ఏపీలో పశువులకు గోధార్ కార్డులు
ఆంధ్రప్రదేశ్‌లో పశువులకు ఆధార్ తరహా ‘గోధార్’ కార్డులు అందించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. విజయవాడలో జరిగిన టెక్ ఏఐ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు స్టార్టప్ కంపెనీలతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. ఈ పథకాన్ని తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని ఆయన సూచించారు. పశువుల ఆరోగ్య సమాచారం, రోగ నిర్ధారణ కోసం ఈ కార్డులు ఉపయోగపడతాయని తెలిపారు. అలాగే కోళ్ల వ్యాధుల ముందస్తు గుర్తింపుకు ప్రత్యేక మొబైల్ యాప్ అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
