16 Aug , 2025

*తెలంగాణ రైతు బీమా పథకంపై కీలక అప్డేట్.. అన్నదాతల సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తప్పనిసరి

⏭️ తెలంగాణ రైతుల కోసం ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రైతు చనిపోతే వారి కుటుంబానికి రూ. 5 లక్షలు అందుతాయి. అయితే ఈ ఏడాది కొత్తగా రైతు బీమా పథకంలో చేరే రైతులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను వ్యవసాయ శాక అధికారులు విడుదల చేశారు. పథకంలో కొత్తగా చేరే రైతులు తప్పనిసరిగా తమ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం కాపీలతో పాటు, నామినీ ఆధార్ కార్డును కూడా దరఖాస్తుకు జతచేయాలి. ఈ పత్రాలను పూర్తి చేసి, సంతకం చేసి వ్యవసాయ విస్తరణాధికారులకు (AEO) అందజేయాలి. ఈ దరఖాస్తు పత్రాలు ఏఈవోల వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ పథకంలో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న రైతులు మాత్రమే చేరేందుకు అర్హులు. అంటే, 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్య జన్మించిన వారు అర్హులు. 18 ఏళ్లు నిండి, పట్టాదారు పాస్ పుస్తకం ఉన్న కొత్త రైతులను ఈ ఏడాది జాబితాలో చేరుస్తారు. అదే సమయంలో 59 ఏళ్లు నిండిన రైతులను జాబితా నుంచి తొలగిస్తారు.