10 Feb , 2024

హరిత విప్లవ పితామహుడుకి భారతరత్న!!

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త యం.యస్.స్వామినాధన్ భారత వ్యవసాయం మరియు రైతుల సంక్షేమానికి చేసిన అసమానమైన కృషికి ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 9న ప్రకటించారు. వ్యవసాయ రంగానికి చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు మాత్రమే కాదు. మొత్తం దేశ ప్రజలు ఆకలితో అలమటించిపోకూడదన్న హరిత విప్లవ పితామహుడు పడిన శ్రమకు దక్కిన ఫలితం అని చెప్పాలి. హరిత విప్లవానికి బాటలు వేసి, నూతన వంగడాల ఆవిష్కరణలతో యావత్ రైతాంగం ముఖ చిత్రాన్నే మార్చి వ్యవసాయ రంగంలో పెను మార్పులు తెచ్చిన ఘనత స్వామినాధన్ కే దక్కుతుంది.