20 May , 2024

🐄ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ఉచితంగా ఆవులు !!

ఇటీవల రసాయన మందుల వాడకం తగ్గించి గో ఆధారిత వ్యవసాయం వైపు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ విధానాన్ని ప్రోత్సహించే విధంగా ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవస్తానం తమ గోవులను రైతులు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని మే నెల 24వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. ఆవులు కావలసినవారు తమ పొలానికి సంబంధించి పట్టాదార్ పాస్ బుక్ జిరాక్స్ కాపీలు, 100 రూపాయల స్టాంప్ పేపర్, ఆధార్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికెట్ జిరాక్స్, తమ కాంటాక్ట్ నెంబర్ తో ఆలయ కార్యాలయంలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అలా నమోదు చేసుకున్న రైతులకు మే నెల 24 న గోశాలలోని ఆవులను రైతులకు దత్తత ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.