04 Mar , 2024

లక్ష్యానికి ఆమడ దూరంలో ఆయిల్ పామ్ సాగు

ఆయిల్ పామ్ సాగు తీరు ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తుంది. పామాయిల్ ను విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి దేశంలోనే ఉత్పత్తి చేసే స్థాయికి చేరాలనే సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంట సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వంట నూనెల జాతీయ పథకం కింద కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని జిల్లాల వారీగా సాగు లక్ష్యాలను నిర్ధేశించాయి. కంపెనీ ప్రతినిధులు, ఉద్యానవనశాఖ సహకారంతో పాత కరీంనగర్ జిల్లాలో నాలుగేళ్లలో 1.21 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండేళ్లలో ఇప్పటివరకు కేవలం 10. 4 వేల ఎకరాల్లో మాత్రమే నాటారు. రానున్న రోజుల్లో అయిన లక్ష్యాన్ని చేరుకుంటారో లేదో చూడాలి.