28 Feb , 2024

పొగాకు రైతులకు వడ్డీ లేని రుణాలు !!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నెలలో సంభవించిన మిచౌన్గ్ తుఫాను వలన తీరా ప్రాంత పొగాకు రైతులకు భారీ నష్ఠాన్నీ మిగిలించింది. మొత్తం 75,355 హెక్టార్ల పంటకు గాను 14,730 హెక్టార్ల పంట కోతకు గురి అయ్యింది. ఈ తుఫాను కారణంగా ఎంతో మంది ఫ్ల్యూ క్యూరెడ్ వర్జినియా (FLV ) పొగాకు రైతులు తీవ్రంగా నష్ట పోయారు. అధిక వర్షపాతం, మరియు పొలంలో నీళ్లు నిలిచిపోవడం కారణంగా మొక్కలు కుళ్లిపోయి ఎండిపోయాయి పొగాకు రైతులకు కలిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,000 వడ్డీ రహిత లోన్లను రైతులకు అందచెయ్యాలి అని నిర్ణయయించింది.