28 Jul , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

చెరకు సాగు రైతులకు ప్రభుత్వం తీపి కబురు !!

కేంద్ర ప్రభుత్వం 2023-2024 సంవత్సరానికి చెరకు ధర క్వింటాల్ కి రూ.315 ధరగా నిర్ణయించింది. దేశంలో చెరకు రైతులు ఇప్పటివరకు పొందుతున్న తమ చెరుకు పంటకు ఇదే అధిక ధర. అలాగే ప్రభుత్వం యూరియా సబ్సిడి పధకాన్ని "పీఎం ప్రణామ్" పథకం క్రింద మరో మూడేళ్లకు పెంచుతూ కూడా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంకా రైతుల సంక్షేమానికి అనేక ఇతర కార్యక్రమాలు చేపట్టేందుకు కూడా కేంద్రం నిర్ణయించింది.

25 Jul , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మూడు రోజుల పాటు భారీ వర్షాలు !!

తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ వానలను ఆసరా చేసుకొని సాగును చేసుకోవాలి. వరి పంటలో చేయవలసిన పనులు: 1. వరి పంట సాగు రైతులు ఈ వానలను సద్వినియోగం చేసుకొని నాట్లు పూర్తీ చేసుకోవాలి. 2. ఈ వర్షం వరికి అనుకూలంగా ఉన్నందున ఇప్పటి వరకు మొదలుపెట్టని రైతులు దమ్ముచేసి నేరుగా స్వల్పకాలిక విత్తనాలను చల్లుకోవాలి. 3. ఉల్లికోడు మరియు మొగిపురుగు తగ్గించడానికి కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకోవాలి. 4. 40 రోజుల పంటకు మొదటి దఫా ఎరువులను వేసుకోవాలి. ఇతర పంటలలో అంతరకృషి చేసుకోవడం మరియు మురుగు నీటి కాలువలు తీసుకోవడం మంచిది.

25 Jul , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

వర్షాకాలం - రైతన్నలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. రైతులు చెట్లకింద విద్యుత్ స్థంభాల, తీగలు మరియు చెరువుల వద్ద ఉండకుండా మరియు పశువులను సురక్షిత ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. 2. పోలాల నుండి అధిక వాన నీటిని బయటకు పోవడానికి మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. 3. పాములు, తేళ్లు, విషపు కీటకాలు ఎక్కువగా సంచరిస్తుంటాయి. అలాగే తెగిపడిపోయిన కరెంట్ వైర్లు ఉండే అవకాశం ఉంది కాబట్టి చెప్పులు, చేతిలో టార్చ్ తీసుకెళ్లాలి. 4. పురుగుల మందులు గాలికి కొట్టుకొస్తాయి కాబట్టి ముక్కు, నోటికి వస్త్రం కట్టుకుని రసాయనాలు పిచికారీ చేయాలి. 5. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దు. ఫోన్ వాడొద్దు.

19 Jul , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రైతును రాజు చేస్తున్న టమాటా !!

దేశ వ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈసారి టమాటా పంట ఎక్కువగా సాగు కాకపోవడం, దీనికి తోడు పండిన పంట నష్టపోవడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా లేక టమాటా ధరలు ఆకాశాన్నంటాయని ప్రజలు బాదపడుతున్నారు. అయితే టమాటా ధర ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. ఎందుకంటే ఒక్కోసారి కిలో టమాటా రూ. 1, రూ. 2 కే అమ్ముకోలేక రైతులు రోడ్ల పక్కన పారబోయడం. పొలాల్లోనే టమాటా పంటను వదిలేయడం ఎన్నో చూశాం. కానీ ప్రస్తుతం మాత్రం 150 నుంచి రూ. 200 వరకు ధర పలుకుతోంది. రైతు రాజు అవ్వాలని అందరం అనుకుంటాం అయితే టమాటా పంటను సాగు చేసిన ఓ రైతు మాత్రం నెల రోజుల్లోనే కోటీశ్వరుడిగా మారాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.


15 Jul , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

విజయవాడలో సీ-ఫుడ్ ఫెస్టివల్ !!

విజయవాడలో ఈనెల 28వ తేదీ నుంచి మూడు రోజుల పాటు సీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మత్స్య శాఖ తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే రొయ్యల్లో 75 శాతం మన రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతున్నా, మన రాష్ట్రంలో వినియోగం మాత్రం 5 శాతం లోపే ఉందని, ఈ పరిస్థితిని అధిగ మించాలంటే డొమెస్టిక్ మార్కెట్ను పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్థానిక వినియోగాన్ని పెంచడం, ప్రత్యా మ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను మరియు వినియోగదారుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ సీ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

