16 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులు నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా ?

రైతులు విత్తనం తీసుకునేప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు: 1. ప్రభుత్వ అనుమతి పొందిన లేదా విత్తన ధృవీకరణ సంస్థ లైసెన్సు పొందిన డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొనాలి. 2. తక్కువ ఖరీదు ఉన్న, మూటలలో కట్టిన విత్తనాలను కొనవద్దు మరియు కొనుగోలుదారు నుండి బిల్లును తీసుకోవాలి. 3. విత్తనాలు కొంటున్నపుడు సంచి వెనకాల ట్యాగ్ లు, లైసెన్స్ నెంబర్, విత్తనం, లాట్ నెంబర్, QR కోడ్ వీటితో పాటు "Date of packing" మరియు "Validity Dates" కూడా రైతులు సరి చూసుకోవాలి. 4 మొలక శాతం 80% అంత కంటే ఎక్కువగా ఉండేలా, జన్యు శాతం 98% అంతకంటే ఎక్కువగా మరియు ఇతర పదార్థాలు 2% అంతకంటే తక్కువగా ఉండేలా రైతులు సరిచూసుకోవాలి. 5. ఒకవేళ ప్రత్తి విత్తనాలు కొంటున్నప్పుడు బీటీ మరియు నాన్ బీటీ విత్తనాల తేడా కోసం "GEAC" చే ముద్రించిన నంబర్ ఉన్నది లేనిది రైతులు గుర్తించాలి. నంబర్ ఉంటే బిటి విత్తనాలు గా గుర్తించాలి.

15 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పత్తి మోళ్లను కలియ దున్నితేనే భూమికి సత్తువ

పత్తిలో గులాబీ రంగు కాయ తొలుచు పురుగు రాకుండా ఉండాలంటే సాగు భూమిలో వేసవి నుంచే ముందస్తుగా చర్యలు తీసుకోవాలని. పత్తి పంట దిగుబడి పూర్తయ్యాక చెట్ల మొదళ్లను అలాగే ఉంచుతున్నారు. అదే భూమిలో వానాకాలం పత్తి వేస్తే పురుగుల ఉద్ధృతి పెరుగుతుంది. పత్తి మోళ్లలో గుడ్లు, లార్వా కోశస్థ దశ రూపంలో నిల్వ ఉండే వానాకాలం పంట వేయగానే పురుగు ఆశించి నష్టపరుస్తుంది. పత్తి మోళ్లను ట్రాక్టర్ నాగలి లేదా రోటోవేటర్ లతో భూమిలో కలియదున్నాలి. పురుగు అవశేషాలను సమూలంగా నాశనం చేయవచ్చు. తద్వారా సేంద్రియ కర్బన పదార్థాలను అందించి భూమి సత్తువను పెంచుకోవచ్చని వ్యవసాయాధికారులు రైతులకు సూచించారు.

14 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఖాతాల్లోకి అకాల వడగళ్ళ వాన నష్టపరిహారం

మార్చి 16 నుంచి 21 వరకు తెలంగాణలోని 26 జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్లతో వరి, జొన్న, మిర్చి, వేరుసెనగ, పత్తి, కూరగాయలు, మామిడితోటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.151.46 కోట్ల పరిహారం విడుదల చేసింది. ఈ నిధులను జిల్లాల వారీగా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులకు పంపించి, నేరుగా రైతుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీకి ఆదేశించారు. పంట నష్టాలను స్వయంగా పరిశీలించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారంగా అందిస్తామని. ఈ మేరకు వ్యవసాయశాఖ సర్వేలు నిర్వహించి 1,51,645 ఎకరాల నష్టాన్ని నమోదు చేసింది. దీనికి అనుగుణంగా 1,30,988 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేయాలని ఆదేశించింది. మహబూబాబాద్‌ జిల్లాలో 12,684 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం పరిహారం జమ చేశారు. మిగిలిన జిల్లాల్లోనూ ఒకటి రెండు రోజుల్లో పడనున్నాయని తెలిపారు.

12 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులకు న్యాయసలహాలు

లీప్స్ రైతులకు క్షేత్రస్ఖాయిలో భూమి, వ్యవసాయ చట్టాలపై సమగ్ర శిక్షణ ఇచ్చెందుకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి ఒక సాగు న్యాయ నేస్తం వాలంటీర్లను నియమించి, శిక్షణ ఇచ్చేలా లీప్స్ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సునీల్ కుమార్ తెలిపారు. భూమిపై హక్కులు, సాగు చట్టాలు చాలా ఉన్నప్పటికి చాలా మంది రైతులకు అవగహన కొరవడిందన్నారు. గ్రామంలో ఉంటూ ఇతరులకు సాహాయం చేసే ఉద్దేశ్యం ఉన్న యువత ఈ నెల 30 లోపు 90002 22674 కి వాట్సప్ ద్వారా దరఖాస్తు చేసుకొవాలని ఎవైనా సందేహాలు ఉంటే నివృతి చేసుకొవాలని సూచించారు.


