15 May , 2024

పచ్చిరొట్ట విత్తనాలపై 50 % సబ్సిడీ !!

తొలకరి జల్లులను ఉపయోగించి రైతులు పొలాల్లో జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి జీవ ఎరువులను సాగు చేసి, కలియ దున్నడం వలన భూసారం పెరుగుతుందని భావిస్తున్నారు. దీనికి తోడుగా తెలంగాణ ప్రభుత్వం పచ్చిరొట్ట విత్తనాలపై 50 శాతం సబ్సిడీతో పంపిణి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. ఈ ఏడాది 1,75,380 క్వింటాళ్ళ జీలుగ, 8,806 క్వింటాళ్ళ జనుము, 1,825 క్వింటాళ్ళ పెసర విత్తనాలు అవసరమవుతాయని అధికారులు తెలిపారు.