు చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, చిరుధాన్యాల సాగు, ఔషధ మొక్కల సాగు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడును. ఆధునిక ఆహారపు అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు, వ్యాధులకు కారణమౌతున్నందున ఈ సమస్యకు పరిష్కారంగా సేంద్రియ వ్యవసాయ విధానంలో పండించిన చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు వంటి దేశీయ ఆహారమైన చిరుధాన్యాల వాడకంతో ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై పద్మశ్రీ పురస్కార గ్రహీత, కృషిరత్న, స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌ వలి గారు అవగాహన కల్పిస్తారు. అలాగే చిరుధాన్యాల సాగు, ప్రకృతి వ్యవసాయంపై కూడా అవగాహన కల్పించబడును. ఔషధ మొక్కల సాగు, వాడకంపై రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని రాయపూర్‌లోగల మెడిసినల్‌ ప్లాంట్స్‌ బోర్డ్‌ CEO శ్రీ జె.ఎ. చంద్రశేఖర ‌రావు పాల్గొని అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. యంత్రపరికరాల ప్రదర్శనతోపాటు దేశీయ విత్తనాల స్టాల్స్‌ ఏర్పాటు చేయబడును. ఒక్కో రైతుకు ఒక కిలో కొర్ర విత్తనాలు ఉచితంగా అందజేయబడును. ఔషధ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయబడును. మధ్యాహ్నం millets ఉచిత భోజనం కలదు. మరిన్ని వివరాలకు 97053 83666; 70939 73999 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించగలరు.

14 Dec , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

భారత దేశంలో నిషేదించబడిన సస్యరక్షణ మందులు !!

పంటల దిగుబడులను పెంచడానికి పంటలకు ఆశించే చీడపీడల నుంచి రక్షించడం తప్పనిసరి. అనేక పంటలలో సుమారుగా 15–20% వరకు పంట నష్టం కేవలం చీడపీడల వలన కలుగుతుంది. రైతులు చీడపీడల నుండి పంటలను కాపాడుకోవడానికి ఎక్కువగా సస్యరక్షణ రసాయన మందులను వాడుతున్నారు. సుమారుగా 60-65% కీటకనాశినుల వాడకంగా నమోదు చేయబడినది. అయితే, మానవాళి మరియు జీవరాశులకు హాని కలిగించే అత్యంత ప్రమాదకరమైన నాలుగు సస్యరక్షణ మందుల వాడకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ నెం. యస్.ఓ. 4294(ఇ) ప్రకారం 4 మందుల వాడకం విషేదించడమైనది. 1.డైకోఫాల్, 2.డైనోకాప్, 3.మిథోమిల్, 4.మోనోక్రోటోఫాస్ మందుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ అక్టోబర్ 6, 2023 పురుగుమందుల (నిషేధం) ఆర్డర్ను కేంద్ర ప్రభుత్వం ప్రచురించడం జరిగింది. మోనోక్రోటోఫాస్ 36% ఎస్ ఎల్ మందును ప్రస్తుతం ఉన్న స్టాక్ క్లియర్ చేసుకొనేందుకు నిల్వల గడువు కాలం ముగిసే వరకు మాత్రమే అమ్మకాలు పంపిణీ, వినియోగానికి అనుమతి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.


13 Dec , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

స్కూల్ లో పండించిన కూరగాయలతో మద్యాహ్న భోజనం

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం ఖోడద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుల బృందం కలిసి సాగుబడి గా మార్చారు. ఓ వైపు పాఠాలు బోధిస్తూనే.. మరోవైపు కూరగాయల సాగుపై దృష్టి పెట్టారు. ఇక్కడ 19 రకాల కూరగాయలను ఎలాంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. గ్రామంలో తడి, పొడి చెత్తను సేకరించి తయారు చేసిన వర్మి కంపోస్టును సాగుకు వినియోగిస్తున్నారు. దీనితో విద్యార్దులకు వ్యవసాయంపై అవగాహాన కల్పిస్తున్నారు. పండిన తాజా ఆకు కూరలు, కూరగాయలను మధ్యాహ్న భోజనానికి వాడుతున్నారు. విద్యార్థులకు రోజుకో రకమైన వంటకాన్ని అందిస్తున్నారు. కొద్దిపాటి పెట్టుబడితో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుండగా, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

12 Dec , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

నేటి నుండి రైతు బందు నిధులు విడుదల

రైతుల ఖాతాల్లో నేటి నుండి రైతు బంధు డబ్బులు జమ కాబోతున్నాయి. ఎన్నికలకు ముందు నిలిచిపోయిన రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను వారి ఖాతాల్లో జమచేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించాలన్నారు. ప్రస్తుతం ఎకరానికి 5000/- ఇవ్వనున్నారు. అదేవిధంగా రుణ మాఫీపై కార్యాచరణ రూపొందించాలన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల మేరకు రుణ మాఫీ చేసేందుకై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు.

05 Dec , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🚨తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ అలర్ట్ !!

తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ అలర్ట్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని మిచౌంగ్‌ తుఫాన్ ప్రభావంతో వర్షాల ముప్పు పొంచి ఉంది. ఈ తుఫాన్ ప్రభావంతో తెలంగాణ ఈశాన్య జిల్లాల్లోని అనేక ప్రాంతాలకు ఇప్పటికే రెడ్‌, ఆరెంజ్‌ ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు రెడ్‌. మహబూబాబాద్‌, నల్గొండ, సూర్యాపేట,హనుమకొండ, వరంగల్‌కు ఆరెంజ్ మరియు జనగామ, భూపాలపల్లి, భువనగిరి, పెద్దపల్లి జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.