12 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

అమోజాన్ తో ICAR MOU

న్యూఢిల్లీ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) మరియు అమెజాన్ కిసాన్‌తో ఒక అవగాహనా ఒప్పందం జరిగింది. ఇది రైతుల దిగుబడులు మరియు ఆదాయం పెంచేందుకు చేయాల్సిన వివిధ పంటల శాస్త్రీయ సాగుపై రైతులకు మార్గనిర్దేశం చేయనున్నారు. అలాగే అమెజాన్ ఫ్రెష్‌తో సహా భారతదేశం అంతటా వినియోగదారులకు అధిక నాణ్యత తాజా ఉత్పత్తుల నాణ్యత నిర్ధారించడంలో సహాయపడుతుంది. డాక్టర్ హిమాన్షు పాఠక్, సెక్రటరీ డేర్ మరియు డైరెక్టర్ జనరల్ ICAR తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రభుత్వ-ప్రైవేట్-రైతుల-భాగస్వామ్య (PPPP) విజయవంతం కావాలన్నారు.

10 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఆకాశాన్ని అంటుతున్న అల్లం ధరలు....

10 రోజుల ముందు వరకు 100 రూపాయలకు అటు ఇటుగా ఉన్న అల్లం ధర ఒక్కసారిగా 150-200లకు పెరిగిపోవడంతో ఆ ప్రభావం రిటైల్‌ మార్కెట్లలోనూ కనిపిస్తోంది. ఈ ఏడాది డిమాండ్ కు సరిపడాపంట అందుబాటులోకి లేకపోవడంతో పాటు రవాణా ఖర్చులు అధికంగా ఉండటంతో ధరలు గణనీయంగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రతీ వేసవికాలంలో లాగానే శొంఠి తయారీకి భారీగా అల్లాన్ని వినియోగించడం కూడా ధరలు పెరగడానికి కారణమని ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది మరియు రానున్నరోజుల్లో అల్లం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

09 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

TS అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు నోటిఫికేషన్

ఆచార్య జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2023-24 సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్సు: డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (రెండేండ్లు), డిప్లొమా ఇన్‌ ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ (రెండేండ్లు), డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ (మూడేండ్లు) ఎంపిక: పాలీసెట్‌-2022 అగ్రికల్చర్‌ స్ట్రీమ్‌లో వచ్చిన ర్యాంక్‌ ఆధారంగా దరఖాస్తు: ఆన్‌లైన్‌లో అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు అగ్రికల్చరల్‌ స్ట్రీమ్‌లో పాలీసెట్‌-2022 పరీక్ష రాసి ఉండాలి. చివరితేదీ: 24-06-2023 వెబ్‌సైట్‌: https://diploma.pjtsau.ac.in


08 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతులకు శుభవార్త

ఇప్పటికే ఆలస్యమైన నైరుతి ఋతుపవనాలు ఎట్టకేలకు కేరళ తీరాన్ని తాకాయి. వాతావరణం అనుకూలిస్తే, రెండు వారాల లోపే నైరుతి వర్షాలు తెలుగు రాష్ట్రాలలో ప్రవేశించే అవకాశం ఉంది కావున రైతులు తొందరపడకుండా, నేలలో తగినంత తడి శాతం మరియు విత్తనం మొలకెత్తడానికి అనుకులంగా ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు నాటమనీ సూచన. Courtesy : ASP

07 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ఖరీఫ్ సాగుకు పెరిగిన మద్ధతు ధరలు

2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను ఈరోజు పెంచింది. సాధారణ వరి క్వింటాల్‌కు 143 రూపాయల మేర పెంచిన ధరతో కలిపి 2,183 రూపాయలుగా, పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి 8,558 రూపాయలుగా నిర్ణయించింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపు అన్నదాతలకు లాభయదాయకంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

07 Jun , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

ముందస్తు వరి సూచనలు

యాసంగిలో వరి ఈదురుగాలులు, వడగళ్ళ వానకు తీవ్ర నష్టానికి వాటిల్లింది. కావున వానాకాలంలో ముందస్తుగా సాగు చేయడం వలన అకాల వర్షాలను తప్పించుకోవడంతో పాటు చీడ పీడల సమస్య తక్కువగా ఉంటుందని తెలిపారు శాస్రవేత్తలు తెలిపారు. దీర్ఘకాలిక వరి రకాలను - మే నుండి జూన్ 5 లోపు, మధ్య కాలిక రకాలు జూన్ 15 లోపు మరియు స్వల్ప కాలిక రకాలు జూన్ 25 లోపు నారుపోసుకున్నట్లైతే అక్టోబర్ 20 తరువాత నుండి వరి కోతలు చేసుకోని ప్రకృతి వైపరిత్యానికి కాలాన్ని ముందుకు జరిపి అధిక దిగుబడులు సాదించే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు.