04 Mar , 2024

వ్యవసాయ రంగంలో భారీగా పెరుగుతున్న డ్రోన్ పైలట్ డిమాండ్....

పెరుగుతున్న సాంకేతికత మరియు అధికమవుతున్న డ్రోన్ ఉత్పత్తి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం విరివిగా జరుగుతుంది. డ్రోన్లకు పెరుగుతున్న క్రేజ్ తో పాటు వాటిని నడిపే డ్రోన్ పైలెట్లకు కూడా డిమాండ్ పెరుగుతుంది. మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్న డ్రోన్ పైలట్ శిక్షణ కోసం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DCGA), కొన్ని రిమోట్ పైలట్ ట్రైనింగ్ ఆర్గనైజషన్స్(RPTO) కి డ్రోన్ పైలెట్స్ కు శిక్షణ ఇవ్వడానికి అనుమతిని ఇచ్చింది. ఇండియా లో మొత్తం 52 ట్రైనింగ్ సంస్థలు ఉన్నాయ్. ఈ సంస్థల్లో ట్రైనింగ్ పొందేందుకు, అభ్యర్థులు, కనీసం 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. దీనితో పాటుగా ఆధారకార్డ్, మరియు పాస్పోర్ట్ అవసరం. కొన్ని అధ్యయనాల ప్రకారం, 2026 నాటికి డ్రోన్ మార్కెట్ 15,000 వేల కోట్లకు చేరుకుంటుంది అని అంచనా, తద్వారా ఈ రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయ్.....