20 Dec , 2023

చిరుధాన్యాలు మరియు ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు సదస్సు !!

రైతుకోసం తానా మరియు రైతునేస్తం ఫౌండేషన్‌ సంయుక్త నిర్వహణలో 2023 డిసెంబర్‌ 31వ తేదీ (ఆదివారం) ఉ. 10:00 గంటల నుండి సా. 4:00 గం.ల వరకు రైతునేస్తం ఫౌండేషన్‌ ఆవరణ, కొర్నెపాడు, పుల్లడిగుంట దగ్గర, గుంటూరు నందు చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, చిరుధాన్యాల సాగు, ఔషధ మొక్కల సాగు, ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడును. ఆధునిక ఆహారపు అలవాట్లు అనేక అనారోగ్య సమస్యలకు, వ్యాధులకు కారణమౌతున్నందున ఈ సమస్యకు పరిష్కారంగా సేంద్రియ వ్యవసాయ విధానంలో పండించిన చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, ఊదలు, అరికలు, అండుకొర్రలు వంటి దేశీయ ఆహారమైన చిరుధాన్యాల వాడకంతో ఆధునిక రోగాల నియంత్రణ మరియు నిర్మూలనపై పద్మశ్రీ పురస్కార గ్రహీత, కృషిరత్న, స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌ వలి గారు అవగాహన కల్పిస్తారు. అలాగే చిరుధాన్యాల సాగు, ప్రకృతి వ్యవసాయంపై కూడా అవగాహన కల్పించబడును. ఔషధ మొక్కల సాగు, వాడకంపై రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని రాయపూర్‌లోగల మెడిసినల్‌ ప్లాంట్స్‌ బోర్డ్‌ CEO శ్రీ జె.ఎ. చంద్రశేఖర ‌రావు పాల్గొని అవగాహన కల్పిస్తారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం. యంత్రపరికరాల ప్రదర్శనతోపాటు దేశీయ విత్తనాల స్టాల్స్‌ ఏర్పాటు చేయబడును. ఒక్కో రైతుకు ఒక కిలో కొర్ర విత్తనాలు ఉచితంగా అందజేయబడును. ఔషధ మొక్కలు ఉచితంగా పంపిణీ చేయబడును. మధ్యాహ్నం millets ఉచిత భోజనం కలదు. మరిన్ని వివరాలకు 97053 83666; 70939 73999 ఫోన్‌ నెంబర్లలో సంప్రదించగలరు.