మీకు తెలుసా ? : DDKY (ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన)
పంటల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా దేశ సర్కారు జూలై 16న ప్రధాన మంత్రి ధన్-ధాన్య కృషి యోజన పథకానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఆరేళ్లపాటు రూ.24 వేల కోట్లతో దేశవ్యాప్తంగా 100 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఎంపిక చేయబడిన ప్రతి జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన DDKY సమితిని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలో ఆదర్శ రైతులు, సంబంధిత అధికారులు ఉంటారు. ఈ పథకం ద్వారా అధిక ఉత్పాదకత , వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో విలువ జోడింపు, స్థానిక జీవనోపాధి కల్పన , దేశీయ ఉత్పత్తి పెరుగుదల, మరియు స్వావలంబన సాధించేలా DDKY సమితులు మరియు నోడల్ ఆఫిసర్లు పరిశీలిస్తారు. ఈ పథకం ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా 1.7కోట్ల మంది లబ్బిపొందే అవకాశం ఉంది.