14 Jul , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

యూరియాకు ప్రత్యామ్నాయం స్థానిక ఆవు పాలు పెరుగు

50 కిలోల యూరియా బస్తా కంటే, 2 లీటర్ల స్థానిక ఆవు పాల పెరుగుతో చేసిన ప్రయోగం ఎంతో మేలైన ఫలితాలు ఇస్తోంది. 50 కిలోల యూరియాకి బదులుగా, 15 రోజులు 2లీటర్ల స్థానిక ఆవు పాల పెరుగులో రాగి ముక్కముంచి వుంచి, తరువాత ఆ పెరుగును వంద లీటర్ల నీటితో కలిపి, ఒక ఎకరంలో పిచికారీ చేయాలి. ఈ పెరుగును చల్లడం ద్వారా, మొక్క వరుసగా 45 రోజులు ఆకుపచ్చగా ఉంటుంది. యూరియా 25 రోజులు మాత్రమే మొక్కను పచ్చగా ఉంచుతుంది. 2 కిలోల స్థానిక ఆవు పాల పెరుగుతో, 50 కిలోల యూరియా వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందో, అంతకంటే చాలా ఎక్కువ ప్రయోజనము ఉంటుంది మరియు ఖర్చులు కూడా తగ్గుతాయి. సిక్కిం రాష్ట్రం మొత్తం స్థానిక ఆవుపాలను పెరుగును చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తోంది. యూరియా సిక్కిం రాష్ట్రమంతటా నిషేధించబడింది. దీన్ని మీరూ ఉపయోగించి ఫలితం చూడండి, ఆపైన మీ అనుభవాలను పంచుకోండి

13 Jul , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

లేజర్ కిరణాలతో కలుపు నివారణ !!

ఆస్ట్రేలియాలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కిరణాల కలుపు నివారిణి ఒక అద్భుతమైన ఆవిష్కరణ. ఎలాంటి రసాయనాలు లేకుండా లేజర్ గన్ తో కలుపు మొక్కలను మాత్రమే కాల్చి వేసి పంట మొక్కలను సురక్షితంగా ఉంచుతుంది. ఒక గంటకు రెండు లక్షల కలుపు మొక్కలను ఒక మిల్లిమీటర్ కంటే తక్కువ ఖచ్చి తత్వంతో 99% వరకు నిర్మూలిస్తుంది. పంట ఆరోగ్యాన్ని కాపాడుతూ, నాణ్యత పెంచి దిగుబడిని ఎక్కువ చేస్తుంది. రాత్రి, పగలూ పని చేస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పని ఎంత అమోఘంగా ఉంది కదూ.


10 Jul , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

రాష్ట్రంలో అమలవుతున్న రైతు భీమా

రైతు భీమా పథకానికి కొత్తగా అర్హులైన రైతులందరినీ నమోదు ప్రక్రియ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 5 వరకు తెరిచి ఉంటుంది, ఇది 18 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు గల రైతులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఈ పథకానికి అర్హత పొందాలంటే రైతులు జూన్ 18వ తేదీకి ముందు పొందిన పట్టాదారు పాస్‌బుక్‌ని కలిగి ఉండాలని వ్యవసాయశాఖ ఉతర్వులు జారిచేసింది. రైతు బీమా పథకం పరిధిని విస్తరించడం ద్వారా ఎక్కువ మంది రైతులకు ఆర్థికంగా మద్ధతు లభిస్తుంది.

07 Jul , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

మూడు రోజుల్లో వర్ష సూచన !!

తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ బెంగాల్ పరిసరాల్లోని ఉత్తర ఒరిస్సా సముద్రానికి 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న నైరుతి వైపు పయనించడం వల్ల గురువారం మంచిర్యాల్, కరీంనగర్, నాగర్ కర్నూల్, వరంగల్, ములుగు జిల్లాలో వర్షం కురిసిందని రానున్న రోజుల్లో ఖమ్మం నిర్మల్ జిల్లాలో వర్షం కురువనుందని హైదరాబాద్ కేంద్రం వెల్లడించింది. రైతులు సాగుపనులను ముమ్మరం చేస్తూ అంతర కృషి పనులు చేసుకుంటూ పంటలను కాపాడుకోవాలని నీరు నిలిచే ప్రాంతాల్లో నీటిని బయటకు వెళ్లే లాగా వసతులు కల్పించుకోవాలి.

04 Jul , 2023

NaPanta Smart Kisan Agri App - bit.ly/NaPanta

పంటలపై ప్రభావం చూపుతున్న ఎల్నినో

పసిఫిక్ మహాసముద్రంపై ఏర్పడిన ఎల్నినో ప్రపంచంపై తన ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ఋతుపవనాల రాక ఆలస్యం అయ్యింది. ఎల్నీనో వల్ల 2024లో భూతాపం 2 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావం అధిక ఉష్ణోగ్రతలు, కరవు, కుండపోత వర్షాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావాలు వృక్షసంపదను సంపదను, పంటల దిగుబడిపై ప్రభావం చూపనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.