14 May , 2024

చల్లని శుభవార్త ! ముందుగానే ఋతుపవనాల ఆగమనం.... !!

ఈ సంవత్సరం మంచి వర్షాలు నైరుతి ఋతుపవనాల ఆధారంగా కురుస్తాయని ఐఎండీ తెలిపింది. సాధారణంగా ఏటా దక్షిణ ఆండమాన్ సముద్రంలోకి మే 22న నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, అక్కడ నుంచి వారం, పది రోజుల్లో కేరళను తాకుతాయి. కాని ఈ ఏడాది మాత్రం మూడు రోజులు ముందుగా అనగా మే 19నే దక్షిణ అండమాన్ సముద్రంతో పాటు దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం,నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశంఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం వెల్లడించింది. దీంతో కేరళలోకి జూన్ ఒకటో తేదీకల్లా ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు అందనా వేస్తున్నారు.