ఖరీఫ్ సాగు విస్తీర్ణం : 829.64 లక్షల హెక్టార్లు
2025-26 సీజన్‌కు భారతదేశంలో వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, జూలై 25, 2025 నాటికి ఖరీఫ్ పంటల మొత్తం విస్తీర్ణం 829.64 లక్షల హెక్టార్లు సాగైంది. ఇది గత సంవత్సరం కంటే 31.73 లక్షల హెక్టార్ల పెరిగింది. 2024-25తో పోలిస్తే వరి విస్తీర్ణం దాదాపు 29 లక్షల హెక్టార్లు, పప్పుధాన్యాలు 3.11 లక్షల హెక్టార్లు, ముతక తృణధాన్యాలు 5.75 లక్షల హెక్టార్లు పెరిగింది. కాని నూనెగింజల సాగు గత సంవత్సరం కంటే 3.83 లక్షల హెక్టార్లు తగ్గింది. ఇందులో ముఖ్యంగా సోయాబీన్ విస్తీర్ణం అత్యధికంగా తగ్గింది. పత్తి సాగు కూడా గత సీజన్‌తో పోలిస్తే ఇది 2.37 లక్షల హెక్టార్లు తగ్గింది.
