NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
తెలంగాణకు వర్ష సూచన !!
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోని కొనసాగుతుండడంతో వాతావరణం చల్లబడింది. రానున్న నాలుగు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌లోని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే వడగండ్ల వాన కారణంగా మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పంట నష్టం జరిగింది. సోమవారం వరకు గురువారం వరకు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్టు హెచ్చరించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రైతులు విత్తన కొనుగోళ్లలో మోసపోవద్దు....
మిరప రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో తొందరపడి యూ ట్యూబ్ ఛానల్స్ లేదా ఇతర రైతులతో 40క్వింటలు అదిగో 30క్వింటలు ఇవిగో అని మాట్లాడించి చెప్పే మాటలు నమ్మకండి. అడ్వాన్స్ డబ్బు ఇచ్చి మోసపోకుండా ఏ నేలలో ఏ రకం బాగా పండుతుందో అంచనా వేసుకొని తీసుకోవడం మంచిది. ఏ f1 వెరైటీలలో నైనా 2 లేదా 3క్వింటాల తేడా ఉంటుంది అన్నీ వెరైటీ లు బాగానే ఉంటాయి. ఇది మనకు తెలియని విషయం కాదు. మీరు తీసుకోవాలనుకున్న విత్తనాల కంపెనీ కి R&D సర్టిఫికెట్ ఉందా లేదా బిల్, బ్యాచ్ నెంబర్, డీలర్ సంతకం ఉండేటట్లు చూసుకొని తీసుకోండి. రైతులు వాతావరణ మరియు వారి నేల రకం ఆధారంగా గమనించి తొందర పడకుండా తొలకరి తర్వాతనే విత్తన కొనుగోలు చేసుకోవాలి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
లక్ష్యానికి ఆమడ దూరంలో ఆయిల్ పామ్ సాగు
ఆయిల్ పామ్ సాగు తీరు ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. పామాయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి దేశంలోనే ఉత్పత్తి చేసే స్థాయికి చేరాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంట సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వంట నూనెల జాతీయ పథకం కింద కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని జిల్లాల వారీగా సాగు లక్ష్యాలను నిర్ధేశించాయి. కంపెనీ ప్రతినిధులు, ఉద్యానవనశాఖ సహకారంతో పాత కరీంనగర్ జిల్లాలో నాలుగేళ్లలో 1.21 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండేళ్లలో ఇప్పటివరకు కేవలం 10. 4 వేల ఎకరాల్లో మాత్రమే నాటారు. రానున్న రోజుల్లో అయిన లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో చూడాలి.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
వ్యవసాయ రంగంలో భారీగా పెరుగుతున్న డ్రోన్ పైలట్ డిమాండ్....
పెరుగుతున్న సాంకేతికత మరియు అధికమవుతున్న డ్రోన్ ఉత్పత్తి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం విరివిగా జరుగుతుంది. డ్రోన్లకు పెరుగుతున్న క్రేజ్ తో పాటు వాటిని నడిపే డ్రోన్ పైలెట్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న డ్రోన్ పైలట్ శిక్షణ కోసం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DCGA), కొన్ని రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజషన్స్(RPTO) కి డ్రోన్ పైలెట్స్ కు శిక్షణ ఇవ్వడానికి అనుమతిని ఇచ్చింది. ఇండియా లో మొత్తం 52 ట్రైనింగ్ సంస్థలు ఉన్నాయ్. ఈ సంస్థల్లో ట్రైనింగ్ పొందేందుకు, అభ్యర్థులు, కనీసం 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. దీనితో పాటుగా ఆధారకార్డ్, మరియు పాస్పోర్ట్ అవసరం. కొన్ని అధ్యయనాల ప్రకారం, 2026 నాటికి డ్రోన్ మార్కెట్ 15,000 వేల కోట్లకు చేరుకుంటుంది అని అంచనా, తద్వారా ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయ్.....
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
గుజరాత్ లో జరిగిన అంతర్జాతీయ మిల్లెట్స్ మహోత్సవం....
