08 May , 2024

తెలంగాణలో తడిసిన ధాన్యానికి మద్దతు ధర

తెలంగాణలో అకాల వర్షాలకు తడిసి ముద్దయిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఖమ్మంలో జరిగిన కిసాన్‌ మోర్చా సమావేశంలో తెలిపింది. అకాల వర్షాలకు రైతులు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని, ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని, రాబోయే బడ్జెట్‌ సమావేశం తర్వాత రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే ఆగస్ట్ 15 లోపు రుణ మాఫీ చేస్తామని తెలిపారు.