పశువుల పెంపకానికి వ్యవసాయ హోదా ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం
మహారాష్ట్ర రాష్ట్ర సర్కార్ పశువుల పెంపకానికి వ్యవసాయ హోదాను మంజూరు చేసింది. పాడి, కోళ్లు, మేకలు మరియు పందుల పెంపకంలో నిమగ్నమైన రైతులకు వ్యవసాయ వ్యాపారాలతో సమానంగా రాయితీలు అందించడం అవసరమని నిర్ణయించి వ్యవసాయ సమాన హోదా ఇవ్వాలని గురువారం ప్రభుత్వ తీర్మానం పేర్కొంది. ప్రస్తుతం, మహారాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 12% మరియు మొత్తం వ్యవసాయ రంగంలో పశువుల ఉత్పత్తి వాటా 24% ఉంది. ఇదే విధానం మన రాష్ట్రంలో కూడా రావాలని ఇక్కడి రైతులు కొరుకుంటున్నారు.