2023 ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. తగ్గుతున్న చిరు ధాన్యాల పంటల సాగును తిరిగి పెంచేందుకు, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పోయిన సంవత్సరం, చిరు ధాన్యాలయినా రాగులు, సజ్జలు, జొన్నలు మొదలగు పంటల ఉత్పత్తిని పెంచేందుకు మరియు వాటి వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇదే క్రమంలో, గుజరాత్ అహ్మదాబాద్ లో గల సబర్మతి రివర్ఫ్రంట్ గ్రౌండ్ లో 2024 మిల్లెట్ మహోత్సవ కార్యక్రమం మార్చ్ 1, 2 తేదిలలో జరిగింది. చిరు ధాన్యాలను అనేక దుకాణాలలో ముఖ్య ఆకర్షణగా, మిల్లెట్స్ తో తయారు చేసిన అనేక పిండి వంటలను ఫుడ్ స్టాల్స్ను ప్రదర్శనలో ఉంచారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
రెండవసారి రికార్డ్ స్థాయి ధరలో పసుపు
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పసుపు పంటకు రికార్డు స్థాయిలో ధర పలికింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన పన్నాల మహిత అనే మహిళా రైతుకు చెందిన 17 క్వింటాళ్ల కొమ్ముకు గరిష్ఠంగా క్వింటాకు రూ.14255 చొప్పున ధర పలికింది. ఇదే ఈ సీజన్ అత్య ధిక ధరగా మార్కెటింగ్ సెలక్షన్ గ్రేడ్ కార్య దర్శి వెంకటేశం వెల్లడించారు.2011లో క్వింటా ఆల్టైమ్ రికార్డు ధర రూ.16,166 పలికింది. ఆ తర్వాత రూ.6-7 వేల మధ్య మాత్రమే లభిస్తోంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
పొగాకు రైతులకు వడ్డీ లేని రుణాలు !!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నెలలో సంభవించిన మిచౌన్గ్ తుఫాను వలన తీరా ప్రాంత పొగాకు రైతులకు భారీ నష్ఠాన్నీ మిగిలించింది. మొత్తం 75,355 హెక్టార్ల పంటకు గాను 14,730 హెక్టార్ల పంట కోతకు గురి అయ్యింది. ఈ తుఫాను కారణంగా ఎంతో మంది ఫ్ల్యూ క్యూరెడ్ వర్జినియా (FLV ) పొగాకు రైతులు తీవ్రంగా నష్ట పోయారు. అధిక వర్షపాతం, మరియు పొలంలో నీళ్లు నిలిచిపోవడం కారణంగా మొక్కలు కుళ్లిపోయి ఎండిపోయాయి పొగాకు రైతులకు కలిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 వడ్డీ రహిత లోన్లను రైతులకు అందచెయ్యాలి అని నిర్ణయయించింది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
నిమ్మకాయ ధరలకు రెక్కలు
హైదరాబాద్:- ఉమ్మడి జిల్లాలో కొద్ది రోజులుగా నిమ్మకాయ ధరలు పెరుగుతున్నాయి.బహిరంగ మార్కెట్లో గతంలో ఒక్క కాయ రూ.2 ఉండగా ప్రస్తుతం రూ.10కి రెండు చొప్పున అమ్ముతున్నారు. చాలా మంది మార్కెట్లో ధర చూసి కొనకుండానే వెనుదిరుగుతున్నారు. వర్షాభావం, తోటల విస్తీర్ణం తగ్గించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
అమాంతం పెరిగిన కోడి ధరలు!! కిలో ఎంతో తెలుసా !!
తెలుగు రాష్ట్రాల్లో మాంస ప్రియులకు చికెన్ ధరలు షాకిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిచోట్ల కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతోంది. పెరిగిన ఎండలతోపాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. మరో పక్క బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక గుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.6 పైనే పలుకుతోంది.
NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta
ఈరోజు 3 గంటలకు !!ఆన్ లైన్ డెమో!! అధునాతన వ్యవసాయ పరికరాలు!!
ఆన్ లైన్ డెమో అధునాతన వ్యవసాయ ఎద్దుల పరికరాలు | ఫిబ్రవరి 26, 2024 - మధ్యాహ్నం 3 గంటల నుండి.. ఇన్నోవేషన్ గిల్డ్ సంస్థ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో CSOలు / NGOలు ,గ్రామ వ్యవస్థాపకులు, మరియు రైతుల కోసం ఆన్‌లైన్ ప్రదర్శన నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ వైవిధ్యమైన వ్యవసాయ కార్యకలాపాల కోసం రూపొందించిన అధునాతన మరియు మెరుగుపరచబడిన వ్యవసాయ జంతువుల పరికరాలను ప్రదర్శిస్తుంది. దీనికి ముఖ్య అతిధి డాక్టర్ M డిన్, జంతు శక్తి వినియోగంపై ఆల్ ఇండియా కోఆర్డినేషన్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కి మాజీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ 🙏Kindly Join: Date: Monday, February 26th, 2024 Time: 3:00 – 5:00pm (Time zone: Asia/Kolkata) Zoom Webinar link: https://us06web.zoom.us/j/81949846790?pwd=bDF2VXrhcqYMx8GsAkFemzxfTisoat . వివరాలకు సంప్రదించండి Mr Malyaj Shrivastava (80855 38290)









