12 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతుని పెళ్లి చేసుకుంటే 5 లక్షల బహుమతి ఇవ్వాలి

పెళ్లి చేసుకోవడానికి పొలం కావాలి కాని పొలం దున్నే రైతును మాత్రం పెళ్లి చేసుకోవడానికి యువతులు వెనకడుగు వేస్తున్నారు. తల్లి తండ్రులు సైతం పిల్లను ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు. 45 సంవత్సరాలు వచ్చినా రైతులకు పెళ్ళిళ్ళు కావట్లేదని కర్ణాటకా రైతులు CM దృష్టికి తీసుకెళ్ళారు. రైతు రుణమాఫితో పాటు రైతును పెళ్లి చేసుకునే యువతికి 5 లక్షలు బహుమతిగా ఇవ్వమని కోరారు.

12 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఈ ఏడాది ఆశాజనకంగా వర్షాలు !!

నైరుతి రుతుపవనాల సీజన్‌ ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిఫిక్‌ మహాసముద్రంలో గతేడాది నుంచి కొనసాగుతూ, ప్రస్తుతం బలంగా ఉన్న ఎల్‌నినో క్రమేపీ బలహీనపడనుంది. ఆగస్టు నాటికి లానినా ఏర్పడి వచ్చే జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు గతేడాది సీజన్‌లో కంటే మెరుగైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈసారి నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయానికి వచ్చి, మంచి వర్షాన్ని ఇచ్చినా... వేసవి తీవ్రత మాత్రం కొనసాగుతుందన్నారు.

10 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులకు మద్దతుగా ఫిబ్రవరి 16న భారత్ బంద్ !!

రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఫిబ్రవరి 16వ తేదీన రైతు సంఘాలు భారత్ బందుకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే దుకాణదారులు స్వచ్ఛందంగా షాపులు మూసేయాలని, ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు భారత్ బందుకు సహకరించాలని రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న తమ డిమాండ్ల పరిష్కారం కోసం దేశంలోని అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని కోరారు !!

10 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

హరిత విప్లవ పితామహుడుకి భారతరత్న!!

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త యం.యస్.స్వామినాధన్ భారత వ్యవసాయం మరియు రైతుల సంక్షేమానికి చేసిన అసమానమైన కృషికి ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 9న ప్రకటించారు. వ్యవసాయ రంగానికి చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు మాత్రమే కాదు. మొత్తం దేశ ప్రజలు ఆకలితో అలమటించిపోకూడదన్న హరిత విప్లవ పితామహుడు పడిన శ్రమకు దక్కిన ఫలితం అని చెప్పాలి. హరిత విప్లవానికి బాటలు వేసి, నూతన వంగడాల ఆవిష్కరణలతో యావత్ రైతాంగం ముఖ చిత్రాన్నే మార్చి వ్యవసాయ రంగంలో పెను మార్పులు తెచ్చిన ఘనత స్వామినాధన్ కే దక్కుతుంది.


09 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

అన్ని హంగులతో జంతు దవాఖాన!!

భారతదేశంలో ప్రపంచ స్థాయి జంతు ఆసుపత్రి ప్రారంభించాలనే పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి కల త్వరలో మహాలక్ష్మిలో టాటా ట్రస్ట్స్ స్మాల్ యానిమల్ హాస్పిటల్ ప్రారంభోత్సవంతో సాకారం కానుంది. ముంబైలో 165కోట్లతో దాదాపు 22 ఎకరాల్లో పెంపుడు జంతువుల కోసం అన్ని హాంగులతో కూడిన హస్పిటల్ ను నిర్మింస్తున్నారు. అతి త్వరలో ఇది అందరికి అందుబాటులో ఉండనుంది.

07 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🌾కేంద్ర ప్రభుత్వం రాయితీతో చవగ్గా భారత్‌ బియ్యం !!

పెరిగిన బియ్యం ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం రాయితీ ధరకు భారత్‌ బియ్యం విక్రయాలను మంగళవారం ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మంగళవారం ఢిల్లీలో ప్రారంభించారు. భారత్‌ రైస్‌ పేరుతో కిలో రూ.29 చొప్పున 5, 10 కిలోల సంచుల్లో ఇవి లభిస్తాయి.ఇవి ఈ-కామర్స్‌ వేదికలతో పాటు ఎంపిక చేసిన అవుట్ లెట్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. తొలి దశలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య, భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల్లో భారత్‌ రైస్‌ను విక్రయిస్తారు. దీనికోసం 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) సరఫరా చేయనుంది.

