02 Dec , 2023

తుఫాన్ అలెర్ట్ ! వాతావరణ హెచ్చరిక !!

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శక్తివంతమైన తుఫాన్‌గా మారే ప్రమాదం ఉంది. పసిఫిక్‌ సముద్రం మీదుగా వచ్చే తూర్పుగాలుల ప్రభావంతో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మంచి వర్షపాతం నమోదవుతోంది. రానున్న రోజుల్లో సముద్రతీరంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కావున ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని, వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నందున కోతలలో కొనుగోళ్ల సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. త్వరగా కోతకు వచ్చే శనగ, మినుము, మొక్క జొన్న పంటలను త్వరగా కోతలు ముగించుకొగలరు. వచ్చే 3, 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు కురిసే ఈ వర్షాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.