04 May , 2024

మండుతున్న ఎండలు.. వందేళ్ల రికార్డు బ్రేక్ ...!!

దేశవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. రికార్డు స్థాయిలో 103 ఏళ్ల తర్వాత ఏప్రిల్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదయ్యాయి భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. రానున్న ఐదురోజుల్లో దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడి గాలులు వీయనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సహా పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో సైతం వేడి గాలులు మరియు ఉష్ణోగ్రత సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల వల్ల పంట నష్టం, భూగర్భ జలాలు క్షీణించడం జరుగుతుంది. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండి సురక్షిత చర్యలను తీసుకోగలరని మనవి.