06 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

కాలి బాటలతో తెగుళ్ళు దూరం !!

తెలుగు రాష్ట్రాలలో అత్యదికంగా వరి పండుతుంది. వరి నాట్లు కొనసాగుతున్న తరుణంలో, నాట్లు వేసే దశలోనే కాలి బాటలను తీస్తే ప్రతి రెండు మీటర్ల వెడల్పుకు 30 సెం. మీ కాలి బాటలను వదిలితే వెలుతురు, గాలి బాగా ప్రవహించి ఎదుగుదల బాగుంటుంది.అదేవిదంగా చీడలను అరికట్టవచ్చు. ముఖ్యంగా దోమను, తద్వారా ఆశించే తెగుళ్ళ నష్టాన్ని అదుపులో ఉంచవచ్చు. అంతేకాక కలుపు నివారణ, పురుగు మందుల పిచికారి మరియు ఎరువులను పొలమంతా సమానంగా చల్లుకోవడానికి సులభంగా ఉంటుంది.


02 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🌾వ్యవసాయరంగానికి బడ్జెట్ 2024 !!

రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం తన ప్రయత్నాలను వేగవంతం చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ (Union Budget 2024) ప్రసంగంలో ప్రకటించారు. ఈ విషయంలో ప్రభుత్వం కనీస మద్దతును పెంచింది. అన్నదాతల కోసం క్రమానుగతంగా ఆదాయం పెంపు కోసం వివిధ చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొత్తం మీద వ్యవసాయం, రైతుల సంక్షేమశాఖకు రూ.1.27 లక్షల కోట్లు, మత్స్య, పశుపోషణ, పాడి మంత్రిత్వ శాఖకు రూ.7105 కోట్లు, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖకు రూ.3,290 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధికి ప్రైవేట్ మరియు పబ్లిక్ పెట్టుబడుల ప్రోత్సహించనున్నట్లు ప్రకటించారు.

02 Feb , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🌱అతి పెద్ద జాతీయ నర్సరీ మేళా మొదలు !!

హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్‌ పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో 15వ గ్రాండ్ నర్సరీ మేళా, భారత వ్యవసాయ, ఉద్యాన ప్రదర్శన - 2024 మొదలైంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ గ్రాండ్‌ నర్సరీ మేళాను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పేరుగాంచిన విత్తన, నర్సరీ, పనిముట్లు, యంత్రాలు, నగర సేద్యం సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం, హైడ్రోపొనిక్స్ టెక్నాలజీ సంస్థలు, అందమైన పూల మొక్కలు, అలంకరణ స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఈ మేళాలో మొత్తం 160 పైగా స్టాళ్లు, ఐదు రోజుల పాటు జరిగే ఈ షోలో ఉదయం 9 నుండి రాత్రి 10 అందుబాటులో ఉంటుందని మేళా ఇంచార్జ్ తెలిపారు.

30 Jan , 2024

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

🚨పత్తి రైతు సోదరులకు విజ్ఞప్తి !!

ఈ నెల 31/01/2024 వరకు మాత్రమే CCI వారు పత్తి కొనుగోలు జరుగుతుంది అని Whatsap message లలో అబద్ధపు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వార్తలు నమ్మవద్దని CCI వారిచే పత్తి కొనుగోళ్లు నిరంతరంగా కొనుగోళ్లు కొనసాగుతాయని, రైతులు ఎటువంటి అందోళన చెందవద్దని జిల్లా మార్కేటింగ్ అధికారులు తెలియజేస్తున్నారు. పత్తి రైతులు తొందరపడి ఒకే సారి తమ పత్తిని CCI కి అమ్మడానికి జిన్నింగు మిల్లలకు తీసుకురావద్దని మరియు రవాణా వెయిటింగ్ ఖర్చు భారం చేసుకోకూడదని మరియు తక్కువ ధరకు వ్యాపారులకు అమ్మవద్దని చెబుతున్నారు.