13 Dec , 2023

స్కూల్ లో పండించిన కూరగాయలతో మద్యాహ్న భోజనం

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం ఖోడద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయుల బృందం కలిసి సాగుబడి గా మార్చారు. ఓ వైపు పాఠాలు బోధిస్తూనే.. మరోవైపు కూరగాయల సాగుపై దృష్టి పెట్టారు. ఇక్కడ 19 రకాల కూరగాయలను ఎలాంటి క్రిమిసంహారక మందులు ఉపయోగించకుండా సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. గ్రామంలో తడి, పొడి చెత్తను సేకరించి తయారు చేసిన వర్మి కంపోస్టును సాగుకు వినియోగిస్తున్నారు. దీనితో విద్యార్దులకు వ్యవసాయంపై అవగాహాన కల్పిస్తున్నారు. పండిన తాజా ఆకు కూరలు, కూరగాయలను మధ్యాహ్న భోజనానికి వాడుతున్నారు. విద్యార్థులకు రోజుకో రకమైన వంటకాన్ని అందిస్తున్నారు. కొద్దిపాటి పెట్టుబడితో పిల్లలకు పౌష్టికాహారం అందిస్తుండగా, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.